భక్తి కథలు

హరివంశం -116

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడికి యమున దగ్గరలో లేదు. అందువల్ల గోకులానికే తానున్న చోటికే కాళింది (యమున)ని రప్పించుకోవాలని తెప్పించుకోవాలని ఆ బలదేవుడికి కోరిక కలిగింది.
‘ఓ యమునా! తక్షణం నేనున్న చోటికి నీవు రావల్సింది’ అని ఆ నదికి ఆనతిచ్చడు సీరి. కాని ఆయన ఆజ్ఞను విననట్లుగా మిన్నకుండిపోయింది యమునానది. అప్పుడు బలదేవుడికి కోపం వచ్చింది. నీకింత నిర్లక్ష్యమా అని తన హలాయుధాన్ని ప్రయోగించి యమునను విదారించి తానున్నచోటికి ఒక ప్రవాహాన్ని తెప్పించాడు బలరాముడు. ఇక ప్రవాహం దారిలోనే యమునానది పరుగున ప్రవహించటం చూసి యమున చాలా భయపడిపోయింది. దివ్య మానుషాంగన రూపంతో వచ్చి ఆయనను శరణు వేడుకొంది. ప్రకృతి ధర్మాన్ని కాదనలేక హలధరా! నేను పిలవగానే నీ దగ్గరకు రాలేకపోయినాను. నన్ను మన్నించు. నీవంటి దివ్యమూర్తి నా వంటి అబలపై కోపించటం ధర్మం కాదు. నాకు భర్త సముద్రుడు కదా! ఆయనను విడిచిపెట్టి వేరొకరిని అభిసరించానని నాకు అపకీర్తి కలుగుతుంది. నీకు కూడా అది కీర్తికరం కాదు. నా సపత్నులు (ఇతర నదులు) నన్ను గేలి చేస్తారు. ఎత్తిపొడుస్తారు. కాబట్టి నన్ను అనుగ్రహించు, నా తప్పు సైరించు’ అని యమున దీనయై లాంగలాయుధుడికి ముందు నిలిచి ప్రాధేయపడింది. అప్పుడు కాళింది మాటలకాయనకు నవ్వు వచ్చింది.
‘సరే! నీదైన ముఖ్య ప్రవాహం నీవన్నట్లే సముద్రాభిముఖంగానే సాగనీ! ఇక్కడ మాత్రం ఈ పాయ ఇట్లానే వర్థిల్లనీ’ అని అనుగ్రహించాడు బలరాముడామెను. తరువాత ఆయనకు తమ్ముణ్ణి చూడాలనీ, ఇక్కడి ముచ్చట్లు చెప్పాలనీ అభిలాష జనించింది. అందువల్ల వెంటనే మధురకు ప్రయాణమై వెళ్లాడు. వ్రజ భూమిలో తాను ధరించిన విలాస వేషంతోనే కృష్ణుణ్ణి చూడటానికి వెళ్ళాడు. మధుర చేరగానే కృష్ణుడు అన్నను చూసి చాలా ఆనందించాడు. గోవిందుడప్పుడు, బలరాముడితో కూడి తండ్రి ఇంటికివెళ్ళాడు. వసుదేవుడికిద్దరూ నమస్కరించారు. వసుదేవుడు హర్ష నిర్భర హృదయుడైనాడు. గోకులంలో అందరి క్షేమ సమాచారాలూ పేరు పేరున ప్రస్తావించాడు. ఇట్లా తల్లిదండ్రులతో కొంత కాలం వాళ్ళు ఆనందంగా గడిపారు.
ఆ తరువాత కృష్ణుడు ఒక రోజున యాదవ సభలో తన వారందరికీ ఇట్లా చెప్పాడు.
‘ఒక ముఖ్యమైన సంగతి మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం మధురలోనే ఇక ముందు ముందు ఉండటం శ్రేయస్కరం కాదు. మధుర వంటి పట్టణం ఇంకొకటి ఎక్కడా ఉండదని నాకు తెలుసు. ఈ ఇలాతరంలోనే మధుర సౌందర్యరాశి. సకల సంపదలకు నిలయం. మేము ఇక్కడే పుట్టి వ్రేపల్లెలో పెరిగాము. ఇక్కడకు మళ్లా చేరిన తరువాత మాకు సకల శుభాలూ చేకూరాయి. మాకు ఈ పట్టణం విడిచిపెట్టడం ఇష్టం లేదు.
మిమ్మల్ని కూడా ఇక్కడ ఇక ఉండవద్దు అని చెప్పటం కూడా కష్టంగానే ఉంది. అయితే చూశారు కదా! జరాసంధుడి దౌర్జన్యం! మనలను ఎట్లానైనా భంగపరచాలని ఎన్నిసార్లు దండెత్తివచ్చాడు జరాసంధుడు! మనలను ఎంతగా సంక్షోభానికి గురిచేశాడు! వాడు తన పూనికను ఇంకా వదులుకోలేదు. మళ్లీ ఎప్పుడు దండెత్తి వస్తాడో, అదనుకోసం వేచి ఉన్నాడు. ఆ వార్తలు తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి మనం మధురను విడిచిపెట్టి వేరే చోటికి నగరం నగరమంతా కదలి వెళ్లాలి. నేనిదివరకే ఒక ప్రదేశం ఆలోచించి ఉంచాను. అది వైరి దుర్బేధ్యం. కాబట్టి మీరంతా ఇప్పటినుంచే మధుర విడిచి వేరే చోట మీ నివాసం ఏర్పాటుచేసుకునే ఆలోచనలో సిద్ధంగా ఉండండి అని కృష్ణుడు తన వారందరికీ చెప్పాడు.

ఇంకాఉంది

- అక్కిరాజు రమాపతిరావు