భక్తి కథలు

హరివంశం 175

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దంష్ట్రాకరాళ దారుణ వక్త్రంతో అగ్నికీలలు వెలిగ్రక్కుతూ కృష్ణుడేడీ?! ఎక్కడ ఎక్కడ? అంటూ ఆకృత్య ద్వారాకానగరంలో ప్రవేశించి బీభత్సం సృష్టించింది. ద్వారకావాసులు ఎంతో సంక్షోభం పాలైనారు. కృష్ణ కృష్ణా! రక్షిం
చు రక్షించు! అని ఆయనను శరణువేడారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు రాణివాసంలో అక్ష క్రీడాలోలుడై (పాచికలాట) ఉన్నాడు. అలవోకగా ఆయన అప్పుడు ఆకృత్యపై తన సుదర్శనాయుధాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రాయుధాన్ని చూడటంతో కృత్య భయార్తయై పరుగులు తీసింది. కాశీరాజ పురోహితులను, ఆ అభిచార కర్మ పరతంత్రులై తనను సృష్టించిన మంత్రవేత్తలను గతాసువులను చేయాలని ఆ పిశాచి వచ్చి వాళ్ళను చంపివేసింది.
ఆర్తనాదాలు చేసి కాశీపురాన్నంతా భయపెట్టింది. ఇంతలో సుదర్శనాయుధం వచ్చి ఆకృత్యను మట్టిపెట్టింది. కాశీనగర ప్రజలు, నగర రక్షకులు, మంత్రులు సైనికులపై విరుచుకొనిపడి వాళ్ళను దగ్ధం చేసింది. అతి పవిత్ర నగరమైన కాశికి తన రాజు వంటి దుశ్చిరిత్రుడివల్ల, రాజకుమారుడు, దుష్టపురోహితులు, పిశాచకర్ములు అయిన మంత్రవేత్తలవల్ల ఇటువంటి దుస్థితి దాపురించింది. సుదర్శనాయుధం కాశీనగరాన్ని ఈ విధంగా బుగ్గిచేసి ద్వారకానగరం చేరి సర్వలోక ప్రభువుకు మొక్కి ఆయన వశవర్తిని అయింది.
తన వంశ రక్షకుడు శరణాగతత్రాణ పరాయణుడు, భారత యుద్ధంలో తన తాతలను కాపాడినవాడు, వాళ్ళకు జయం చేకూర్చినవాడు, తల్లి గర్భం నుంచి తన తండ్రిని బతికించినవాడు, అయిన శ్రీకృష్ణుడి కథలను వైశంపాయన మహర్షిని ప్రార్థించి ఒక సందర్భంలో వింటున్న జనమేజయ మహారాజుకు ఎంత విన్నా శ్రీకృష్ణ చరితం తృప్తి కలిగించక ఇంకా ఇంకా విస్తరించి చెప్పవలసిందని ఆ మహర్షిని ఆయన కోరుతూనే వచ్చాడు. అనంతమైన శ్రీకృష్ణ దివ్యగాథలు విస్తరించటానికి ఏండ్లూ పూండ్లూ చాలవు. కొన్ని సన్నివేశాలు సంక్షేపించి ప్రస్తావిస్తాను, మరి కొన్ని వివరంగా చెపుతాను అని వైశంపాయన మహర్షి శ్రీకృష్ణ దివ్యచరితను సంగ్రహీకరించాడు. కొన్ని ముఖ్యఘట్టాలను ఇట్లా ప్రసక్తం చేశాడు. తన రాజ్య వైభవాన్ని ధర అంతా విస్తరిస్తూ ద్వారకానగరంలో సర్వదేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరిపాలిస్తూ వసుంధరతలాన్ని అంతా తన వశం చేసుకున్నాడు.
పాండ్యులను, కేకయ దేశాధీశులను, కాళింగులను, అంగ వంగ ధరాధిపతులను ఆయన ఒక్కొక్క కారణంగా జయించి వశపరచుకున్నాడు. గాంధారరాజ కన్యను వివాహమాడాడు. ద్రోణుణ్ణి, ఆయన కుమారుణ్ణి, కృపాచార్యుణ్ణి, కర్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి ఆయా సందర్భాలలో ఓటమిపాలు చేశాడు. భీష్ముణ్ణి కూడా పరాజయం పాలు చేశాడు ఒకసారి. తన మేనత్త వేడుక కోసం తనను వేడుకొనగా భీముణ్ణి ఓడించాడు పంకజాక్షుడు. అర్జునుడి చేత కూడా దాసోహం అనిపింపజేసుకున్నాడు.
బభ్రుడనే యాదవరాజ వంశీకుడి కోసం సౌవీర దేశాధిపంతిని జయించి ఆయన కూతురును తీసుకొని వచ్చి బభ్రుడికిచ్చి పెండ్లి జరిపించాడు. రుక్మి చెలికాడైన వేణుధారి మచ్చరించి తనపైకి దండెత్తగా, అతడి సహాయకులైన రాజులందరితోపాటు వేణుధారిని చంపివేశాడు కృష్ణుడు. కరూష దేశాధీశుడైన దంతవక్తృణ్ణి వధించాడు. ఈ దంతవక్త్రుడు దక్షిణ దేశాధీశుడు. తన రాజ్యం చుట్టూ వున్న కొండలను పిండి చేసి ద్రుమసేనుణ్ణి సంహరించాడు. ఇరావతి నగరాన్ని ముట్టడించి గోపత్రితాలకేతుడు అనే రాజులను పరిమార్చాడు. యక్షప్రపతనం అనే ప్రదేశంలో నిమి, హంసుడనే బలపరాక్రమ గర్వితులను సంహరించాడు. వజ్రుడు, శైబ్యుడు, శతధన్యుడు, ఉగ్రసేనుడు అనే రాజులను నిర్జించాడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు