భక్తి కథలు

హరివంశం - 91

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుర్మార్గ క్రూర నిరంకుశుడైనాడు. సాధు రక్షణ కోసం, లోక హితం కోసం, ఈ దుష్టుణ్ణి పరిమార్చాను అని ఉగ్రసేనుణ్ణి ఊరడించాడు శ్రీకృష్ణుడు. ‘కంసుడి కర్మకాండ ఏ మాత్రం లోపం లేకుండా నిర్వహింపజేసే బాధ్యత నాది, అందుకు వలసిన సన్నాహమంతా మీరిప్పుడు చేయాలి’ అని చెప్పాడు. అపుడు ఉగ్రసేనుడు ‘ఇపుడు నీవే మా ప్రభువువు. యదు వంశాలన్నీ నీ ఆజ్ఞ జవదాటవు.
కంసుడి దుర్మార్గాన్ని క్షమించు. నీ అనుజ్ఞతో కంసుడికి ప్రేతా కార్యాలు నిర్వహిస్తాము అని కృష్ణుడికి దోసిలొగ్గాడు ఉగ్రసేనుడు. ‘తాతా! నీవింతగా నా అనుజ్ఞ కోరాలా? కంసుడి మీద నాకిప్పుడేమీ పగలేదు. నీ కొడుకు అపర కర్మలన్నీ అత్యంత వైభవంగా నిర్వహించు. అదీకాక ఇంకొక మాట కూడా చెపుతాను. ఇక ఈ యాదవ వంశాలన్నిటికీ నీవే మహారాజువు. ఈ రాజ్యమంతా నీదే. నీవు వానప్రస్థం చేయాలనుకుంటున్న కోరిక విడిచిపెట్టు. నీకు పట్ట్భాషేకం నేనే దగ్గరుండి నిర్వహింపజేస్తాను. రాజ్యస్వీకరణ కోసం నేను మధుర రాలేదు. కంస విదారణం కోసమే వచ్చాను. కంసుడు కుల నాశకుడు. నిన్నూ, నా తల్లిదండ్రులను, కులం పెద్దలను అనేక బాధలకు గురిచేశాడు. కాబట్టి హతుడు కావలసిందే. అందుకే వచ్చాను. రాజ్యాధికారంపై నాకెటువంటి ఆశ లేదు.
రాజ్య సంపదలు, వైభవమూ నేనేమీ కోరను. నాకు గోపాలత్వమే అన్నిటికన్నా ప్రియం. వ్రేపల్లె నాకు త్రైలోక్య సామ్రాజ్యం. నా పాటలు, నా ఆటలు, నా గోవులు నాకు చాలు. పోనీ! ఈ విధంగా అనుకో! రాజ్యం నాదైనా దానిని నీకిప్పుడిస్తున్నను అని భావించు. ఇపుడే నిన్ను సకల బాంధవ సమక్షంలో పట్ట్భాషిక్తుణ్ణి చేస్తాను. అపుడు నీవే మా అందరికీ రాజువవుతావు. రాజకార్యాలన్నీ నీవే నిర్వహించుకో అని వెంటనే భద్రాసనంపై ఉగ్రసేనుణ్ణి అధివసింపజేసి పట్ట్భాషేకం నిర్వర్తింపచేశాడు కృష్ణుడు. వసుదేవుడు మహామాత్యుడైనాడు. ఉగ్రసేనుడి రాజ్యానికి వసుదేవుడు సర్వాధికారి అయినాడు.
వెంటనే పుత్రులిద్దరికీ అంత్యక్రియలు, అపరకర్మలు శాస్త్రోక్తంగా నిర్వహించాడు ఉగ్రసేనుడు. కృష్ణుడు, బలరాముడు కొన్నాళ్ళు మధురలోనే ఉండిపోయినారు. పితృవాత్సల్యం తనివి తీర అనుభవించారు. మధుర అమిత విభవంతో అలలారుతూ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అన్నతో ఇట్లా అన్నాడు కృష్ణుడు. ‘మనం ఇప్పటిదాకా అడవి పల్లెలలోనే గడిపాము. విద్య నేర్వలేదు. గురుశిక్షణ ఎరుగము. గురువులను సేవించుకోలేరు. శాస్తవ్రాసనలు లేవు. రాజధర్మాలు, వేద విద్యలు గురుముఖతః అభ్యసించలేదు. అడవి మనుషులుగానే గడిపాము ఇప్పటివరకూ. కాబట్టి మనం ఇప్పుడిక ఆచార్యకపదిష్టమైన విద్యలు పొందాలి అని అన్నను కూడా అనుమతింపజేసి వాళ్ళు అవంతీపురం చేరారు.
అక్కడ కాశ్యప మహర్షి వంశానికి చెందిన సాందీపని అనే ఆచార్యుణ్ణి ఆశ్రయించారు. ఆయన వీళ్ళను ప్రియశిష్యులుగా స్వీకరించాడు. సమస్త విద్యలు, సకల కళలు అన్నదమ్ములు అచిరకాలంలోనే నేర్చుకున్నారు. అరవై నాలుగు రోజులలో కృష్ణ, బలరాములు నాలుగు వేదాలు, ఆరు వేదాంగాలూ చదివి స్వాయత్తం చేసుకున్నారు. ధర్మశాస్త్రం, తర్కన్యాయశాస్త్రాలు, గణితం, గాంధర్వం, చిత్రకళ, రధాశ్వగజ తురగ శిక్షణ ప్రావీణ్యం పనె్నండు రోజులలో వాళ్ళు సముపార్జించారు. సంగీత కళలో నిష్ణాతులైనారు. ధనుర్వేదమంతా సాంగోపాంగంగా ఏభై రోజులలో అభ్యసించి పరిపూర్ణులైనారు.
గురువు ఆశ్చర్యానికి అవధి లేకపోయింది వాళ్ళ ప్రజ్ఞా ప్రాభవాలు చూసి. వీళ్ళు మానవ రూపధారులైన సూర్యచంద్రులు అని నిశ్చయించుకున్నాడాయన.

-- ఇంకా ఉంది

- అక్కిరాజు రమాపతిరావు