భక్తి కథలు

హరివంశం 150

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదవులారా! అని వాళ్ళను సంతోషాత్సాహితులను చేశాడు. మమ్ములందరినీ అభినందించవలసిందిగా ఆనందింపచేయవలసి దివిజ లోక పాలకుడు ఇంద్రుడు నన్ను కోరాడు. అందువల్లనే నేనిప్పుడు మీ దగ్గరకు వచ్చాను. బాల్యం నుంచీ ఈ దేవాదిదేవుడు ఎటువంటి పరమాద్భుత కావ్యాలు చేశాడో, ఇక ముందు కూడా ఎటువంటి మహాద్భుత కార్యాలు నిర్వహించబోతున్నాడో కూడా మీకు చెబుతాను. జరాసంధుడు బల సహాయుడై ఉండటం చూసుకొని క్రూర కర్ముడైన కంసుడు తండ్రిని చెరలో పెట్టి రాజ్యాన్ని లాక్కొని చండశాసనుడై పాలిస్తూ, వసుదేవుణ్ణి, దేవకినీ నానా కష్టాలపాలు చేసిన విషయం మధురవాసులకు తెలియనిది కాదు. కంసుణ్ణి వధించటానికి కృష్ణుడు జన్మించబోతున్నాడని వసుదేవుడు నమ్మి, ఈయన పుట్టగానే మధుర సమీపంలోని గోకులంలో ఉన్న నందుడింటికి ఈ దివ్య శిశువును చేర్చాడు వసుదేవుడు. అక్కడ కంస వంశ దావానలంలాగా ప్రభువు పెరుగుతూ వచ్చాడు. నెలలోపు శిశువై ఉన్నపుడే పూతనను సంహరించాడు. ఆరు నెలల శిశువై ఉన్నప్పుడు శకటాసురుణ్ణి చంపివేశాడు. కృష్ణుడి అల్లరి పనులు చూసి తల్లి కోపించి పలుపు బొజ్జకు చుట్టి రోటికి బంధించగా దానిని ఈడ్చుకొనిపోయి మద్దులను కూల్చాడు. అందువల్లనే స్వామికి దామోదరుడని పేరు వచ్చింది. కాళింది మడుగుల కాళియుడి పడగలపై నృత్యం చేసి ఆ చెనటి సర్పాన్ని సముద్రానికి పంపించి యమున జలాలను విషరహితం చేసి పశువులకు, పశుకాపరులకు స్వాదు యోగ్యం చేశాడు. జడివానకు గొడుగులా గోవర్థనాన్ని ఎత్తి గోగోప గోపీ గోకులాన్నంతా సంరక్షించాడు. అరిష్టరాక్షసుణ్ణి ముష్టిఘాతాలతో చంపివేశాడు. కేశి రాక్షసుణ్ణి చీల్చివేశాడు. అక్రూరుడికి తన శేషతల్ప దివ్య స్వరూపం దర్శింపచేశాడు యమున నీటిలో.
తరువాత కంసుడి కొలువుకు వచ్చి కువలయాపీడం పీచమణచి దానిని హతంచేశాడు. చాణూరుణ్ణి మర్దించి సంహరించి దేవలోకానికి మనోజ్ఞ శుభవార్త నందజేశాడు. కంస వధను లోకం ఇపుడు కూడా కీర్తిస్తూనే వున్నది. అవక్ర పరాక్రమ సాహసంతో సింహం ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి చీల్చినట్లు కంసుడి మస్తకం విదారణం చేశాడు. సాందీప మహర్షి సుతుణ్ణి ఎప్పుడో పరలోకగతుడైన వాణ్ణి తెచ్చి ఇచ్చాడు తండ్రికి గురుకట్నంగా. ఇవన్నీ శ్రీకృష్ణుడి దివ్యలీలలు. ఆ తరువాత జరాసంధుణ్ణి పద్దెనిమిదిసార్లు పరాభవించాడు. పంధొమ్మిదోసారి జరాసంధుడి అభిమాన పుత్రుడైన శిశుపాలుడి వివాహ ప్రయత్నంలో, రుక్మిని ప్రాణావశిష్టుణ్ణి చేసి రుక్మిణీ దేవిని పరిణయమాడాడు. మురాసురుడు ప్రాగ్జ్యోతిషం చుట్టూ పన్నిన పాశాలన్నిటినీ తెంపివేసి మురాసురుడితో నరకాసురుణ్ణి కూడా యమసదనానికి పంపించివేశాడు. ఇక ఇప్పుడు పారిజాతానే్న పెకలించి తెచ్చి తన వీట నాటుకున్నాడు. ఇకమీదట ఈ పరమ పురుషుడు నిర్వహించే అద్భుత అచింత్య పరమాద్భుత చర్యలు చెపుతాను వినండి. బాణాసురుణ్ణి భంజించి కరుణిస్తాడు, శిశుపాలుణ్ణి చంపివేస్తాడు, సాల్వుణ్ణి కూల్చివేస్తాడు, అర్జున సారథ్యం వహించి భారత యుద్ధాన్ని సంపూర్ణ ఫల పర్యవసాయి చేయబోతున్నాడు. యుగయుగాల దివ్య చరిత్ర కీర్తితుడు కాబోయే కృష్ణుడు భూభార నివారణార్థం దివ్యావతారం ధరించి భూలోకానికి విజయం చేశాడు. తన దివ్య సంకల్పాలన్నీ ఈడేరిన తర్వాత ద్వారకానగరం సాగరంలో మునిగిపోగా ఆయన తన పరంధామం చేరుకుంటాడు. మీ పూర్వ పుణ్య మహద్భాగ్యంవల్ల ఆయనను మీవాడనుకుంటున్నారు అని శ్రీకృష్ణుడి ది

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు