నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఆ యమునా ద్వీపమున న
మేయుఁడు కృష్ణుఁడయి లీలమెయిఁ గృష్ణద్వై
పాయనుఁడనఁ బరఁగి వచ
శ్రీ్శయుతుఁడు తపంబునంద ఁ జిత్తము నిలిపెన్

భావం: ఆ యమునా ద్వీపంలో మహనీయుడు, నల్లని వాడు, వచస్సంపన్నుడు అయినట్టి అతడు కృష్ణద్వైపాయనుడన్న పేరుతో ప్రసిద్ధుడై తపోమార్గంలోనే మనసు నిలిపాడు. పరాశరుడు సత్యవతికి కోరినవరాలిచ్చి వెళ్లిపోయాడు. అంతట కృష్ణద్వైపాయనుడు జింక చర్మపువస్త్రంతోను, ఎఱ్ఱని జడలతోను, దండకమండలాలను ధరించి తల్లి ముందర నిలచి ఆమెకు మ్రొక్కి‘మీకు పని కలిగినప్పుడు నన్ను తలవండి; ఆ క్షణమే నేను వస్తా’’ని చెప్పి పరమ పవిత్రుడైన ఆ వ్యాసుడు లోకహితానికై తపోవనానికి వెళ్లి అక్కడ మహాభయంకరమైన తపస్సు చేస్తూ ఉండిపోయారు. సత్యవతి ఆశ్చర్యానందాలకు లోనైంది. తనకు పట్టిన అదృష్టానికి, మహర్షి అనుగ్రహానికి తబ్బిబ్బు అవుతోంది. అటువంటి తల్లికి వ్యాస మహర్షి మరో వరాన్ని అనుగ్రహించి వెళ్లాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము