భక్తి కథలు

హరివంశం144

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేరు పర్వతం చరియపై మహామేఘం ఒకటి జడివాన కురిపించినట్లు గరుత్మంతుడిపై అధిరోహించి ఉన్న శ్రీకృష్ణ, సత్యభామలను వాళ్ళు బాణవర్షంతో కప్పివేశారు. అపుడు వైనతేయుడు తన రెక్కలు విదిల్చి ఆ బాణ పరంపరలను తునాతునకలు చేశాడు. శ్రీకృష్ణుడు తన పంచాయుధాలు ప్రయోగించి అశేష రక్కసి సమూహాలను పొలియింపజేశాడు.
ధరాతలమంతా రక్తసిక్తమైంది. ఎక్కడ చూసినా రాక్షసుల తెగిన తలలు మొండేలు గుట్టలు గుట్టలుగా నేలనంతా ఆక్రమించాయి. సుపర్ణుడు కూడా తన ముక్కుతో, కాళ్ళతో, రెక్కలతో విజృంభించి వేల సంఖ్యలో రాక్షసులను హతమార్చాడు. నెత్తురు కాల్వలై పారింది ఆ యుద్ధ్భూమిలో.
ఇట్లా తన బలాలన్నీ నశించటంతో నరకాసురుడు స్వయంగా యుద్ధానికి వచ్చి గోవిందుడు వినేట్లు తన శౌర్య పరాక్రమాలను చాటుకొని కృష్ణుణ్ణి అధిక్షేపించాడు. సత్యభామను చూసి గేలి చేశాడు. ఎవరీ లోలాక్షి? అని పరిహారం చేశాడు. మంచి పని చేశావు. నిన్ను నిహతుణ్ణి చేసి ఈ లతాంగిని వశం చేసుకుంటాను అని కొవ్వి అరుపులు సాగించాడు.
కృష్ణుడు కూడా ‘ఇంతకుముందు నీవు నన్ను చూసి ఉండవు. ఇక ముందు మరోసారి చూడలేవు. నేనెవరిని అని కదా నీ ఈసడింపు. నేను వాసుదేవుణ్ణి. ఈ ప్రమద నా ప్రియురాలు. చూస్తున్నావు కదా పన్నగారి సుపర్ణుడు నారథం. నిన్ను సంహరించటానికే వచ్చాను’ అని నరకాసురుణ్ణి దెప్పిపొడిచాడు.
అప్పుడు నరకాసురుడు కహ కహ పెద్దపెట్టున నవ్వి ‘ఆహా! నా భాగ్యమే భాగ్యము. నీ కోసమే నేను ఎదురుచూస్తున్నాను. ఇప్పటివరకు నీ ఒక్కడవే తప్పించుకున్నావు. నీ రథం సంగతి అట్లా ఉంచు. నా మనోరథం ఈడేరుతుంది స్వయంగా నీవే రావటంవల్ల’ అని రూక్షంగా ఆక్షేపించాడు కృష్ణుణ్ణి. ‘ఇప్పుడు నీవు బతికి బయటపడితే గదా, మరోసారి నిన్ను చూడటమనే ప్రస్తావన అని ఘోరాస్త్రం ఒకటి వాసుదేవుడిపై నరకాసురుడు ప్రయోగించాడు. కృష్ణుడు కూడా అందుకు ధీటైన అస్త్రం నరకుడిపై ప్రయోగించాడు. ఇంద్రుడికీ వృత్రాసురుడికీ, శ్రీరాముడికీ రావణాసురుడికి జరిగిన యుద్ధాన్ని తలపింపజేసే ఘోర యుద్ధం వాళ్ళిద్దరి మధ్యా సాగింది. నరకుడు తీవ్రాతి తీవ్రమైన భయంకరాస్త్రాన్ని పద్మనాభుడి ఫాలభాగాన్ని గురి చూసి ప్రయోగించాడు.
అది ఆయన నుదుటికి తాకడంతో శ్రీకృష్ణుడికి మైకం కలిగినట్లై ఆయన గరుడుడిమీద ఒకవైపుకు వొరిగిపోయినాడు. సత్యభామ ఆందోళన చెందకుండా స్వామి ఫాలంమీద అయిన గాయాన్ని తన చీర చెరగుతో తుడిచి, చామరంతో ఆయనకు వీచి ఉపచారం చేసింది. సుపర్ణుడు కూడా తన రెక్కలల్లార్చి ప్రభువుకు సేవ చేశాడు. ఇంతలో ఆయన కొంత తెప్పరిల్లాడు.
సత్యభామ వైపు ప్రణయవీక్షణాలు ప్రసరింపజేస్తూ చిరునవ్వుతో ‘నేను కొంచెం అలసట చెందాను.
నీ రణరంగ కౌశల్యం ఏమిటో చూడాలని కూడా నాకు వేడుకగా ఉంది. కొంచెంసేపు నీవు యుద్ధం చెయ్యి, తరువాత నేను మళ్లీ నా విల్లు అందుకుంటాను’ అని చెపుతూ తన శార్గ్ధనువు ఆమె చేతికిచ్చి తూణీరాలు ఆమెకు అనువుగా ఉండేట్లు అమర్చాడు. స్ర్తిత్వం దోర్బల మహాపరాక్రమం మూర్త్భీరించినట్లు, సౌందర్యం సాహసాకృతి ధరించినట్లు, ధైర్యం నాతి రూపు ధరించి సాక్షాత్కరించినట్లు, సత్యభామ నరకుడిపై శర పరంపర గుప్పించసాగింది.
నరకుడు శ్రీకృష్ణుణ్ణి వెటకారం చేశాడు. ‘దేవర యుద్ధం ముగిసింది. దేవి యుద్ధం మొదలైంది’ అని పకపక నవ్వుతూ అపహాస్యం చేశాడు.

ఇంకా ఉంది