భక్తి కథలు

హరివంశం 198

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీ చేతులనన్నిటినీ డుల్చి నిన్ను మోడు చేస్తాను’ అని హెచ్చరించాడు. బాణుడికి దీనితో పట్టరాని ఆగ్రహం కలిగింది. ఎడాపెడా అన్ని చేతులతోనూ వివిధ అస్త్రాలు, శస్త్రాలు కృష్ణుడిపై ప్రయోగించాడు. బాణుడు ప్రయోగించిన బాణాలతో ఆకాశం మూసుకుపోయింది. రాక్షసులంతా ఆకాశానికెత్తినంతగా ప్రశంసించారు బాణుణ్ణి. హిరణ్యకశిపుడితడి ప్రపితామహుడు. అతడి పరాక్రమం కూడా బాణుడి ముందు దిగదుడుపే అని కేరింతలుగా చెప్పుకున్నారు. కహ కహ నవ్వారు.
అప్పుడింకా విజృంభించి బాణాసురుడు తామసాస్త్రం ప్రయోగించాడు. దిక్కు దిక్కుల చీకట్లు ఆవరించాయి. గాఢాంధకారం అలముకొంది. ఎక్కడా ఏదీ కనపడటంలేదు. నారాయణుడు దీని సహించక గోపాలకృష్ణుడు ఇంద్ర దేవతాకమైన ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు చీకట్లన్నీ విరిసిపోయినాయి.
ఇక ఈ యుద్ధం ముగించదలచి వివిధ దేవతాకమైన ప్రబలాస్త్రాలను బాణుడిపై ప్రయోగించాడు కృష్ణుడు. బాణుడి రథం ముక్కలు ముక్కలైపోయింది. దేవతలు జగదీశ్వరుణ్ణి జయ జయధ్వానాలతో ప్రశంసించారు. దేవా! నీవు అవతరించిన పని నెరవేరబోతున్నది. ఇక ఉపేక్ష చేయవద్దు. జగద్రక్షణ కోసమే కదా నీవు అవతరించింది అని జనార్దనుణ్ణి స్తుతించారు. బాణుడు మూర్ఛితుడై తన రథం నుంచి పడిపోయినాడు.
ఈ సమయంలో కుమారస్వామి సోదర ప్రేమతో బాణుడికిచ్చిన మయూరం గరుడుణ్ణి భంగపరచి ప్రతీకారం తీర్చుకోవటానికి సుపర్ణుడిపై పోరుకు సిద్ధపడింది. ఈ మయూరాన్ని తన ధ్వజ రక్షణకు ప్రీతితో బాణుడికి హూకరించాడు పరమశివుడు పుత్ర వాత్సల్యంతో, బాణుణ్ణి ఆదరించిన సందర్భంగా. పంకజనాభుడు ఇట్ల స్కందవాహనమూ, ధ్వజమూ అయిన మహా మయూరం వైనతేయుడితో పగ సాధించటానికి పోరాటానికి రావటం చూసి విస్మయ చకితుడైనాడు. రెక్కలతో తాడించుకున్నాయి నెమలీ, గరుడీ, ముక్కులతో పొడుచుకున్నాడు. పాదనఖాలతో పరస్పర శరీరాలను చీల్చుకున్నాయి. మండలాకారంగా ఒక దానిని ఒకటి ఆక్రమించుకోవాలని చిత్రనర్తన ఖేలలు ప్రదర్శించాయి. కాని సుపర్ణుడి ఢాకకు మయూరం నిలవలేకపోయింది. తన రెక్కలతో దానిని బంధించి తన కాలి గోళ్ళతో చీల్చి ముక్కుతో పొడిచి పొడిచి, దాని శరీరాన్ని ముద్ద ముద్ద చేసి నేలమీదకు విసరి కొట్టింది వైకుంఠ ధ్వజం. దీనితో బాణుడు హతాశుడైనాడు. పరమ శివుడు వర ప్రదాన సందర్భం అతడికప్పుడు గుర్తువచ్చింది. ధ్వజమెప్పుడు నేల కూలితే అప్పుడు నీకు బలవత్తరుడైన మహామహుడితో పోరు సంఘటిస్తుందని మహేశ్వరుడు చెప్పటం బాణాసురుడి స్మతిపథంలో మెదిలింది. పోరు సంఘటించటమే కాక ఇక ఎవ్వరితో ఎప్పుడూ యుద్ధం మాట తలపెట్టలేని సమాప్తి కూడా కలగబోతున్నదని బాణుడు గ్రహించాడు. దీనాననుడైనాడు. అతడి శక్తియుక్తులు, పౌరుషం, బింకం సడలిపోయినాయి. నేను ఇన్నాళ్లూ నాకంటే లోకంలో బల పరాక్రమశాలి ఎవరూ లేరని విర్రవీగాను. అహంకరించాను. ఎవరి హితవచనాలు పట్టించుకోకుండా పెడచెవిని పెట్టాను అని విషణ్ణ హృదయుడై పరితపిస్తూ ఉండగా అతడి ఆర్తి మహాదేవుడి దయా హృదయంలో ప్రతిస్పందన పొందింది. ఆయనకు చాలా జాలి కలిగింది. బాణుడు నా అండ చూసుకుని నిశ్చింతుడై ఉన్నాడు ఇన్నాళ్ళూ. వాడికిప్పుడు చేటు మూడిందన్న కరుణతో మహేశ్వరుడు నందికేశ్వరుడికిట్లా చెప్పాడు. ‘నాయనా! బాణుడు భగ్నరథుడై నేలమీద పడి ఉన్నాడు. దిక్కూ దెసా తోచక ఆక్రోశిస్తున్నాడు. ఇపుడు నేనతడి సహాయానికి వెళ్లలేను. చతుర్ముఖుడికి మాట ఇచ్చాను.

ఇంకాఉంది