భక్తి కథలు

హరివంశం119

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాడికి కాలయవనుడని పేరు పెట్టాడు యవనేశ్వరుడు. వాడికి వ్వనం వచ్చింది. యవనేశ్వరుడు కాలగతి చెందగానే కాలయవనుడు మహారాజైనాడు. కాలయవనుడి జన్మ రహస్యమే యాదవ కుల భంజనం. యాదవ సంహార ప్రభంజనం. ఎప్పుడ్పెడు మధురపై దండెత్తుదామా? అని ఉద్ధతుడవుతూ వచ్చాడు. ఎవ్వరినీ లక్ష్యపెట్టక విర్రవీగుతున్నాడు. అపుడు నారదుడు పొద్దుపోకకు ఒక రోజున కాలయవనుడి వద్దకు వచ్చాడు.
మహానుభావా! ఏమిటీ విశేషాలు. ఇపుడు లోకంలో ఎవరు స్వామి! మహాబల పరాక్రమ ప్రసిద్ధులని కీర్తి పొందుతున్నారని తెలుసుకోగోరాడు నారద మహర్షి. బహుశా నారదులవారు మందుగా తనను పొగడుతాడు అనికొని ఉంటాడు కాలయవనుడు. అయితే నారదులవారికి కావాల్సింది అది కాదు కదా! అదేమిటి నీకు తెలియదా? యాదవులు ఇపుడు అతిలోక భుజశాలురు.
పరాక్రమ సమగ్రులు. శౌర్య ధైర్య సంపన్నులు, అని గోరంతలను కొండంతలుగా చేసి యాదవులను పొగిడాడు నారద మహర్షి. అట్లానా! వాళ్ల పని పడతాను అనుకున్నాడు కాలయవనుడు. వాడి కడుపులో అగ్ని రాజుకుంది. మంచిది నాయనా! వెళ్ళొస్తాను అని నారదుడు ముసి ముసి నవ్వులు పైకి పొక్కకుండా కాలయవనుడి దగ్గర శెలవు తీసుకుని నిష్క్రమించాడు. యాదవుల పట్ల తన మత్సరాన్ని దాచుకోలేకపోయినాడు యవనుడు. శీకరాజులు, హిమశైల ప్రాంతపు రాజులు కాలయవనుడి ఆశ్రీతులు. హిమశైల ప్రాంతంవారు దస్యులు. వీళ్ళెప్పుడు కాలయవనుడితో చెలిమి పాటిస్తారు. అందువల్ల వాళ్ళంతా కాలయవనుడికి బాసటగా వచ్చారు. అందరూ వచ్చి మధురను ముట్టడించారు.
భూమండలమంతా దద్దరిల్లింది. సర్వ భూతాలు కంపం పొందాయి. ఇలాతలం కుంగిపోతుందేమోననిపించింది కాలయవనుడి సైన్య పద ఘట్టనతో. వాళ్ళు అడవులను అణచివేసుకుంటూ వచ్చారు. కొండలమీద కలకలం సృష్టిస్తూ నడిచారు. నదులను నానా కల్మష భరితం చేశారు. ఆ కాలయవనుడి సైన్య మదోద్ధత ధూళి సూర్యుణ్ణి సహితం మాటు పడచేసిందా అన్నట్లు దివాంధకారం సృష్టించారు. ఆ సైన్య మార్గంలోని సమస్త ప్రజలు ప్రాణాలుగ్గబట్టుకున్నారు. అమిత భీతి పొందారు. కాలయవనుడు, అతడి ఆశ్రీతులైన శకులు, దస్యులు, అపార సంఖ్యలో తమ వెంట గుర్రాలు, గాడిదలు, ఒంటెలు తీసుకొని వచ్చారు. వాళ్ళు సైనిక గుడారాలు నిర్మించుకొని మజిలీలు చేసిన చోట్ల అన్నిటా ఈ అశ్వ, ఖర, ఉష్ట్ర మందల మందల మూత్రపురీషాలు కాలువలు కట్టి అవి అన్నీ కలిసి ‘అశ్వకకృత్తు’ అనే నదిగా పారి సాగరాభిముఖమైంది. ఇట్లా పగవాడు భూమి బద్దలయ్యేట్లు సేనలను వెంట బెట్టుకొని రావటం గ్రహించాడు కమలాక్షుడు. వీడి జనన వృత్తాంతం కూడా ఆయనకు తెలియకపోలేదు.
వీణ్ణి ఎదుర్కొని యుద్ధం చేయటం సరి అయిన మార్గం కాదని వెంటనే ఆయన గ్రహించాడు. అప్పటికింకా వాళ్ళు మధురానగరంలోనే ఉన్నారు. అప్పుడాయన సకల యాదవులను సమావేశపరిచాడు. ‘వీడు ముక్కంటి వరప్రసాది. అవధ్యుడు. కాబట్టి మనలను భయగ్రస్తులను చేయటానికి సమర్థుడు. సామ దాన భేద యుద్ధ పద్ధతులు వీడి ముందు పనికిరావు. మనమా ప్రయత్నం చేసినా వాడు వినడు. ఈ విషయాలన్నీ నాకు మన నారద మహర్షి ముందే చెప్పాడు. ఇంకొకటి కూడా మనం ఆలోచించాలి. ఒకవేళ మనం కాలయవనుడితో పంతగించి యుద్ధం చేసినా వీడికి బాసటగా మళ్లీ జరాసంధుడు వస్తాడు. కంసుణ్ణి నేను చంపివేశానని జరాసంధుడు నా పట్ల ప్రతీకార వాంఛతో సతమతమవుతున్నాడు.

ఇంకా ఉంది