భక్తి కథలు

హరివంశం 208

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి రాజధానిగా స్వర్లోక రాజ్యాన్ని మహా వైభవంగా పరిపాలించసాగాడు. అపుడు ఇంద్రుడు కూడా అందుకు సమ్మతించి, రజి దగ్గరకు వెళ్లి నీవు ఇంద్ర పదవిననుభవించటం నాకు ఇష్టమే. నన్ను నీ పుత్రుణ్ణిగా చూసుకో. నేనున్నూ నీ పట్ల పితృభావంతో త్రైలోక్య రాజ్య నిర్వహణలో నీ సేవ చేస్తాను అని వినయంగా చెప్పాడు. అయితే దీనికి కొద్దికాలంలోనే ఒక వ్యత్యయం సంభవించింది.
రజి కుమారులు అధికాధిక సంఖ్యాకులు తమ తండ్రి ఇంద్రుడైనాడు కాబట్టి ఒక్కొక్కరూ, పదులు పదులుగా స్వర్గలోకానికి చేరి తండ్రి సామ్రాజ్యాన్ని అనుభవించసాగారు. అంతటా వారే వాసకులైనారు. సమస్త దేవ కార్య నిర్వహణను తమ భుజ స్కంధాలమీద వేసుకున్నారు.
దీనితో ఇంద్రుడికి చాలా దుఃఖం కలిగింది. సుర గురుడైన బృహస్పతి దగ్గరకు వెళ్లి ఆయన తన గోడు వెళ్ళబోసుకున్నాడు. బృహస్పతి పాద ప్రణతుడైనాడు. తనను ఈ దుర్భర మనఃక్లేశం నుంచి కాపాడవలసిందిగా తన ఆచార్యుణ్ణి ప్రార్థించాడు. ఒక యజ్ఞం చేసి అందులో ఒక రేగు పండు ప్రమాణంతో ఉండే యజ్ఞ్ఫలమైనా నాకు సంక్రమింపజేస్తే ఈ గండం నుంచి గట్టెక్కుతాను కదా అని వాపోయినాడు ఇంద్రుడు. నా పట్ల ఈ శ్రద్ధాసక్తులు, విశ్వాసం నీకు ముందే ఉంటే నీకు ఈ గతి పట్టేది కాదు కదా అని సున్నితంగాగానైనా ఇంద్రుణ్ణి మందలించి సురగురుడు ఒక మహాద్భుత ప్రశస్తమైన యజ్ఞం ఇంద్రుడి చేత నిర్వహింపజేశాడు. ఇంద్రుడికి అత్యంత తేజోవృద్ధి, ఆయన శత్రువులకి పరాజయ, పరాభవ, దుష్కీర్తివృద్ధి ఈ యజ్ఞం ద్వారా ఉద్దేశించాడు బృహస్పతి.
రజి పుత్రులు కామరోషలంపటులై త్రైలోక్య సంపదను చూసుకొని దుర్గర్వితులై అధర్మ పరులై లోకగర్వితులై నశించిపోయినారు. ఇంద్రుడు గుర్వనుగ్రహంతో విజయలక్ష్మీవరుడైనాడు. రజి తన తొంటి ప్రాభవాన్ని, ప్రభావాన్నీ కోల్పోయాడు. అందువల్ల ఇంద్రు డు తన పదవిలో పునః ప్రతిష్ఠితుడైనాడు. పురూరవుడి జ్యేష్ఠపుత్రుడైన ఆయువుకు పుట్టిన ఐదుగురు కుమారులలో అత్యంత ప్రసిద్ధులైన నాలుగో కొడుకు రజి చరిత్రం ఇది కాగా, ఆయన పెద్దకొడుకైన నహుషుడికి యయాతి, సంయాతి, ప్రయాతి అనే ముగ్గురు కొడుకులు జన్మించారు.
నహుషుడి పుత్రులలో యయాతి అత్యంత ప్రసిద్ధుడు. ఇంద్ర తుల్యుడు. ఆయనతో ఇంద్రుడు స్నేహం చేసి ఒక గొప్ప దివ్యరథాన్ని, దాని రథ్యాలను యయాతికి బహూకరించాడు. సమస్త భూమండలాన్ని యయాతి మహారాజు కొన్ని రోజులు పరిపాలించాడు. ఈయన చరిత్ర త్రిలోక ప్రసిద్ధం. యయాతి మహారాజు సంతానం కూడా లోకంలో తండ్రి కీర్తి ప్రతిష్ఠలను తలపింపజేశాయి. ఇందులో పూరుడు మరింత ప్రసిద్ధుడు.
యయాతి మహారాజుకు ఇద్దరు భార్యలు. ఒకామె శుక్రాచార్యుడి పుత్రిక అయిన దేవయాని. రెండో ఆమె వృషపర్వుడనే దానవేశ్వరుడి కుమార్తె శర్మిష్ఠ. దేవయానివల్ల యయాతికి ఇద్దరు కొడుకులు కలిగారు. వీళ్ళు యదువు, తుర్వసుడు అనే వాళ్ళు. అట్లానే శర్మిష్ఠ ద్వారా ఆ మహారాజుకు ద్రుహుడు, అనుడు, పూరుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.
వీళ్ళలో పూరు వంశం శాఖోపశాఖలై విస్తరించి ఎంతో ప్రసిద్ధి పొందింది. జనమేజయుడి వరకు ఇంద్ర రథం వీరి అధీనంలోనే ఉండేది. పరీక్షీన్మహారాజు కుమారుడు జనమేజయుడు. ఒకసారి ప్రమాదవశాత్తు ఆయన గర్గ వంశానికి చెందిన ఒక బాలుణ్ణి వధించినందువల్ల ఈయనకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. శరీరమంతా వివర్ణణ పొంది లోహగంధం సంప్రాప్తించింది.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు