భక్తి కథలు

హరివంశం 202

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకానగరమంతా చిన్నబోయి ఉంది. ఇప్పుడు వధూవరుల సహితంగా మనం ద్వారవతికి వెళితే ఆ నగరం ఎంతగానో శోభిస్తుంది. ఉప్పొంగిపోతుంది అని ఆయనతో సంతోష వార్తలు ముచ్చటించుకుంటూ అంతఃపురంలో ఉన్న అనిరుద్ధుణ్ణి చూడటానికి పోతుండగా ఇంతలో చిత్రరేఖ వారికి ఎదురువచ్చి సంతోష స్వాగతం చెప్పింది.
ఎప్పుడైతే గరుడారూఢుడై శ్రీకృష్ణుడు మనవణ్ణి రక్షించుకోవటానికి శోణనగరం వచ్చాడో అప్పుడే అనిరుద్ధుడి నాగపాశాలన్నీ వీడిపోయినాయి. అయితే ఇంకా అనిరుద్ధుడి దేహం బాణ ప్రపడీతమయ్యే ఉంది. వాసుదేవుడు మనవణ్ణి చూసి వాత్సల్య సమ్మోద సంభ్రమంతో కౌగిలించుకున్నాడు. ఎప్పుడైతే తన పితామహుడు అనిరుద్ధుణ్ణి కౌగిలించుకున్నాడో అప్పుడు అతడి శరీరంపైన యుద్ధ వ్రణాలన్నీ మానిపోయినాయి. అధిక తేజస్సుతో, సంతోషోత్సాహాలతో అనిరుద్ధుడు హర్షపులకితగాత్రుడైనాడు. బలదేవుడు, ప్రద్యుమ్నుడున్నూ అతణ్ణి పరిరంభణం చేసుకున్నారు. నారదుడికి, వైనతేయుడికి అనిరుద్ధుడు నమస్కరించాడు. తాతలకు, తండ్రికి మొక్కాడు. వాళ్ళంతా కొత్త పెండ్లికొడుకునాశీర్వదించారు. చిత్రరేఖ, ఇంకా ఆమె చెలికత్తెలు తన వెంటరాగా ఉషారమణి అక్కడకు వచ్చి వాళ్ళందరికీ నమస్కరించింది. ఆమె సాంజలి బంధంలో ప్రియమూ, భక్తీ లజ్జా సంతోషమూ ఉట్టిపడ్డాయి. అందరూ ఆమెను ఆశీర్వదించి మెచ్చుకున్నారు.
అపుడు నారదుడు కృష్ణుడితో సరసంగా, సంతోషంగా యుద్ధ విజయుడివై నీ మనవణ్ణి నీవు పొందగలిగావు. ఇపుడు పెండ్లి చేసి మా అందరికీ విందూ వీనుల విందూ కనులవిందు కూడా నిర్వహించవయ్యా స్వామీ! అని కోరాడు. పెండ్లి చేసుకున్న తర్వాత కదా వధువును మరులు పెండ్లికి తీసుకొని వెళ్లటం అని కూడా చమత్కరించాడు. అంతేకాదు ఇప్పుడిది వివాహానికి సుముహూర్త సమీప ఘడియ కూడాను అని తెలియజేశాడు. ఇంతలో కుంభాండుడు ఉషా వివాహానికి సర్వ సన్నాహాలు చేసుకుని మంగళద్రవ్యాలు, శోభన వస్తువులు అన్నీ సమకూర్చుకొని అక్కడకు రానే వచ్చాడు. వచ్చి శ్రీకృష్ణుని శరణు కోరాడు. నా పట్ల ప్రసన్నుడివి కావలసింది అని ప్రార్థించాడు.
నారదుడు కూడా ఈ కుంభాండుడు నీ కృపకు అర్హుడు అని శ్రీకృష్ణుడికి చెప్పాడు. అప్పుడు కృష్ణుడు నీవు యోగ్యుడవని నాకు తెలుసు. ఈ బాణుడి రాజ్యానికి నిన్ను అధిపతిని చేస్తున్నాను. ఈ రాజ్యాన్ని అంతా నీకిచ్చాను అని ఆ అసుర మంత్రిని సంభావించాడు.
ఇక అప్పుడు నూతన వధూవరులు పెండ్లి వేదికపై ఆశీనులైనారు. ఈ పెండ్లికి బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన సురశ్రేష్ఠులంతా వచ్చారు. సురాంగనలు ఆట పాటలతో అలరించారు. ఇంద్రాణి శచీదేవి పేరంటం నిర్వహించింది. బృహస్పతి వివాహక్రతువునంతా దగ్గరుండి జరిపించాడు.
అప్పుడు గోవిందుడు ఉషానిరుద్ధులను వెంట తీసుకొని వెళ్లి రుద్రుడికీ, రుద్రాణికీ వారి చేత మొక్కులు మొక్కించారు. బ్రహ్మదేవుడికీ, ఇంద్రుడికీ, దివిజ శ్రేష్ఠులకూ వీడ్కోలు చెప్పాడు కృష్ణుడు.
శైలనందన ఈ కొత్త దంపతులకు ఒక నెమలిని కాన్క పెట్టింది. అది వారికి వాహనమవుతుందని దీవించింది. అప్పుడిక కృష్ణుడు నూతన వధూవరులతో ద్వారకానగరానికి ప్రయాణమవుతుండగా ఇంతలో కుంభాండకుడు వచ్చి ఆయనకిట్లా విన్నవించాడు.
‘‘ప్రభూ! బాణుడి పసు సంపద అంతా వరుణడి ఇల్లడంలో ఉన్నది. వాటి పాలు తాగినవారు సత్వగుణంతో బల యశస్సులతో వృద్ధి పొందుతారు. కాబట్టి వాటిని మీరు మీ స్వాధీనం చేసుకోవటం వాంఛితం.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు