భక్తి కథలు

హరివంశం 170

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని ఏ కళనున్నాడో కాని నారదుడు ఈ తుచ్ఛ భూపతిని రెచ్చగొట్టలేదు. ‘‘ఓ పౌండ్రక వాసుదేవుడా! హరి ఎక్కడ? నీవెక్కడ? పరమాణువు, పర్వతం లాంటిది మీ ఇద్దరిమధ్య సాదృశ్యం. ఇప్పటివరకు ఎంతమంది దుష్టులను ఉన్మీలించాడో కంస, ముర, చాణూర భంజనుడు. ఆయన త్రైవిక్రముడు.
నీ దగ్గర ఉన్న పంచాయుధాలు, ఆ పరమ పురుషుడి ముందు గడ్డిపరకలు. నీ ఆటోపం చూసి లోకమంతా నవ్వుతుందని సిగ్గూ, లజ్జా కూడా లేవు నీకు’ అని మందలించాడు. పౌండ్రుడు మొగమంతా నవ్వు తెచ్చిపెట్టుకుని ‘మహానుభావా! నేనేమన్నా మీ మాటలను తప్పుపడితే, తీసిపారేస్తే, ఖండిస్తే మీకు ఆగ్రహం కలుగుతుంది. శాపం ఇచ్చినా ఇవ్వవచ్చు. కార్యసాధకులెప్పుడూ శాంత గుణం వహించాలి. మీరు కాబట్టి సరిపోయింది.
ఇతరులెవరైనా నా ముందు ఇట్లా పెదవి కదల్చగలరా? ఇప్పుడు మనకు వాగ్వాదమెందుకు? నీవు నన్ను ప్రశంసించే రోజు త్వరలోనే రాబోతున్నది. అందుచేత నీకొక దండం, వెళ్లిరండి అని మర్యాద నటిస్తూ ఆయనకు చేయి చూపి శెలవు సూచించాడు పౌండ్రుడు. ఇక నారదుడు అక్కడనుంచి హుటాహుటి బదరికావనం వెళ్లి విష్ణుదేవుడికీ వార్తలన్నీ చెప్పాడు. పౌండ్రుడి ప్రలాపాలు శ్రీకృష్ణుడికి రసవత్తరంగా వర్ణించి చెప్పాడు. ఇక తన నెలవుకు తాను వెళ్ళాడు.
పౌండ్రుడికి ఏనుగును శూలంతో పొడిచిన మదం ఆవహించింది. నారదుడి మాటలకు మరింత క్రోధోద్రిక్తుడైనాడు. చాలా రెచ్చిపోయినాడు. ఆ రాత్రికి రాత్రే పౌండ్రుడు ద్వారకా నగరంపై దండెత్తాడు. ఆఘమేఘాలపై వెళ్లి కోటను ముట్టడించాడు.
రాత్రి పూటనయితే సుకరంగా కోట బద్దలు కొట్టవచ్చునని వేల సంఖ్యలో కాగడాలు వెలుగుతుండగా తూర్పు ద్వారం దగ్గర సేనలతో మోహరించాడు. ఏనుగుల ఘీంకారాలలు, గుర్రాల సకిలింపులు, వీరభటుల సింహనాదాలు అక్కడ ఒక తుములమైన రణఘోషను సృష్టించాయి. భేరి నిస్సాణకాహళులు భోరుకొలుపజేశాడు.
యాదవులు కూడా ఈ దుర్మార్గుడెప్పుడో వచ్చి కోట మట్టడిస్తాడని రాత్రింబవళ్ళు సర్వసన్నద్ధులై, సకల సన్నాహంతోనే ఉన్నారు. ద్వారకా నగరమంతా పగలు ఎట్లా ఉంటుందో రాత్రి కూడా సహస్రానేక దీపాలతో ఉంచుకోవడం వాళ్ళు పాటిస్తూ వచ్చారు. అందువల్ల పౌండ్రుడు వచ్చి నగరాన్ని ముట్టడించటం వాళ్ళకెటువంటి తొట్రుపాటు కలిగించలేదు. సంభ్రమం కలిగించలేదు.
ఉగ్రసేనుడు, బలదేవుడు, సాత్యకి, కృతవర్మ తమ తమ సైనిక నివహాలతో పౌండ్రుడిని ప్రతిఘటించారు. చతురంగ బలాలు ఎదిరి చతురంగ బలాలతో ఢీకొన్నాయి. యుద్ధ రంగంలో ఎందరో సైనికులతోపాటు ఏనుగులు, గుర్రాలు కూడా భయంకరంగా పోరాడి రుధిరకుల్యలు, శవాల గుట్టలు ఎక్కడికక్కడ కన్పించాయి.
పౌండ్రుడి సేనలన్నిటికీ ఆధిపత్యం వహిస్తున్న ఏకలవ్యుడు యాదవవీరులను ఆక్షేపిస్తూ రెచ్చగొట్టసాగారు. మీ సాత్యకి, మీ కృతవర్మ ఎక్కడా కనపడరేమి? బలదేవుడు మద్యపానంతో ఒళ్ళు మరిచి ఇంకా స్పృహలోకి రాలేదేమో!
కృష్ణుడెక్కడ పోయి తల దాచుకున్నాడు? నేను రావటం చూసి అందరూ ఆశ వదులుకున్నట్లున్నది! అని ప్రగల్భాలు పలికాడు. అప్పుడు యాదవ వీరులు రోషంతో విజృంభించారు. గొప్ప విలుకాడైన ఏకలవ్యుడు ఉగ్రసేనుడిపై ఏభై బాణాలు ప్రయోగించి వాళ్ళకు తహతహ పుట్టించాడు. ఆ తువాత వెంటనే అక్రూరుడిపై ఐదు, గదుడిపై ఇరవై అయిదు, సారణుడిపై పదకొండు, హార్దిక్యుడిపై నాలుగు బాణాలు ప్రయోగించి భయంకర యుద్ధం కొనసాగించాడు. యాదవ సైనికులు ఏకలవ్యుడి ధాటి ముందు నిలవలేకపోయినాయి.

ఇంకాఉంది

అక్కిరాజు రమాపతిరావు