భక్తి కథలు

హరివంశం 146

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంకా ఏమైనా మీ సేవలో మేము చేయవలసిన పనులు ఆజ్ఞాపించవలసింది అని చెప్పగా నరజనాభుడు ఎంతో సమ్మోద మనస్కుడైనాడు. చంద్రకాంతులతో తేజరిల్లుతున్న వరుణ ఛత్రం తానే చేతిలోకి తీసుకున్నాడు. తక్కిన ధన కనక వస్తు వాహనాలను, గజాశ్వాలను, పశు సంపదను ద్వారకా నగరానికి చేర్చవలసిందిగా నరకుడి అధికార సేవ పరివారానికి ఆజ్ఞాపించాడు.
ఆ తరువాత గరుత్మంతుణ్ణి అధిరోహించి అక్కడకు దగ్గరలో వున్న మణిపర్వతానికి వెళ్లాడు. ఆ పర్వతం చుట్టూ కనక మణిమయ సౌధాలు వరుసలుగా ఇంపు గొల్పేట్లు ఉన్నాయి. ఆ కొండ చుట్టూ వలయాలుగా మరుపులతో కూడిన మేఘాలుగా ఆ మహాసౌధాలు విలసిల్లుతున్నాయి. ఆ భవనాలలో నరకాసురుడు చెరపట్టి తెచ్చిన సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వ యువతులు పదహారువేలమందిని ఉంచి వారికి వృద్ధ కంచుకలను సంరక్షకులుగా ఉంచాడు నరకాసురుడు.
వాళ్ళంతా శ్రీకృష్ణుడు ఎప్పుడెప్పుడు వచ్చి తమను అనుగ్రహిస్తాడా? అని నిరీక్షిస్తున్నారు. హయగ్రీవ, ముద, నిసుందులతోపాటు నరకుణ్ణి శ్రీకృష్ణుడు పరిమార్చినట్లు విని వారెంతో పొంగిపోయి, జగన్నాథుడు ఎపుడెప్పుడు వచ్చి తమను కటాక్షిస్తాడా అని ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఆయన రాగానే అందరూ ఆయనను పరివేష్టించి తమ దీనగాథ వినిపించారు. ఈ అసురుడు మమ్ములను చెరపట్టి తెచ్చినప్పటినుంచీ పరమ విషాదంతో జీవిస్తున్నాము. ఒకసారి నారద మహర్షి ఇక్కడకు వచ్చి మీరు విలపించవద్దు. శ్రీమన్నారాయణుడు భూభార రక్షణార్థం మానుషావతారం ధరించి నరకుణ్ణి సంహరించి మిమ్ములను అనుగ్రహిస్తాడని ఊరడిల్లజేశాడు.
విశ్వానికి ప్రాణాధారుడైన వాయుదేవుడు కూడా మమ్ములను ఇట్లా ఓదార్చాడు. ఆ ఆశతోనే మేము మా దుఃఖాన్ని ఇంతకాలమూ దిగమింగాము. జగద్రక్షుడివైన నీవే మాకు దిక్కు అని ప్రణయ భరోత్కంఠితవై ఆ దేవ కన్యలు ఆయనను వేడుకొన్నారు. వాళ్ళకోసం పల్లికులను సిద్ధం చేయించాడు మురళీ మోహనుడు. తన నగరం చేర్చవలసిందిగా రాక్షస కింకరులను ఆజ్ఞాపించాడు. ఆ తరువాత ఆ మణిపర్వతాన్ని చూడాలనే వేడుకతో ఆ పర్వతంపై కొంతసేపు విహరించాడు.
అది ఆయనను ఎంతగానో అలరించింది. ఆకర్షించింది. సుందరాతి సుందరమైన ఆ కొండ శిఖరాన్ని ఒకదానిని పెళ్ళగించి తరులతాపుష్ప వివిధ మృగు పక్షి, జలధారాసహితంగా దానిని గరుడిడిపై మోపజేసి తానూ అధిరోహించాడు. ఆ తరువాత సత్యభామను కూడా అధివసింపజేశాడు. అప్పుడు సుపర్ణుడు వాయు వేగంతో ఆకాశవీధిని వాళ్ళను స్వర్గలోకానికి తీసుకొనిపోయినాడు. సుపర్ణుడి వేగానికి మేఘాలు చెదరిపోయినాయి. కుల పర్వతాలు భూమిమీద కురచవైపోయి కనిపించాయి.
మరుత్తుల, వసువుల, సూర్య, చంద్ర, సిద్ధ, సాధ్య దివ్య లోకాలన్నీ అధిగమించిగరుత్మంతుడు సత్యభామ, శ్రీకృష్ణులను సురపతి లోకానికి తీసుకొనిపోయినాడు. వాహనం నుంచి దిగి తమకు ఆదరంగా స్వాగతం పలుకుతున్న శచీ పురందరులకు శ్రీకృష్ణ సత్యభామలు అభివాదం చేశారు. వెంటనే శ్రీకృష్ణుడు ఇంద్రుడికి అదితిదేవి కుండలాలు సభక్తికంగా సమర్పించాడు.
ఇంద్రుడు కూడా శ్రీకృష్ణుణ్ణి ప్రతిపూజితుణ్ణి చేశాడు. శచీదేవి సత్యభామను కౌగిలించుకుంది. సత్యభామ వినయ మధురోక్తులతో శచీదేవిని గౌరవించింది. తాను మళ్లీ ఆమెను ఆలింగనం చేసుకుంది. శచీదేవి సత్యభామను శ్రీకృష్ణుడి దివ్య పరాక్రమాన్ని శ్లాఘిస్తూ ఎంతగానో ప్రశంసించింది. లోకాలన్నింటినీ గడగడ వణికించిన ఆ దుష్ట నరకుణ్ణి నీ హృదయేశుడు తప్ప వేరెవరు పరిమార్చగలరు? అని మెచ్చుకుంది.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు