భక్తి కథలు

హరివంశం -100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబట్టి నన్ను పరిగ్రహించవలసింది అని వారుణీదేవి బలదేవుణ్ణి ప్రార్థించింది. ఇంతలోనే మరొక మానిని అక్కడికి వచ్చింది. బలరాముడితో ఇట్లా చెప్పింది. నా పేరు కాంతి. నేను చంద్రుడిని ఆశ్రయించుకొని ఉంటాను. నీపట్ల నాకు అనురాగం కలిగింది. ఆ చంద్రుడికన్నా నీవు సౌందర్యశాలివి. నీ రూపలావణ్యం అసదృశం అని ఈ ఇంతి బలదేవుణ్ణి వరించింది. ఇంతలో ఇంకొక కామిని కూడా ఆయనను సమీపించింది. నీవిప్పుడు సాక్షాత్తు పుండరీకాక్షమూర్తివి.
నాడు పాలకడలి మధించినుప్పుడు పుట్టిన లక్ష్మిని నేను. ఈ రత్నకిరీటం, ఈ మణికుండలాలు, ఈ పట్టుపీతాంబరాలు, ఇది రత్నసంకలితమైన ముత్యాలహారం. ఇవన్నీ అమృత్పోదన వేళ సముద్రంలో పుట్టాయి. ఇవి నీవి. అందువల్ల వీటిని సమర్పించటానికి వచ్చాను అని శ్రీదేవి వాటిని బలరాముడికి సమర్పించింది. ఈ విధంగా ఈ దేవతామూర్తులు చెప్పి ఆయనలో లీనమైనారు. ఆ తరువాత అత్యంత శోభాన్వితుడై బలరామదేవుడు కృష్ణుడున్న చోటుకి వచ్చాడు. అప్పుడొక అత్యద్భుతమైన సంఘటన జరిగింది.
పాలకడలిలో సుప్తుడైన శ్రీమన్నారాయణుడి దివ్యోజ్జ్వల నవరత్న కిరీటం వైరోచనుడనే పేరుగల రాక్షసుడొకడు దొంగిలించుకొని పోతుండగా గరుత్మంతుడు చూసి వాడి వెంబడి తరిమి ఆ రాక్షసుణ్ణి సంహరించి ఆ రత్న కిరీటాన్ని తీసుకొని ఆకాశం మీద వస్తుండగా సుపర్ణుడికి గోమంత మహాశైలం మీద కంసమర్దనుడు కనిపించాడు. మురళీ మోహనుడి వౌళి కిరీటరహితంగా ఉండటం చూసి వైనతేయుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఈయన ఆ ఆది పురుషుడే కదా! ఆయన అయితేనేమి ఈయన అయితేనేమి అని దివోలంకృత కిరీటాన్ని శ్రీకృష్ణుడు వౌళిపై అలంకరించాడు. ఈ విధంగా గరుత్మంతుడు స్వామి మస్తకంపై కిరీటాన్ని అలంకరించగాశ్రీకృష్ణుడు సాక్షాద్విష్ణుమూర్తిలాగా శోభిల్లాడు. అప్పుడాయన బలరాముడితో ఇట్లు అన్నాడు. బలరామా! ఇప్పుడీ దివ్య ఘటనలను బట్టి స్వర్ణోకవాసులు మనం ఈలోకానికి వచ్చిన పని అత్యంత శీఘ్రంగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నట్లు నాకనిపిస్తున్నది. కాబట్టి భూభారం తీర్చవలసిన సమయం దగ్గరలోనే ఆసన్నమవుతున్నది. వైరిరాజులు ఘోర రణరంగంలో పోరి హతులు కావలసిన తరుణం సమీపిస్తున్నది.
ఇప్పుడొక మహాయుద్ధం జరిగే సూచనలు కూడా తోస్తున్నాయి. యుద్ధ్భేరీ నినాదాలు దూరం నుంచే విన్పిస్తున్నాయి. దిక్కులతో ధూళి దూసరిత రక్తారుణిమ పొడగట్టుతున్నది. దూరాన సైనిక పతాకాలు రెపరెపలాడుతున్నాయి. వివిధాయుధధారులైన సైనిక సంచలన ఘోష వినపడుతున్నది. ఆలవట్టాలు (వెల్లగొడుకులు)కదలాడుతున్నాయి. జరాసంధుడు తనకు సహాయంగా వచ్చి రాజులు, వారి సైన్యాలతో తన గొప్ప సేనా సమూహంతో మనం వచ్చిన జాడను పట్టి వస్తున్నాడన్నది స్పష్టమవుతున్నది. మృత్యు దేవత తల విరియ బోసుకుని రణరంగంలో నర్తించే విధంలో చనగోచరమవుతున్నది అని అన్న బలరాముడితో యుద్ధవార్తలు ప్రస్తావిస్తుండగానే ఒక మహా సేవాదళం కొండదరిని విన్పించింది. యుద్ధనాదాలతో దిక్కులూ ఆకాశం కూడా మార్మ్రోగుతున్నాయి
ఇంతలోనే. మనం కూడా యుద్ధానికి సన్నద్ధులమై ఉందామని చెప్పాడు కృష్ణుడు. ఇంతలో జరాసంధుడి తన సైన్యంతో నాలుగు వైపులా కొండను ముట్టడించాడు. కల్పావసానంలో మేరు పర్వతాన్ని ముంచెత్తే జలోపప్లవం వలే జరాసంధ సైన్యం తమ ఆయుధ వర్షంతో పర్వతాన్ని ముంచెత్తాలన్న పూనికతో నాలుగు వైపులా కమ్ముకొని వచ్చింది.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు