భక్తి కథలు

హరివంశం 47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన భుజ పరాక్రమమూ, బాహుబలాటోపమూ గొప్పగా పొగడుకున్నాడు. వజ్రాహతి వంటి నా చేతి చరుపులకు కొండలు కూలిపోయినట్లు ఈ దుండగపు ఆబోతులను చెండాడుతాను అని భుజాలు చరచుకున్నాడు. అక్కడి మైదానంలో కృష్ణుడు ఎట్లానైనా తమ మీదికి వస్తాడని కళ్ళ నిప్పులు రాలుస్తూ ఘోరంగా రొప్పుతూ రోజుతూ ఎదురు చూస్తున్నాయి ఆంబోతులు. అపుడు ఘోషవంతుడు వాటిపై దాడి వెడలి వాటిని పట్టి, ముట్టడించి మట్టుపెట్టి గిట్టింపజేయాలని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వాటిని సమీపించాడు తన బాహువులను విస్ఫారంగా పైకి ఎత్తాడు.
సింహధ్వానం చేశాడు. కళ్ళ వెంట విస్ఫులింగాలు రాల్చాడు. అగ్నిహోత్రుడిలా మండిపడ్డాడు వాటిని చూస్తూ. ఆ ఆబోతులు కూడా వాటి కళ్ళ వెంట అగ్నిజ్వాలలు వ్యాపింపజేశాయి. కొమ్ములు వంచి మండలాకారంగా ఘోషవంతుణ్ణి చుట్టుముట్టాయి ఒక్కుమ్మడిగా. అపుడక్కడ సమావేశమైన జనులంతా గడగడ వణికిపోయినారు.
భీతాహులై చెల్లచెదరైనారు. గోడలు, మిద్దెలు, చెట్లు, గట్లు పాకారు. ఈ విధంగా వాటి మధ్యకురికి ఒక ఆంబోతు ముఖం మీద పిడికిటితో గట్టిగా కొట్టాడు. జనమంతా అతడి సాహసాన్ని పొగిడారు. అపుడు కమల నయనుడికి ఘోషవంతుడి పట్ల జాలి కలిగింది.
ఈ ఆబోతులు ఇతణ్ణి విడిచిపెట్టవు, ముట్టుపెడతాయి అని తోచింది. శ్రీకృష్ణుడూహించినట్లుగానే మూకుమ్మడిగా ఒక్కసారి తమ కొమ్ములన్నీ అతడి శరీరంలోకి దింపి పైకెత్తి కిందపడవేశాయి ఆ మేటి వీరుణ్ణి. అతడు వాటి ధాటికి ఆగలేక స్పృహ తప్పాడు. అపుడా క్రూరదనుజ పశువులను అక్కడ కనపడినవాడినల్లా పొడవటం, గిట్టలతో తాటించటం, కాళ్ళతో తాటించటం చేసి గగ్గోలు సృష్టించాయి. ఆ ప్రదేశమంతా హాహాకారాలతో నిండిపోయింది. అపుడు నంద నందనుడు మందహాస సుందర వదనారవిందుడై అన్నతో ఇట్లా అన్నాడు. ‘అన్నా! ఇవి ఆంబోతులు కావు. ఆబోతులలో ఇంతటి రాక్షసత్వం ఉండదు. ఇంతటి క్రౌర్యం, హింసోద్ధతి, పగ, ఇంత ఘోర విజృంనణ ఉండవు. మన గోపాల వంశానికే అపకీర్తి వీటిని ఇట్లా విడిచిపెట్టడం.
చూస్తూ ఉండు వీటి మదం ఇపుడే అణివేస్తాను. మామ భయం పోగొడతాను. పూర్వయుగంలో తారకామయమనే ఘోర దేవాసుర యుద్ధం జరిగినపుడు కాలనేమి పుత్రులను ఏడుగురిని నేను వధించాను కదా! వాళ్ళు నాపై పగబట్టి నాకు హాని తలపెట్టి ఇట్లా ఆబోతులై పుట్టారు. శత్రు శేషం ఉంచకూడదు. ఇపుడే ఈ ఆబోతులను వధిస్తానని సవిలాసంగా పలుకుతూ ఇందువల్ల మన బంధువులను కాపాడటమే కాక నీల కూడా నాదవుతుంది. శ్రీ్ధముడంటే నాకెంతో ఆపేక్ష.
అతడు నీలను నేను పెళ్లి చేసుకుంటే ఎంతో పొంగిపోతాడు అని అన్న అనుజ్ఞ పొందాడు కృష్ణుడు. అయితే నంద గోపుడు, యశోద కృష్ణుడి సాహసం చూసి ‘వద్దు వద్దు’ అని ప్రాధేయపడ్డారు. కుంభకుడికి మాత్రం ఎంతో సంతోషం కలిగింది. అక్కడ ఉన్న గోపకులు కొందరు భయ సంభ్రమ మనస్కులైనారు. మరికొందరు ఆనందతుండిల హృదయులైనారు. అపుడు కృష్ణుడు ఆ ఆబోతులను సమీపించి వాటిని అదిలించాడు. కోపంగా కసరుకున్నాడు.
‘దుష్టరాక్షసులారా! ఇన్నాళ్ళూ మీ ఇష్టం వచ్చినట్లు చెలరేగారు. గోకులాన్ని వ్యాకులపరిచి పశువులను చంపారు. ప్రాణ హింసకు పూనుకున్నారు. ఇపుడు నా ఒక్కొక్క పిడికిటిపోటు పిడుగుపాటై మీ ప్రాణాలు తీస్తుంది.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు