భక్తి కథలు

హరివంశం - 93

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుపిత స్వరంతో కృష్ణచంద్రుడు తనకు వెంటనే అప్పగించవలసిందని యముణ్ణి ఆజ్ఞపించాడు. అపుడు యముడు గడ గడ వణికిపోయినాడు. ‘దేవా! దేవదేవా! దేవాదిదేవా! యమలోకంలోకి వచ్చిన సర్వ జీవుల పాపపుణ్య వర్తనలకు అనుగుణమైన శిక్షలు, రక్షలు, నిర్ణయించే హక్కు, అధికారం మాత్రమే నాకున్నాయి కాని, ప్రాణహరణం చేసి ఇక్కడు తీసుకొని వచ్చే కర్తవ్యం నాది కాదు. దానిని నేను అనుపాలించలేను. ఆ పని నిర్వహించేది మృత్యుదేవత. కాబట్టి దేవరవారు నన్ను కోపించవద్దు. మృత్యుదేవతను పిలిపించండి అని వేడుకున్నాడు యముడు. ‘ఏమిటీ! ఒకరిమీద ఒకరు నెపం తోసేస్తున్నారా? నేను ఇంత శ్రమ కోరుస్తున్నానన్న ఇంగితం కూడా లేకుండా, మా గురు పుత్రుణ్ణి అనే్వషిస్తున్నానన్న భయభక్తులు లేకుండా, ఆ మృత్యువు అవిధేయత చూపటానికి సాహసిస్తున్నాడు, ఈ మృత్యువు వామాచారం పాటిస్తున్నాడు, క్షుద్రశక్తులు తనకక్కరకు వస్తాయనుకుంటున్నాడు, నా శరీరాగ్నికి శలభమైపోతాడు అని కృష్ణస్వామి చేతిలోకి విల్లు తీసుకున్నాడు. కను మూసి తెరచినంత అవ్యవధానంగా మృత్యువు, గురుపుత్రుణ్ణి తీసుకొని వచ్చి స్వామి మ్రోల నిలిపి శరణువేడాడు.
తక్షణం గురుపుత్రుణ్ణి వెంట పెట్టుకొని వచ్చి సాందీపని మహర్షికి అప్పగించాడు కృష్ణుడు. ఆయన అత్యంతానంద భరితుడైనాడు. సురాసురులు, సర్వదేవతా గణాలు సృష్టిలో ఇటువంటిదెప్పుడూ జరగలేదని కొనియాడారు. సాందీపని మహర్షి కృష్ణుణ్ణి గాఢంగా కౌగిలించుకొని ఆశీర్వదించాడు. ఆ తరువాత కూడా కొన్నాళ్ళు కృష్ణ, బలరాములు అవంతిపురంలోనే ఉండి గదాయుద్ధంలో, ముసల విద్యా ప్రావీణ్యతలో నేర్పు సముపార్జించారు. ఆ తరువాత అన్నదమ్ములుల మధురానగరానికి పయనమైనారు. ఇట్లా అన్నదమ్ములు అవంతిపురం నుంచి వస్తున్నారనీ తెలిసి ఉగ్రసేనుడు, సమస్త యాదవ ప్రముఖులు వారికి ఘనస్వాగతం చెప్పారు. ఊరంతా గొప్పగా అలంకరింపజేశారు. మంగళ వాద్యాల కోలాహలం నగరమంతా మిన్నుముట్టింది. శంఖద్వానాలు చెలరేగాయి. దుందుభులు మ్రోశాయి. పురజనులందరూ ఇంటింట ఉత్సవం చేసుకున్నారు. అందంగా అలంకరించుకుని గోపాలకృష్ణుణ్ణి, బలరాముణ్ణీ చూడటానికి తరలివచ్చారు. ఏనుగులు, గుర్రాలు, గోవులు తమ ఆనందాన్ని ప్రకటించాయి.
దేవాలయాలలో విశేషార్చనలు జరిగాయి. వేల్పు ప్రతిమలు ప్రసన్న మంగళ దృక్కులు బరపి సౌందర్యాతిశయంతో శోభించాయి. మళ్లీ కృతయుగం వచ్చి మధురాపురిని ప్రవేశించిందా అనిపించింది సమస్త పురజనులకు. దుఃఖితుడు కాని, దీనుడు కాని, ఆతురుడు కాని ఆ నగరంలో అప్పుడు కనిపించలేదు. మహావిభవ సమృద్ధమైన సౌధాపరిభాగాల ఇరువైపుల నుంచి వనితాజనం తమ చూపులనే మంగళ హారతులుగా సమర్పించారు శ్రీకృష్ణుడికి. ఆయన కథలు ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందోత్ఫుల్లలోచనలైనారు.
ఈ విధంగా కృష్ణబలరాములు వసుదేవుడి రాజభవనానికి వచ్చి తల్లిదండ్రులకు మ్రొక్కి అవంతీనగర విశేషా చాలానాళ్ళు పుర ప్రముఖులకు తెలుపుతూ ఆనందంగా కాలం గడపసాగారు మధురలో. బృందావన విహారాలు గుర్తుకు వచ్చినపుడు అవి కృష్ణుడికి వింత స్మృతులను రేకెత్తించేవి. ఇట్లా మధురలో బంధువర్గం మధ్య ఆదరాభిమానాలతో వారు గడుపుతుండగా కృష్ణుడి బల పరాక్రమాలు, దివ్యత్వం లోకంలో ప్రకటిమవుతూ ఉండటం, తన అల్లుడైన కంసుణ్ణి కృష్ణుడు హతమార్చటం జరాసంధుడు కంటగించుకున్నాడు. కృష్ణుడి కీర్తి ప్రతిష్ఠలను ఏ మాత్రం సహించలేకపోయినాడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు