భక్తి కథలు

హరివంశం- 73

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సద్గుణ భూషితమైన రాజ వంశంలో జన్మించిన వాడెవడూ ఇట్లా కారుకూతలు కూస్తాడా? అసలు నీకు రాజ్యార్హత వుందా? రాజ వంశంలో జన్మించావా? నిన్ను అనవలసిన పనిలేదు. నీ తల్లిదండ్రుల దౌర్భాగ్యం ఇది. వాళ్ళు కొర నోములు నోచుకున్నారు. నీవలవల్ల వంశనాశనం జరగబోతున్నది. నీవల్ల యాదవ కులమంతా నిందాస్పదమైంది. తనను తాను పొగడుకోవటం ద్వారా లోకంలో ఎవడూ ప్రజామోదాన్ని పొందలేడు.
ధర్మానువర్తనం, పెద్దల సేవ పట్ల సద్గుణాలు లభిస్తాయి ఎవరికైనా? నీది పాపపు పుట్టుక. దానికి అనుగుణంగానే ఇపుడు నీ దుష్ట్భాషణ వున్నది. సజ్జనుణ్ణి, కుల పెద్దను దూషించటం అనలం మూట కట్టుకోవటం వంటిదే. పూజార్హుణ్ణి అవమానించటం మహాపాతకం. అది రాజును హత్య చేయటం వంటి పాపం.
మహానుభావుల నడవడులు నీకెట్లా తెలుస్తాయి? నీలో శాంతి నిప్పచ్చరం. మత్సరగ్రస్తుడివి నీవు. మంత్రపూతమైన ఆజ్యాహుతులు యజ్ఞకుండంలోని అగ్నిని ఎట్లా ప్రవృర్థం చేస్తాయో సత్పురుషులను నిందిస్తే ఆ దుష్ట వచనాలు వాళ్ళను అట్లా సంక్షోభపరుస్తాయి. ఆ సంక్షోభం నీకు కీడు కలిగిస్తుంది. వసుదేవుడు తన పుత్రుడికి ఆపద రాకుండా రహస్యంగా దాచుకున్నాడని నిందిస్తావు? ఏ తండ్రి అయినా తన కుమారుణ్ణి దాచి ఉంచి రక్షించుకోడా?
నీ తల్లిదండ్రులు నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేయకుండానే నీవింతవాడివైనావా? వాసుదేవుణ్ణి దూషించటం, వసుదేవుణ్ణి నిందించటం యాదవ వంశ నాశనానికి కారణం కాక మరి ఏమిటి? ఇంతకూ నిన్ననవలసిన పనిలేదు. మా దౌర్భాగ్యం మేము నిందించుకోవాలి. నిన్ను విడిచిపెట్టి మా బతుకులు మేము బతకలేకపోతున్నాము. రామకృష్ణులను ఆదరించి, అభిమానించి, ఆహ్వానించి మనందరం వారితో కలిసి మెలిసి ఉంటే ఎంతో బాగుండును. అప్పుడు మనంత భాగ్యశాలురు పుణ్యాత్ములు ఈ లోకంలోనే మరొకరు ఉండరు. ముల్లోకాలలో అపుడు నీ అంత తపశ్శాలురెవరూ ఉండరు. కాని నీకా మహద్భాగ్యం లేదు. మాకు ప్రతి రోజూ దుశ్శకునాలు ఎదురవుతున్నాయి. దుర్నిమిత్తాలు తోస్తున్నాయి.
ఇటువంటి దుశ్శకునాలు ఆ దేశపు రాజుకు ప్రాణాపాయాన్ని సూచిస్తాయని దైవజ్ఞులు చెపుతారు. నీకు ఏదో పెద్ద ఆపద రాబోతున్నది. ఆ కీడును తప్పించటం ఎవరి తరమూ కాదు. మనందరిలో అక్రూరుడొక్కడే మహదైశ్వర్యశాలి. బృందావనం నుంచి సకల శుభాలతో అక్రూరుడెప్పుడు వచ్చి మాకు కనపడతాడా అని మేము ఎదురుతెన్నులు చూస్తున్నాము.
మా పుణ్యం పండి ఆయన నందసుతుణ్ణి తన వెంట తీసుకొని రావాలని అభిలషిస్తున్నాము. నీకు మాత్రం గడవరాని కష్టాలు చుట్టుకోబోతున్నాయి అని అంధకుడు కటువుగా కంసుణ్ణి తిరస్కరించాడు. అపుడు తక్కిన పెద్దలు కూడా కంసుడిపట్ల ధిక్కారానే్న కనపరచారు. అపుడు కంసుడికి పట్టరాని కోపం వచ్చింది. వాళ్ళపట్ల నిర్లక్ష్యం కనపరుస్తూ అక్కడనుంచి విసురుగా వెళ్లిపోయినాడు. కుల పెద్దలు కూడా చేసేదేమీ లేక తమ నెలవులకు తాము చేరుకున్నారు.
కంసుడికి అంతరాంతరాలలో అశాంతి ప్రబలింది. అక్రూరుడు గోకులానికి వెళ్లి బలరామకృష్ణులను తన వెంట తీసుకుని వస్తే యాదవులంతా వాళ్ళపక్షంవారై పోతారని భయం పట్టుకుంది. తనను లెక్కచేయరన్న భీతి కలిగింది. కాబట్టి ఈ లోపుననే కృష్ణుడినుండి తనకు ప్రమాదం లేకుండా చేసుకోవాలనిపించింది. అందుకే కేశి రాక్షసుణ్ణి ప్రేరేపించాడు కంసుడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు