భక్తి కథలు

హరివంశం 212

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ జహ్ను మహర్షి (రాజర్షి) పుత్రుడే అజితుడు. ఇది ఎట్లా సంభవించిందంటే యువనాశ్వుడి పుత్రిక అయిన కావేరి తపస్సు చేసి అర్థశరీరంతో నదిగా ప్రవహించింది. తక్కిన అర్థశరీరంతో జహ్నుడికి భార్య అయింది. వీరికి అజితుడు జన్మించాడు. అజితుడికి బలాకాశ్వుడనే పుత్రుడు పుట్టాడు. ఈ బలకాశ్వుడి కుమారుడే కుశికుడు.
కుశికుడికి మహేంద్రుణ్ణి మించిన కొడుకును కనాలని కోరిక గలిగి గొప్ప తపస్సు చేస్తుండగా ఇంద్రుడికి చాలా వెరపు కలిగింది. ఈ భీతిని ఎట్లా పోగొట్టుకుందామా అనే ప్రయత్నంతో ఇంద్రుడే కుశికుడికి తనయుడుగా గాధి అనే పేరుతో పుట్టాడు. కుశికుడి కుమారుడు కాబట్టి ఈయన కౌశికుడు అనిపించుకున్నాడు.
మహేంద్ర తుల్య విభవుడు, పరాక్రమ శోభితుడూ అయినాడు. గాధి మహారాజుకు విశ్వామిత్రుడు పెద్దకొడుకు. ఇంకా ఆయనకు విశ్వరథుడు, విశ్వకృత్తు, విశ్వజిత్తు అనే కుమారులు కలిగారు. సత్యవతి అనే తనయ కూడా కలిగింది. ఈ సత్యవతిని ఋచీక మహర్షి పెండ్లి చేసుకున్నాడు. వీరికే జమదగ్ని మహర్షి జన్మించాడు. విశ్వామిత్రుడికి దేవరాతుడు మొదలైన చాలామంది పుత్రులు పుట్టారు. వీళ్ళు బ్రాహ్మణ వంశాలకు, క్షత్రియ వంశాలకు గోత్రీకర్తలైనారు. జాహ్ను మహర్షి వంశం ఇట్లా శాఖోపశాలుగా విస్తరించింది.
ఇక అమీఢుని రెండవ భార్య అయిన నలినికి సుశాంతుడనే కొడుకు పుట్టాడు. ఈయనకు పురుహేతి అనే పుత్రుడు జన్మించాడు. ఈయనకు బహ్వశ్వుడు పుట్టాడు.
ఈయనకు ఐదుగురు కొడుకులు పుట్టారు. ముద్గలుడు, సృంజయుడు, బృహదిషుడు, యవీనరుడు, క్రిమిలాశ్వుడు అని వీళ్ళ పేరులు. వీళ్ళను చూసి తండ్రి చాలా పొంగిపోయినాడు. వీళ్ళు బహుజనపదాలను పరిపాలించటానికి సమర్థులని పాంచాలురు అని ముద్దుగా వీళ్ళను పిలిచుకున్నాడు. అందువల్ల వీళ్ళు పాంచాలురుగా ప్రసిద్ధులైనారు. గొప్ప పరాక్రమవంతులైనారు. వీళ్ళు పాలించిన దేశం పాంచాల దేశం అయింది.
వీరిలో మొదటివాడైన ముద్గలుడికి వౌద్గల్యుడు పుట్టి నల మహారాజు తనయయైన ఇంద్రసేనను వివాహమాడాడు. వీళ్ళకు వారస్యుడనే కొడుకు కలిగాడు. ముద్గలుడి తమ్ముడు సృంజయుడి మనుమడు సోమదత్తుడు, ఈయన మనుమడు సోమదత్తుడు. ఈయన మనుమడు సోమకుడు. సోమకుడికి చాలామంది సంతానం ఉన్నారు. పృషతుడు వీళ్ళందరిలో పెద్దవాడు. పృషతుడి పుత్ర పౌతులే దృపదుడు, దృష్టద్యుమ్నుడు.
అజమీఢుడి మూడవ భార్య అయిన భూమిని పదివేల యేండ్లు తపస్సు చేసింది. స్ర్తిలకింతటి తపశ్శక్తి ఉంటుందా అని లోకమంతా ఆశ్చర్యపోయింది. అగ్నిహోత్ర సమర్చనం, ఆహర నియతి, వ్రత నియతిగా ఆచరించింది.
ఆమె అగ్నిహోత్రుడి సమీపంలో పవిత్ర దర్భాజనంపై శయమించి ఉండగా ఆమె భర్త అయిన అజమీఢుడికి ఆమెను పొందాలన్న కోర్కె కలిగింది. దీనివల్ల ధూమవర్ణుడైన అత్యంత సుందరుడైన పుత్రుడు ఋక్షుడు జన్మించాడు. జనులకు అత్యంత ప్రియతముడై సామ్య్రాన్ని పరిపాలించాడు. ఈయన కుమారుడే సంవరణుడు.
సంవరుణుడే కురుక్షేత్రాన్ని కలిగించినవాడు. గంగా తీరం నుంచి ప్రయాగ దాకా ఉండే కురుక్షేత్రం పుణ్యభూమి నాక లోకంలో కూడా ప్రసిద్ధికెక్కింది.
సంవరుణుడికి పరీక్షిత్తు అనే కొడుకు పుట్టాడు. ఈయనకు జనమేజయుడు పుట్టాడు. ఈ జనమేజయుడికి సురథుడు, ఈయనకు వదూరధుడు, ఈయనకు ఋక్షకుడు, ఈయనకు భీమసేనుడు జన్మించారు.

- ఇంకా ఉంది

-అక్కిరాజు రమాపతిరావు