భక్తి కథలు

హరివంశం 156

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురుడు వచ్చీ రాగానే బిడ్డ కేరుమని అనకుండానే ప్రసవం అయిన మరుక్షణంలోనే ఎవడో ఎక్కడనుండి వస్తాడో కాని ఆ శిశువును దొంగిలించుకొనిపోతాడు. ఆ బిడ్డ మాకు దక్కడు. ఇప్పటికిట్లా మూడుసార్లు జరిగింది. దైవం ఇట్లా మమ్ముల్ని మూడుసార్లు వంచించాడు. ఇపుడు నా భార్య మళ్లీ గర్భవతి. ఇదుగో అదిగో అని ప్రసవ సమయం రానే వస్తున్నది. ఈ నాలుగో గర్భమైనా మాకు దక్కుతుందో లేదో?
నీవు సకల జగద్రక్షకుడవు. గర్భస్థుడైన అర్భకుణ్ణి నీవు కాపాడాలి. ఇక ఎవ్వరూ ఈ పని చేయలేరు. ఈసారి మాకు అభయం ప్రసాదించాలి కరుణాలవాలా? అని దుఃఖక్రాంతుడై వేడుకున్నాడు కృష్ణుణ్ణి ఆ విప్రుడు. నీవే మాకు ప్రభువువు. ఆర్తరక్షకుడివి. నీకు తెలియనిదేముంది? ఏ ధర్మాన్ని ఎవరైతే కాచి రక్షిస్తారో, ఆ ధర్మం ఆచరించినందువల్ల కలిగే ఫలంలో నాలుగో వంతు ధర్మరక్షకుడికి లభిస్తుందని అంటారు. నీవీ పుణ్యం కట్టుకో! అని యాచించాడు.
అపుడు వాసుదేవుడు ‘అయ్యా! శరణన్నవారిని రక్షించటం, కరుణ చూపమని వేడినవారిని కాపాడటం నా నిత్యవ్రతం. అయితే అయ్యో! నేనిప్పుడు యజ్ఞదీక్షితుడనై ఉన్నాను కదా! వేగిరపడకూడదు. ఏం చేయగలనా? అని నాకు చాలా విచారంగా ఉంది, అని పరితాప స్వరంతో ఆ బ్రాహ్మణుణ్ణి ప్రభువు అనునయ పూర్వకంగా ఊరడించే ప్రయత్నం చేస్తుండగా అక్కడే ఉన్న నేను సవినయంగా ‘దేవా! పోనీ నన్ను పంపించు. ఈ విప్రుడి ఆపదను పోగొట్టి నీకు ప్రియం చేకూరుస్తాను’ అన్నాను. ఈ మాటలు విని లేత నవ్వుతో శ్రీకృష్ణ ప్రభువు ‘ఈ పని నీకు శక్యమవుతుందా?’ అన్నాడు. నాకు చాలా సిగ్గు కలిగింది. తల వంచుకుని ఇట్లా ఎందుకన్నానా అని మథనపడుతుండగా, సరే కానీ అయితే ఒంటరిగా మాత్రం బయలుదేరవద్దు. బలరాముడు, ప్రద్యుమ్నుడు కాక తక్కిన యాదవ వీరులను సాత్యకి మొదలైన వారిని వెంట బెట్టుకొని వెళ్ళవలసింది’ అని అనుజ్ఞ ఇచ్చాడు. ఒక పెద్ద సైన్యం వెంబెట్టుకొని రథాలు, గుర్రాలు, ఏనుగులతో సహా యాదవ వీరులు నన్ను అనుసరించగా ఆ బ్రాహ్మణుడు మాకు దారి చూపుతుండగా వెళ్లాము. ఇట్లా చాలా వేగంగా పయనం సాగించాడు అర్జునుడు ఆయన ఊరికి. ఆ ఊరు చేరగానే ఊరిమద్యలో పెద్ద సైన్య బలగాన్ని కాపుంచాడు. ఊరి చుట్టూ కూడా చీమ కూడా చొరకుండా కట్టుదిట్టమైన సైన్యాన్ని కాపుదలగా ఉంచాడు అర్జునుడు. అపుడు సాయంకాలం కావస్తున్నది. తూర్పు దిశలో నాకు (అర్జునుడికి) అశుభ శకునాలు ఎన్నో తోచాయి. నక్కల ఊళలు విన్పించాయి. సూర్యుడి కాంతి తరగిపోయింది. ఉల్కలు రాలాయి భయం పుట్టించేట్లు. ఏదో పరాభవం నాకు తప్పదేమో అని నేను భయపడ్డాను. ఇంతలో అర్థరాత్రి అయింది. బ్రాహ్మణి ప్రసవించింది. ఆ సూతికా గృహం చుట్టూ మహారథులు విల్లు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నారు. శిశువు క్యారుమంటున్న ఏడ్పులు ఒకటి రెండుసార్లు వినపడ్డాయి. అంతే ఇంతలో పోయె, పోయె అని మొత్తుకోళ్లు వినపడ్డాయి. ఆ ఆర్త్ధ్వనులు మిక్కిలి దీనంగా, కరుణావిలంగా ఉన్నాయి. దైవమా! చెడిపోయాం ఈసారి కూడా అని ఆమే, ఆమె చుట్టూ ఉన్న స్ర్తిలు ఆక్రందిస్తున్నారు. ఇంతలో ఆకాశంలో పురిటి శిశువు ఏడ్పు వినపడింది. నేనూ, ఇతర వీరులూ ఆకాశం నిండా మా బాణాలు ప్రయోగించాము. ఒక్కరూ మా దృష్టికందలేదు. ఒక్క బాణం కూడా ఎవరినైనా తాకినట్లు కాని, తగిలినట్లుగా లేదు. నిరుత్సాహం మమ్ముల్ని క్రుంగదీసింది. పురిటింటినుంచి బయటకు వచ్చి ముసలమ్మలు, ఇంకా పురిటి సహాయానికి వచ్చిన స్ర్తిలు మమ్మల్ని పరుషంగా ఎత్తిపొడిచారు. ఆ బ్రాహ్మడు కూడా నిందించాడు నన్ను.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు