భక్తి కథలు

హరివంశం 149

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రద్యుమ్నుణ్ణి దగ్గరకు రప్పించుకొని మణిపర్వత శృంగాన్ని పారిజాత తరువును యధోచితంగా ప్రతిష్ఠించవలసిందని కోరాడు. బంధువులందరూ పారిజాత తరువును చూసిన సంప్రహర్షం చెందగా వాళ్ళందరకీ తమ తమ పూర్వ జన్మల స్మరత్వం సమకూడింది. అది ఈ దివ్య భూరుహం ప్రభావం అనుకున్నారు వారంతా. పెద్దల అనుమతితో మంగళాశీర్వాదాలతో నరకుడి చెర నుంచి విడిపించి ద్వారక చేర్చిన వేల్పు లలనలను ఆయన పరిణయమాడి వివిధ భావనలతో వాళ్ళకు అభీష్ట సౌకర్యాలు ఏర్పాటుచేశాడు. సత్యభామ కూడా అత్తగారికీ, తోడికోడండ్రకు నమస్కరించి గౌరవించింది.
అప్పుడిక గరుత్మంతుడికి ప్రేమాభిమాన ఆదర పూర్వకంగా శ్రీకృష్ణుడు వీడ్కోలు చెప్పాడు. నీ తలపు మాత్రం చేతనే దేవా! నేను ఆజ్ఞాబద్ధుడనై వచ్చి నిన్ను సేవించుకుంటానని చెప్పి సుపర్ణుడు తన యథాస్థానానికి వెళ్లిపోయినాడు. ముందుగా తన తల్లులిద్దరినీ వసుదేవ సహితంగా అర్చించి వాళ్ళకు అమూల్యమైన కానుకలు సమర్పించి తరువాత ఉగ్రసేన దంపతులను సత్కరించి వాళ్లను అంతఃపురాలకు పంపించివేసి తరువాత సభా భవనంలో కొలువుదీరాడు బలదేవుడితో సహా శ్రీకృష్ణచంద్రుడు.
అక్కడ యాదవ ప్రముఖులు, రాజవంశీకులు, సమస్త రాజ్యపాలనాధికార వర్గం, మంత్రి, సామంత, దండనాయక, పుర రక్షక, ఉద్యోగ వర్గమంతా ఆ కొలువుకూటానికి చేరరాగా వారందరినీ సత్కరించాడు కమలనాభుడు. నరకుడి సంపదను వాళ్ళందరికీ పంచిపెట్టాడు. అందరికన్నా ముందుగా తనను చూడటానికి వచ్చిన సాందీపని మహర్షికి ఘన సత్కారం చేశాడు శ్రీకృష్ణుడు. నరకుణ్ణి జయించి తాను తెచ్చిన వివిధ రత్న సంచయం, అశేష సంపదలు గురుబంధు పరివార బృందానికివ్వగా ఇంకా మిగిలి ఉన్న వివిధైశ్వర్య వస్తుచయాన్ని ఆయా భాండాగారాధ్యక్షులను పిలిపించి వాటిని అప్పగించాడు. గజ తురగ రథ సంపదను ఆయా అధికారుల వశం చేశాడు. అప్పుడా సభలో గ్రహ నక్షత్ర సహితమైన వినువీధిలో పూర్ణచంద్రుడు పొలుపారినట్లు శ్రీకృష్ణుడు ప్రకాశించాడు.
అప్పుడా సభ వారిని, పురప్రముఖులనుద్దేశించి ఈ సమస్త సంపదలు మావి, మీరే ఈ రాజ్య నిర్వాహణానికి మూలస్తంభాలు. ఈ సౌభాగ్యానికంతా మీరే ప్రవర్తకులు. మిమ్ముల్ని సంతోషపెట్టడమే నా కర్తవ్యం. నాకు సంతోషకరమైన క్షేమ స్థైర్య ఐశ్వర్య లాభాలను అపుడే నేను పొందగలుగుతాను. అపుడు వాళ్ళంతా చేతులొగ్గి ‘దేవా! నీ పరిపూర్ణ దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్ష వీక్షణలు మాపై ప్రసరించినంతవరకు మాకు ఎటువంటి భయ సంభ్రమాలు కలుగవు. సర్వ సంక్షేమాలు కొల్లలుగా మేము అనుభవించగలుగుతాము.
నీ మహిమ వర్ణించటానికి బ్రహ్మ మొదలైన దేవతా శ్రేష్ఠలు కూడా అసమర్థులైనపుడు మేము ప్రశంసించగలదేమున్నది? నీవు సకల ధర్మపరిపాలకుడవు. ధర్మ నిర్ణయకర్తవు. ధర్మరక్షకుడివి. ధర్మప్రవర్తకుడివి. నీ అండదండలు మాకు కలిగినపుడు మేము మూడు లోకాలలో ప్రశంసలు పొందుతాము. మాకు ఎవరూ ఎటువంటి అపకారాలు చేయలేరు అని కృష్ణుణ్ణి పొగిడారు.
అపుడు ఈ దిషోత్సవాన్ని తిలకించి ఆనందించటానికి వియత్తలం నుంచి నారద మహర్షి ఆ సభకు వచ్చాడు. ఆయనకు భక్తి ప్రపత్తులలో ఎదురేగి స్వాగతం చెప్పి ఉచితాసనాసీనుణ్ణి చేశారు సభాసదులు, శ్రీకృష్ణ బలరాములు. నారద మహర్షి శ్రీకృష్ణుడి చేయి తన చేతిలోకి తీసుకొని సభాసదులందరూ ఆలకిస్తూ ఉండగా శైశవం నుంచి ఇప్పటివరకు ఈ ఆదిదేవుడి దివ్య లీలలు గానం చేస్తాను సావధానంగా వినండి.

ఇంకా ఉంది