యువ

అసాధ్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసక్తి సాఫ్ట్‌వేర్ రంగంపైనే కానీ చదివింది కామర్సు
వైఫల్యాలనుంచి పాఠాలు నేర్చిన కుర్రాడు
వేలకోట్ల సంస్థకు ప్రస్తుతం సిటిఒ
స్ఫూర్తినిస్తున్న అజయ్ విజయగాథ

సామాన్య గ్రాడ్యుయేట్
వేలకోట్ల సంస్థకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కాగలడా?
ఇంగ్లీషు భాషపై పట్టులేని ఓ పేద కుర్రాడు
సాఫ్ట్‌వేర్ రంగంలో నెగ్గుకురాగలడా?
అయితే ఇలాంటి సందేహాలతో అజయ్ కాలక్షేపం చేయలేదు.
కలం నిజం చేసుకోవాలనుకున్నాడు. సాధించాడు.
జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి!
డబ్బు, కీర్తిప్రతిష్టలు దక్కాలి..
పల్లెటూరిలో పుట్టి, సాదాసీదా చదువుతో నెట్టుకొచ్చిన ఓ యువకుడి కల ఇది. అయితే అది కేవలం కలగా మిగిలిపోలేదు. నిజం చేసి చూపించాడు.
కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ మాత్రమే చేసిన ఆ యువకుడు అనుకున్నది సాధించాడు. వేలాది కోట్ల టర్నోవర్‌తో నడుస్తున్న ఓ బహుళజాతి సంస్థకు ప్రస్తుతం అతడు సిటిఒ. అయితే ఇదంతా ఒక్కరోజులో అతడు సాధించలేదు. ఎన్నో ప్రయోగాలు, వైఫల్యాలు, గుణపాఠాలు, అమ్మ, సోదరుడు, భార్య, ఒకరిద్దరు స్నేహితులు తోడుగా నిలవడంతో కల నిజం చేసుకున్నాడు.
***
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందాకు చెందిన అజయ్ ప్రస్తుతం ఇండోనేషియాలోని తొలి సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గోజెక్‌కు సిటిఒగా పనిచేస్తున్నాడు. ఆ సంస్థ భారత కేంద్రం బెంగళూరుకు, ఆ దేశ రాజధాని జకార్తాకు నిత్యం విమానాల్లో తిరుగుతున్న అజయ్ వయస్సు నలభై. కేవలం సాధారణ కామర్సు గ్రాడ్యుయేట్ ఇంత ఉన్నత స్థానానికి ఎలా వెళ్లాడు? అనుకున్నది సాధించడానికి అతడు ఏం చేశాడన్నది అసలు కథ
అమ్మే స్ఫూర్తి
అజయ్ తాతముత్తాతలు జమీందారులు. అతడు పుట్టేసరికి ఆ హోదా, సంపద హరించుకుపోయాయి. ఒకప్పుడు బంగారు, వెండి పళ్లాల్లో భోజనం చేసిన ఆ కుటుంబం చివరకు విద్యుత్ మరమ్మతులు, వైండింగ్ పనులతో పొట్ట నింపుకోవాల్సిన స్థితికి చేరుకుంది. అయితే పేదరికంలోనూ తామంతా అన్యోన్యంగానే ఉండేవారమని, ఒకరిపై మరొకరు చిరాకు పడిన సందర్భాలు లేనేలేవని గుర్తుచేసుకుంటాడు అజయ్. ఫైన్‌ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన తల్లి అతడికి స్ఫూర్తి. సాహిత్య కళా అకాడమీలో ఆమెకు అవకాశం వచ్చినా కుటుంబం కోసం వదులుకుంది. అజయ్ స్నేహితులకు బొమ్మలు గీసేది. బాగా డబ్బున్నవారి పిల్లలకు బొమ్మలు గీసి డబ్బులు వసూలు చేసేది. స్కాలర్‌షిప్ సాధించడానికి అవసరమయ్యే పరీక్షలు రాసేందుకు తనకు ప్రిన్స్‌పాల్ అవకాశం ఇవ్వకపోతే అతడితో వాదించి అవకాశం రాబట్టడంలో తల్లి చేసిన పోరాటమే తనకు స్ఫూర్తి అంటాడు అజయ్. వనరులు లేకపోవడం అనేది పెద్దసమస్య, అయితే జాగ్రత్తగా ఆలోచిస్తే దానికీ పరిష్కారం దొరుకుతుంది, అప్పుడు జయం మనదే అని తన తల్లి చెబుతుండేదని అంటాడతడు. ఎప్పుడూ ఏదోఒకటి నేర్చుకోవాలి, సమస్యను అర్థం చేసుకునే శక్తిని సాధించాలి, అప్పుడే దానిని పరిష్కరించడం సాధ్యమవుతుందన్నది ఆమె నేర్పిన పాఠం అంటాడు అజయ్. ప్రస్తుతం అతడు చేస్తున్న పని అదే.
900 రెట్ల అభివృద్ధి
వేలాది కోట్ల రూపాయల పెట్టుబడితో నడుస్తున్న సాఫ్ట్‌వేర్ సంస్థ గోజెక్. రోజూ కోట్లాది సమస్యలు ఎదురవుతూంటాయి. క్షణాల్లో పరిష్కారాలు కనుగొంటూనే ఉంటారు. అతి తక్కువమంది అంటే కేవలం 135 మంది ఇంజనీర్లతో రోజూ పనులు చక్కబెడుతున్నారు. అతడు సిటిఒగా బాధ్యతలు చేపట్టే నాటికి కేవలం నాలుగు ఉత్పత్తులు అందించే ఈ సంస్థ ఇప్పుడు 18 రకాల ఉత్పత్తులను అందిస్తోంది. గత డిసెంబర్ నాటికి రోజూ 5 లక్షల లావాదేవీలు నిర్వహించే స్థాయికి చేర్చాడు అజయ్. అంటే దాదాపు 900 రెట్ల అభివృద్ధి అన్నమాట. ఉబర్, గ్రాబ్ వంటి సంస్థల నుంచి పోటీని తట్టుకుని తమరంగంలో అగ్రగామిగా గోజెక్ ఉందంటే అంతా అజయ్ చలవే. గోజెక్ 120 మైక్రో సర్వీసులు అందిస్తోంది. సెకనుకు 180 మిలియన్ల ఇంటర్నల్ ఎపిఐ కాల్స్‌ను ప్రాసెస్ చేస్తుంది. అన్ని లావాదేవీలు పదహారు ఉత్పత్తుల సేవలు ఒకే యూజర్ ఐడీపైనే నిర్వహిస్తారు. ఇదంతా నమ్మశక్యం కాదు. ఎక్కడా తడబాట్లు, చొరబాట్లు ఉండవు. బస్సులు, ఈవెంట్ వెహికల్స్ నిర్వహణ, అలర్ట్ మెసేజింగ్ (బిజినెస్ మెట్రిక్స్ బేస్‌డ్ అలర్ట్ సిస్టమ్) వంటి సేవలూ అందిస్తుంది గోజెక్. క్లౌడ్ టెక్నాలజీతో నడిచే గోజెక్ సర్వర్లు సింగపూర్, జకార్తా, తైవాన్‌లలో ఉంటే బెంగళూరులో దాని వ్యాపార అభివృద్ధి కేంద్రం ఉంది. సరే అజయ్ సారథ్యంలో ఇదంతా ఎలా సాధ్యమైందంటే అదో కథ.
వైఫల్యాల నుంచి..
హిందీ మీడియం స్కూలులో ప్రాథమిక విద్య చదివి, అలహాబాద్ వర్సిటీలో కామర్స్ గ్రాడ్యుయేషన్ చేసిన అజయ్‌కు ఇంగ్లీషులో పట్టులేదు. సాంకేతిక విద్యపై మక్కువ ఉన్నా చదువుకునేందుకు అవకాశం లేకపోయింది. మనసులో అదెప్పుడూ మెదులుతూనే ఉండేది. తమ్ముడ్ని చార్టెడ్ అక్కౌంటెంట్‌ను చేయాలన్నది అన్న ఆశ. నిరుత్సాహంతో ఉన్న అజయ్‌కు పెద్దన్న తెచ్చుకున్న కంప్యూటర్ ఓ అద్భుతంలా కనిపించింది.
కుస్తీపట్టాడు. కొంత నేర్చుకున్నాడు. డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నం చేశాడు. గ్రాఫిక్ డిజైనర్‌గా అవకాశం వచ్చింది. సొంతంగా ఓ టెలిఫోన్ డైరక్టరీని తయారు చేశాడు. ఈలోగా ఎన్‌సిఎస్‌టి (నేషనల్ సెంటర్ ఫర్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ) సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ డిప్లమొ ఆఫర్ చేస్తోందని తెలిసి వెళ్లాడు. నిరాశ తప్పలేదు. ఓ సైబర్ కేఫ్‌కు వెళ్లి సి, సిప్లస్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. లినుక్స్‌పై ఇదంతా సాధించాడు. కోడ్స్ రాయడం మొదలెట్టాడు. నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులకోసం ఏదో ఒకటి చేసేవాడు. జావా, జి ప్రోగ్రామింగ్, విండోస్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. ఆ తరువాత ‘హాపర్’ అనే సంస్థలో చేరాడు. లొకేషన్ బేస్డ్ చెక్‌ఇన్ సర్వీసులు అందించే సంస్థ అది.
ఆ పని నచ్చలేదు. అజయ్, భార్య శద్ధ్రతో కలసి ఓ స్కూల్ పెట్టాడు. 50మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేవారు. అదీ సంతృప్తినివ్వలేదు. పాత సంస్థల్లోని స్నేహితులతో కలసి థాటవుట్స్, సి42 అనే సంస్థల తరహాలో కోడెల్‌గ్నిషన్ అ ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. వీటన్నింటికి ప్రతినిధిగా కోడ్‌మంక్ అనే సంస్థ వ్యవహరించేలా ఏర్పాటు చేసుకున్నాడు అజయ్. గోజక్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవడంతో నిరంజన్ పరాంజపే (సి42 సిటిఒ), సుమిత్ గుప్త (సిటిఒ కోడెల్‌గ్నిషన్)తో కలసి అజయ్ జకార్తా వెళ్లాడు. రెండునెలలు పనిచేసి సమస్య పరిష్కరించాడు. ఆ తరువాత మరో బృందాన్ని పంపి పనులు చక్కబెట్టాడు. వీరి పనితీరు మెచ్చుకున్న గోజెక్ సంస్థ కోఫౌండర్ నదియమ్ మకరిమ్ సి42, కోడెల్‌గ్నిషన్ సంస్థలను విలీనం చేసుకున్నాడు. ఆ తరువాత గోజెక్‌కు సిటిఒగా ఎదిగాడు. అతడు ఇండోనేషియాకు వెళ్లాడు. బెంగళూరులో గోజెక్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మొత్తానికి కామర్స్ గ్రాడ్యుయేట్ ప్రస్తుతం వేలకోట్ల సామ్రాజ్యానికి సిటిఒగా ఎదిగాడు. కలలను నిజం చేసుకోవడానికి ప్రయోగాలు, పట్టుదల, గుణపాఠాలు నేర్చుకోవడమే కారణమయ్యాయంటాడు అజయ్.