భక్తి కథలు

హరివంశం143

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాగ్జ్యోతిష పురానికిప్పుడే నేను నిన్ను తీసుకొనిపోతాను దేవా! సిద్ధం కావలసింది అని ఇంద్రుడు శ్రీహరికి విన్నవించాడు. శ్రీకృష్ణుడు, వెంటనే సత్యభామా దేవికి వర్తమానం పంపించి ఆమె రాగానే ఇద్దరూ గరుఢారూఢులైనారు. ఇప్పుడే మునులు, ఋషులు కూడా ద్వారకకు వచ్చి నరకుడి దుండగాలు నాకు తెలియజేశారు. నరకుణ్ణి వెంటనే పరిమారుస్తానని వాళ్ళకు కూడా వాగ్దానం చేశాను అని తనను దర్శించటానికి వచ్చిన సకల సుపర్వులతోనూ నరకాసుర సంహారానికి బయలుదేరాడు. వాళు
ఇంకా ఉంది ళ కొంత దూరం భూమి మీద ప్రయాణించారు.
ఆ తరువాత ఆకాశ మార్గంలో వింతలు, విశేషాలు, వాయువు సంచరించే ఏడు పథాలలో పయనిస్తూ ప్రాగ్జ్యోతిషం దరిదాపులకు చేరారు. కృష్ణుడప్పుడు ఇంద్రుడికి, దిక్పాలకులకు వీడ్కోలు చెప్పి పంపించివేశాడు. ఇక వెంటనే ఆ నగరం చుట్టూ మహా ఆటోపరభాసంతో కావలి కాస్తున్న రాక్షస భట సైన్యాలు చెల్లాచెదురు చేశాడు త్రివిక్రముడు. చాలామందిని సంహరించాడు తన బాణ పాత వేగంతో. ఇక మురాసురుడు యుద్ధానికి తలపడ్డాడు సుదర్శనాయుధుడు.
సుర గరుడ గంధర్వ దేవతానీకం ఎవరూ పట్టణం వైపు తేరి చూడకుండా మురాసురుడు సృష్టించిన మాయాజాలాన్నంతా ఛేదించాడు ముకుందుడు. ఆ శాపాలన్నిటినీ తెంపివేశాడు తన ఆయుధ ప్రయోగంతో. అపుడు మురాసురుడు సింహనాదం చేస్తూ భయంకరమైన గదతో సుపర్ణుడి శీర్షం మోదాడు. ఆ తరువాత శూల, పరశు, తోమరాయుధాలతో గరుత్మంతుణ్ణి తాకాడు. శ్రీకృష్ణుడిది సహించలేకపోయాడు. బసులుకొడుతున్న నల్ల త్రాచు వంటి తీవ్ర శరాన్ని మురాసురుడిపై సంధించగా అది అది మురాసురుడి కిరీట సహిత మస్తకాన్ని ఖండించి నేల కూల్చింది. అప్పుడాయన తన పాంచజన్యం పూరించి రాక్షస లోకాన్నంతా భయభ్రాంతం చేశాడు. ఆ పాంచజన్య శంఖారావానికి జలధులు ఘూర్ణిల్లాయి. దిగ్గజాలు సంచలించాయి. భూమి దద్దరిల్లింది.
దేవతా లోకాలు కూడా వణికిపోయినాయి. పరమ శివుడు, పంకజాసనుడు కూడా అద్భుతాక్రాంతులైనారు. విస్మయ పరీత చేతస్కులైనారు. అప్పుడు నిసుందుడనే రాక్షసుడు ప్రచండ గదా దండంతో ఆయనను తాకాడు. కృష్ణుడి శారధనువునుంచి వెలువడుతున్న బాణాలను లక్ష్యపెట్టకుండా ఆయనపై నిశితమైన బాకు విసిరాడు. అది సత్యభామ భుజాన్ని తాకి దూసుకొనిపోయింది. దానితో ఆమె భుజం గాయమైంది. దీన్ని చూసి కృష్ణదేవుడు తీవ్రంగా ఆగ్రహించాడు. రెండు బాణాలు వేసి ఆ రస్కసుడి రెండు బాహువులు నరికివేశాడు. వాడు ధరించిన చెవుల కుండలాలు మిరుమిట్లు గొల్పుతుండగా తల ఖండించి, మొండెం నేలమీద పడేట్లు తీవ్ర శరం ప్రయోగించాడు. దీనికి ఓర్వలేక హయగ్రీవుడనే భీకర దనుజుడు హరిని మార్కొన్నాడు.
ఒక పెద్ద మేఘం గిరిశృంగాన్ని కప్పివేసినట్లు హయగ్రీవుడు మురాంతకుడిని శరజాలంతో కప్పివేశాడు. తరువాత బాణ వర్షం కురిపించాడు. దీనిని సహించలేక వాసుదేవుడు వజ్రాయుధం లాంటి బాణాన్ని సంధించి హయగ్రీవుణ్ణి నేలకూల్చాడు. ఆ రాక్షసుడి తల ప్రాగ్జ్యోతిషం అంటుకొని ప్రవహిస్తున్న గంగలో పడి ప్రవాహాన్ని రుధిర రంజితం చేసింది. ఆ వెనువెంటనే అఘోరపాలుడు, విరూపాక్షుడు, ప్రాపణుడు, పంచ జనుడు అనే మేటి రక్కసులను తెగటార్చాడు. అసంఖ్యక రాక్షస సంహారం చేశాడు. అపుడు నగరి కావలివాండ్రైన రాక్షస సమూహాలు ఆయనపై విరుచుకపడ్డారు. అనేక అస్త్ర శస్త్ర జాల వర్షం ఆయనపై కురిపించారు.

ఇంకా ఉంది