భక్తి కథలు

హరివంశం - 117

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు పిన్నలూ, పెద్దలూ కూడా కృష్ణుడు చెప్పిన విషయం బాగా ఆలోచించారు. అవగాహన చేసుకున్నారు. ‘జరాసంధుడు చూడబోతే అవధ్యుడు. ఆ మగధేశ్వరుడి సైన్యాన్నంతా నిశే్చషం చేయాలాంటే నూరు సంవత్సరాలైనా సరిపోవు. నిజమే మధురలో మనకు ఎటువంటి కొరతా లేదు. మహా సంపద ఉంది మనకిక్కడ. గుర్రాలు, ఏనుగులు, రథాలు, పల్లకులు, వెండి బంగారాలు సమృద్ధంగా ఉన్నాయి. అయినా ఎప్పుడూ ఒక ఆందోళన ఉండనే ఉంది. జరాసంధుడెప్పుడు వచ్చి పైనబడతాడో! అని. అని ఇట్లా వాళ్లు ఆలోచించుకున్నారు. అయినా ఈ తర్క వితర్కాలతో మనకేం పని! మన ప్రభువు, మన రక్షకుడు, మన దైవలం, మన ఏలిక, మన పాలిటి ప్రాపు, కృష్ణుడెట్లా చెపితే అట్లా చేద్దాం అని వాళ్లంతా కూడబలుకుకున్నారు.
అయితే ఇంతలో ఒక గొప్ప ప్రమాదం ముంచుకొచ్చింది మధురకు. కాల యవనుడనే పరమ దుర్మార్గుడు, కాలయముడిలాంటి వాడు మధుర పైకి దండెత్తి వస్తున్నాడన్నదే ఈ ప్రమాదవార్త. పులిమీద పుట్రలాగా ఇదే సమయంలో జరాసంధుడు కూడా మళ్లీ దండెత్తి వస్తున్నాడని మధురాపుర వాసులు విన్నారు. ఈ విషయం వాళ్ళు బాగా అర్థం చేసుకునేట్లు చెప్పి వెంటనే మనం మధుర విడిచిపోవాలని ఆ సన్నాహం చేశాడు కృష్ణుడు. వృష్ణి, అంధక, భోజ కుటుంబాలను కూడా తమ వెంట తీసుకుని పోవటానికి సన్నద్ధం చేశాడు.
తానూ, బలరాముడూ, వసుదేవుణ్ణీ, ఉగ్రసేసనుణ్ణీ తమ వెంట జాగ్రత్తగా ఉంచుకొని మధురను విడిచి పడమట దిక్కుగా ప్రయాణించారు. ఇట్లా కొద్ది రోజులు మార్గ ప్రయాణం నిర్వహించి అనేక వనాలతో, ఉపవనాలతో, అత్యంత సారవంతమైన, రమణీయ సౌందర్య విరాజితమైన సాగర తీర ప్రాంతం చేరుకున్నారు వారంతా. తెల్లని మృదువైన ఇసక భూమి వారినెంతో అలరించింది. ఇవి అన్నిరకాలా మనకు ఆవాసయోగ్యంగా వుంది. ఈ ప్రాంతమంతా మధుర మనోజ్ఞ నిర్మలతోయ సంపన్నంగా ఉంది. పుష్పతరులు, ఫలతరువులు ఇక్కడ సమృద్ధంగా ఉన్నాయి. అంతేకాదు ద్రోణాచార్యులవారు ఏకలవ్యుడిచే సంపూజ్యత పొందిన ప్రదేశం ఇదేను.
ఏకలవ్యుడిక్కడే ఆ మహానుభాగుణ్ణి అర్చించాడు. అంతేకాదు సాక్షాత్తు మందర పర్వతానికి సాటి అయిన రైవతక పర్వతం కూడా ఇక్కడ ఉంది అని మధురాపుర వాసులంతా ఆ చోటిని గూర్చి ఎంతో సంబరంగా చెప్పుకున్నారు. కృష్ణుడు వాళ్ళను అక్కడ సకల సౌకర్యాలు సమకూర్చుకోవలసిందని చెప్పాడు. ఆయన ఆ నగరానికి ద్వారవతి అని పేరు పెట్టాడు. బంధుమిత్రులు, మంత్రి సేనాపతులు, సాధారణ పౌరులు అంతా తమ తమ నివాసాలు అక్కడ ఏర్పరచుకొన్నారు.
తాను కూడా ఒక సౌధం ఏర్పాటు చేసుకున్నాడు కృష్ణుడు. అది అప్పుడొక గొప్ప స్థలదుర్గంగా రాణించింది. ఇక్కడకు ఏ శాత్రవుడూ రాలేడని వాళ్ళు నిర్భయులైనారు. పురుషోత్తముడి ప్రాపుతో అది దేవేంద్రుడి అమరావతిలాగా కళకళలాడింది. కాలయవనుడి యుద్ధ సన్నాహాలన్నీ ముందుగా తెలియటంవల్లనే మధురాపురి నివాసులు సంరక్షితులైనారు. ఎప్పటికప్పుడు కృష్ణుడు శత్రురాజులు మధురను ముట్టడించి సర్వ వినాశనం చేయాలనుకుంటున్న సంగతులు ఆయన దూరదృష్టితో తెలుసుకుంటూనే ఉన్నాడు మధురనింకా విడిచిపెట్టకముందు నుంచీ. అదీకాక మధుర వాసులు శాపగ్రస్తులని కూడా ఆయనకు తెలుసు. ఈ శాపం సంగతి యాదవులకు తెలియకపోయినా దానినుంచి తన వారిని రక్షించటానికే ముందుగా కృష్ణుడు మధుర నుంచి వారిని తరలించాడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు