భక్తి కథలు

కాశీఖండం 176

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు ఆ మహాదేవి సత్యవతీ నందనుడయిన వ్యాసుడితో ఈ ప్రకారం పలుక పూనుకుంది. ‘‘నువ్వు కడుపు నిండుగా ఆరగించావా? నీ శిష్య సమూహం యధేచ్ఛగా భోజనం ముగించారా? మీ శిష్యగణంలో వేళ తప్పిపోవడంవల్ల దూరంగా మిగిలివున్న వారెవరైనా వున్నారా?’’
అని ఆ మహాదేవి పలుకగా వేదవ్యాస మహర్షి ‘‘మహాదేవీ! షడ్రసాలలోనూ ఒకటి ఎక్కువ అవడం, మరొకటి తక్కువవడం, ఇంకొకటి ఎక్కువ తక్కువలుగా వుండటం అనే మూడు తెరగుల చేత మొత్తం పద్ధెనిమిది విధాలుగా ఆస్వాదింపతగి భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలు అనే చతుర్విధ ఆహారాలున్నూ మంజిహ్వలకు పండుగ చేశాయి. కడుపార ఆకంఠంగా భుజించాము. రెండు నాళ్లుగా ఉపవాసం వుండడంవల్ల జనించిన ఆ కటి చిచ్చు చల్లారింది. వేళ తప్పిపోయి భోజనం చెయ్యకుండా దవ్వుల వున్న వారు మా శిష్యగణంలో ఎవ్వరూ లేరు. ఇది ఇంతకుముందెప్పుడూ విని వుండలేదు. చూచిన్నీ వుండలేదు. ఈ విధమైన అద్భుతాలు వుంటాయా? భోజన పాత్రల్లో విచిత్రాన్నాలు, కూరలు, పచ్చళ్లతో సహా తమంత తాము ఆవిర్భవించడం ఏ రీతిగా సంభవం? మీ ప్రభావం మీరే ఎరుగుదురు. మాకు తోచేది ఏమిటి అంటే నువ్వే విశాలాక్షీదేవివి. ఈ అయ్య ఆ విశే్వశ్వర మహాదేవుడు అయి వుండాలి’’ అని పలికాడు. వ్యాసుడి వాక్కులు ఆలకించి విశాలాక్షీ దేవి వ్యాసుడు కాశికి చేయతలపెట్టిన అపరాధానికి తగిన రీతి శిక్షింపతలచి ఈ పగిది నుడివింది. ‘‘వేదాలని విభాగించిన వ్యాసా! ఈ రీతిగా కడుపార మృష్టాన్నం లభించిననాడు కాశీ భద్రం అవుతుంది. ఆహారం లభించకుండా వుంటుందా? అన్నం పుట్టని రోజున నువ్వు కాశిని శపించడం ధర్మమా? అన్నం పుడితే దీవన, పుట్టకుంటే దూషణ!
వ్యాసా! పురాణాలు పద్ధెనిమిదిన్నీ ఏలాగున చెప్పావయ్యా? విభజన చేసి వేదాలు నాలుగూ వేర్పరచి ఏ విధంగా కట్టడి చేశావు? ఉక్తి వైచిత్రి మనస్సులను మురిపించే రీతిగా నువ్వు భారతాన్ని రచించావు? నువ్వు రుషివి ఎట్లు అయావు? ఒక్కనాడు పొట్టకు భిక్షాన్నం లభించకున్నంత మాత్రంలో పుణ్యగుణాలకు రాశి అయిన కాశిని శపింతలచావే! నిర్మల జ్ఞాన బోధకి క్రోధం ఫలమా? తీర్థవాసం చేసే నరులకి కోపం అర్హమా? వారణసిపయిన కోపిస్తే అట్టి నరుడిపై విశే్వశ్వరుడు కోపింపక మిన్నక వుంటాడా? ఈ కాశి మోక్ష స్థానం. ఈ తీర్థానికి ఏ జనుడు అన్యాయం చేయతలుస్తాడో వాడు రుద్రపిశాచాం అవుతాడు’’ అని పలికి ఆ భవాని శివుడి ముఖం వంక చూసింది.
‘‘వీడు కాశీలో నివసించడానికి అర్హుడు కాడు. వెడలిపొమ్మని చెప్పు. వెయ్యిమాటలు ఎందుకు? కోప స్వభావనుడు ఏమి? కైవల్య జన్మగృహం నా నివాసం. కాశీ ఎక్కడ?’’ అని విరూపాక్షదేవుడు పరుషాక్షరాలతో తన్ను భయపెట్టి పలుక- కలత చెంది, వడవడ వణికిపోతూ వేదవ్యాసుడు ఆ ఆదిదంపతుల- జగత్పితరుల చరణారవిందాలకి నమస్కరించి ‘‘నేను అపరాధం కావించాను. కోపం ఉపసంహరింపవలసింది’’ అని ప్రార్థించాడు.
‘‘కాశీ నగరంలో పూర్వం వలె కాక నువ్వు, నీ శిష్యవర్గం ప్రతి మాసశివరాత్రికి రాగల వాడవు అవుతాడు.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి