భక్తి కథలు

హరివంశం 49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయురాగోగ్య సుఖ సంపదలతో, ఇష్టకామ్యసిద్ధితో మేమంతా పరమ సంతుష్టులంగా ఉన్నాము. నీవిచ్చినవన్నీ నాకు ముట్టినట్లే అనుకో అని సాదర ప్రియ వచనాలతో నంద యశోదలు కోడలును తమ వెంట బెట్టుకొని ప్రయాణమైనారు. ‘శ్రీ్ధముడు కూడా నా వెంట రావాలి, నేను నా ప్రియసఖుణ్ణి విడిచి ఉండలేను’ అని అత్తమామలకు నచ్చచెప్పి తన మేనమరిదిని కూడా వెంట తీసుకొని నీలతో, నీలవర్ణుడు బృందావనం చేరుకున్నాడు. ఆ తరువాత ఆయనకు ప్రథమ వ్వనం అంకురించింది.
గో పరిపాలన, క్రీడాలోలత్వం నంచి పెరిగి పెద్దవాడైనాడు. వ్వన వికాసంతో వరింత సౌందర్యం ఆయనను వచ్చి చేరింది. రోజు రోజుకూ ఆయన గోపికల నయన మనోహరుడవుతున్నాడు. తమ నయన చకోరాలకు శ్రీకృష్ణుడు పూర్ణచంద్రుడిలాగా ఆకర్షణీయుడైనాడు. కూకటి ముడి కాస్తా పట్టెడు ముడిగా ముడుస్తున్నాడు. నూనూగు మీసాలు వదనానికి ఒక వింత సోయగాన్ని, కళ్ళకు ఒక వింత కాంతిని చేకూరుస్తున్నాయి.
నడుము అందంగా రూపుదిద్దుకొని వక్షస్థలం విశాలమవుతూ వచ్చింది. మూపులు కొత్త అందాలను సంతరించుకున్నాయి. కనురెప్పలు, బొమలు కొత్త తళతళలు చూపుతున్నాయి. నడకలో వయ్యారాలు వచ్చి చేరాయి. కంఠ స్వరంలో మనోజ్ఞత వ్వన శోభాకలితంగా ఉంది. చేతలు పొడవైనాయి. వెన్ను అందాలు చూపుతున్నది. ఆయన సౌందర్య శోభా పరిపూర్ణుడైనాడు.
బలరాముడు కూడా వ్వన వికాసంతో తేజరిల్లాడ. సవయస్కులతోడి వారి క్రీడలు, గోపరిపాలన యథాపూర్వం కొనసాగుతున్నాయి. అయితే అడవులలో వారు యధేచ్చగా కొత్త కొత్త ప్రదేశాలలో విహరిస్తున్నారు. యమనా తీర పరిసరాలలో వేణునాద వినోదుడై సర్వప్రకృతిని పులకింపజేస్తున్నాడు కమలాక్షుడు. పచ్చని పట్టి పీతాంబరం ధరించి నడుము చుట్టూ పట్టు ధట్టీ చుట్టి, తల చుట్టూ పట్టు నెట్టెంలో నెమలి పింఛం ధరించి నవ వికసిత వన పుష్పమాల వక్షస్థలంలో ధరించి మనోహరంగా వేణువు నూదుతూ ఆయన వన సంచార కుశలుడైనాడు. ఇట్లా బృందావనారణ్యంలో విహరిస్తుండగా ఆయన ఒక పరమాద్భుతమైన మర్రి చెట్టును చూశాడు ఒకరోజు ఆయన.
ఆ వట వృక్షం బోదె బహు విస్తీర్ణం వ్యాపించుకొని ఉంది. అది అంబర చుంబిగా ఉంది. అసంఖ్యాకమైన దాని శాఖలు బహు విస్తారంగా నాలుగు దిక్కులూ వ్యాప్తి పొంది ఉన్నాయి. సనాతనమైన వేద శాఖలులాగా దాని శాఖలు ద్విజ (పక్షి) బృందాలకు సేవ్యమానంగా ఉన్నాయి. మహామేఘాలంలాగా అది ఆకాశాన్ని అచ్ఛాదించి ఉంది. పెద్ద కొండలాగా దానిననేక ఊడల మర్రి చెట్లు ఆవరించి ఉన్నాయి. అది గొప్ప గృహస్థులాగా అనేక జన సమాశ్రయం కలిగిస్తున్నది. చీకటితో అది రసాతలాన్ని అనుకరిస్తున్నది. అది ఒక పెద్ద సేనావ్యూహాన్ని తలపింపజేస్తున్నది. విష్ణు వక్షస్థలంలాగా వనమాల విరాజితంగా ఉంది. ఆరణ్య ముని బాలకుల వేద మంత్ర పూజితంగా ఉండి పరబ్రహ్మ స్వరూపాన్ని తలపింపజేస్తున్నది. అడవి ఏనుగులు కోరాడటంవల్ల వాటి దంత ఘట్టన చిహ్నితంగా ఉంది. సింహపు జూలు వలె స్నిగ్థమైన కిసలయ విలసితంగా ఉంది. శబర కుమారులు తమ ఆయుధాలు పదును పెట్టుకొనే స్కంధ సుందరంగా ఉంది. సిద్ధ తరుణులు విలాస విహారాలు చేయటానికి అనువుగా ఉంది. ఆ వట వృక్షం పేరు భాండీరం. అది బహు పురాతన అతి పవిత్ర వటవృక్షం.
ఆ చెట్టునీడలో కృష్ణ బలరాములు ఆసీనులై వినోదిస్తూన్నారు. వారి గో సమూహం ఆనందంగా నెమరువేస్తున్నాయ.

ఇంకాఉంది

- అక్కిరాజు రమాపతిరావు