భక్తి కథలు

హరివంశం - 200

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబకతో అప్పుడు కృష్ణుడిట్లా చెప్పాడు. ఈ దనుజుడు తనకు వేయి బాహువులున్నాయని కండకావరంతో ఉన్నాడు. మత్తిల్లి ఉన్నాడు. ఎవరినీ లక్ష్యం చేయకుండా ఉన్నాడు. కాబట్టి నీవు జీవత్పుత్రవతివిగా ఉండాలనుకుంటే ఈ బాహువులు ఖండించి రెండు చేతులు మాత్రమే మిగిల్చి ఉంచుతాను వీడికి. ఇక అప్పుడు వీడికి అసుర భావం తొలగిపోతుంది. నీకు కూరిమి భక్తుడవుతాడు. ఇక ఎటువంటి ఆపదల పాలుకాడు. మదోద్రేకాలకు దూరంగా ఉంటాడు. అపుడు లలిత పరమేశ్వరి లంబరూపం ఉపసంహరించి తన చెలికత్తెను తోడు చేసుకొని అంతర్థానం చెంది తన నిజ నివాసానికి ఆగమించింది.
‘అయ్యయ్యో! ఒక స్ర్తి నా పూనికను భంగించింది. నీవు అంబ దయతో బతికిపోయినావనుకుంటున్నావేమో! ఆమె ఆ స్వరూపంతో నన్ను వచ్చి అర్థించటంవల్ల నీ ప్రాణాలు కాపాడుకున్నావు. అయినా నిన్ను నేను విడిచిపెట్టను. ఇదిగో సుదర్శనాయుధం నీ కండకావరం అణగిస్తుంది చూడు’ అని చక్రాయుధాన్ని ప్రయోగించాడు చక్రపాణి.
ఈ విధంగా ఉద్యద్భాను సహస్రాభంగా దివ్యకాంతులతో తేజరిల్లుతూ చరాచర జగత్తు అంతా భ్రమసి చూస్తూ ఉండగా చేతులు రెండు మాత్రమే మిగిల్చి బాణుడి తక్కిన చేతులన్నిటినీ ఖండించింది సుదర్శనాయుధం.
ఇక మళ్లీ స్వామి మెప్పు పొందుతూ ఆయన దగ్గరకు వచ్చి చేరింది. బాణుడి చేతులన్నీ విదళనం కావటంవల్ల అక్కడ నెత్తుటేరులు పారాయి. ఎర్రని సెలయేళ్ళు ప్రవాహాలు కట్టే కొండలాగా చూపట్టాడు బాణుడు.
అయినా దంభ మాత్సర్యం విడిచిపెట్టలేదు. రెండు చేతులతోనే కార్ముకమూ, సాయకమూ సంధించి కృష్ణుడిపై గురిపెట్టే ప్రయత్నం చేశాడు. పెద్దబొబ్బలు వెలువరించాడు. దిక్కటాహాలు బాణుడి అరపులతో ప్రతిధ్వనించాయి. శ్రీకృష్ణుడిది సహించలేకపోయినాడు. మళ్లీచక్రాయుధం ప్రయోగించటానికి సమాయత్తమవుతుండగా మహేశ్వరుడు, దేవ సేనాపతితో అక్కడకు వేగంగా చేరుకున్నారు.
‘వీడు నాకు పుత్రుడు. నేను వరమిచ్చాను పుత్రసముడిగా వీడిని చూసుకుంటానని. కాబట్టి వీణ్ణి చంపకుండా విడిచిపెడితే నీవు నాకు పుత్రదానం చేసినట్లవుతుంది. లేకపోతే నా వరం దబ్బరమవుతుంది. కాబట్టి వీణ్ణి చంపవద్దు. ఇది నా వనితి’ అని మహాదేవుడు శ్రీకృష్ణుణ్ణి అర్థించాడు.
‘అయ్యో! నీవు నన్ను ప్రార్థించటమా త్రిపురహరా! హరా! నీవు సకల లోకారాధ్యుడవు. నాకు పుత్రుణ్ణి ప్రసాదించవలసిందని నేను నిన్ను దలచి తపస్సు చేశాను కదా! నీ కోరిక నెట్లా కాదంటాను! నీ ఆజ్ఞ అవశ్యం నేను తలదాలుస్తాను. ఇదుగో ఈ నా చక్రాన్ని వెంటనే ఉపసంహరిస్తున్నాను. అని తలవంచి ఈశ్వరుడికి నమస్కరించాడు పరమేశ్వరుడు. ‘ఈ దితి సుతుడు నీవల్ల బతికిపోతున్నాడు’ అని పరమేశ్వరుడి అభ్యనుజ్ఞ నర్థించి సుందరస్యందనం ఎక్కి బలరామ, ప్రద్యుమ్నులతో అనిరుద్ధ బంధన ప్రదేశానికి వెంటనే చేరుకున్నాడు.
ఇక నందికేశ్వరుడు బాణుణ్ణి తన రథంలో పరమశివుడి సన్నిధికి తీసుకొని వచ్చాడు. ‘్భక్త్భాష్ట సతత వరప్రదుడు, భవుడు, భవానీపతి, నీకు ప్రాణభిక్ష ప్రసాదించినవాడు, ఆర్తశరణ్యుడు, అంబికానాథుడు, నీ విఖండిత సహస్ర బాహు పరివేదనను శ్రీకృష్ణుడు మిగిల్చిన రెండు చేతులతో నమస్కరించి ప్రీతుణ్ణి చేయవలసింది అని నంది ఉద్బోధించాడు బాణుణ్ణి.
భయమూ భక్తీ ఆర్తీ పరితాపమూ హృదయంలో గుడుసుళ్ళు పడగా తన మేని నొప్పిని కూడా పరిగణించకుండా చేతుల దోయిలించి ప్రమధాధిపుడి ఎదుట ఆనంద నర్తనం చేశాడు బాణుడు. కరుణతో కరిగిపోయినాడు శివుడు. ‘బాణుడా! నీకు వరములివ్వాలని నాకు చిరకాల కాంక్ష.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు