భక్తి కథలు

హరివంశం 216

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహుకుడు మహాపరాక్రమవంతుడుగా ప్రసిద్ధికెక్కి విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన కాశీరాజు కూతురిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి దేవకుడు, ఉగ్రసేనుడు అనే తనయులు కలిగారు. దేవకుడి పుత్రులు సుదేవుడు, ఉపదేవుడు. దేవరక్షితుడు, దీప్త్భుజుడు అనే కొడుకులు పుట్టారు. దేవకి, శాంతి అను దేవ మొదలైన తొమ్మిది మంది కూతుళ్ళు పుట్టారు. ఉగ్రసేనుడికి కంసుడు పెద్దకొడుకు. తరువాత ఇంకా ఎనిమిదిమంది కొడుకులు పుట్టారు. కంసవతి, సుతనువు మొదలైన ఐదుగురు కూతుళ్ళు కూడా ఉగ్రసేనుడికి ఉన్నారు. అంధకుడి రెండో కొడుకైన భజమానుడి వంశంలో ప్రసిద్ధికెక్కినవాడు కృతవర్మ. ఇక సత్వతుడి చివరి కుమారుడైన వృష్ణి వంశంలో ప్రసిద్ధులైన రాజులు జన్మించారు.
ఈ వృష్ణికి గాంధారి, మాద్రి అనే వారు ఇద్దరు భార్యలు. గాంధారి కుమారుడు సుమిత్రుడు. మాద్రికి యుథాజిత్తు, దేవమీఢుడు, అనమిత్రుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. దేవమీఢుడి కుమారుడు శూరుడు. శూరుడి ఇల్లాలు మారిష. వీరి పుత్రుడే వసుదేవుడు. దేవతుల్యుడు ఈ వసుదేవుడు. వసుదేవుడు పుట్టినప్పుడు ఆకాశంలో ఆనక దుందుభులు మోగాయి. పుష్పవృష్టి కురిసింది. అందువల్ల వసుదేవుడికి మొదట ఆనక దుందుభి అనే ప్రశంసానామం కలిగింది. ఆ తరువాతనే ఆయన సువర్ణ తనుకాంతిని బట్టి వసుదేవుడనే పేరు ప్రసిద్దికి వచ్చింది. వసుదేవుడికి ఇంకా తొమ్మిదిమంది అనుజులున్నారు. వీరిలో దేవభాగుడు, దేవశ్రవుడు, అనాదృష్టి ప్రసిద్ధులు.
దేవభాగుడి తనయుడే ఉద్ధవుడు. ఈయన నీతికోవిదత్వంలో బృహస్పతికి సాటివస్తాడు. ఆయనకు శ్రుతకీర్తి, శ్రుతుదేవ, శ్రుతశ్రవ, పృథను తనకత్యంత ఆప్తబంధువైన కుంతిభోజుడికి పెంపుకిచ్చాడు. అందువల్ల ఆమె పేరు కుంతి అయింది. ఈ కుంతీదేవి పాండురాజుకు భార్య అయింది. ఈమెకు యమ, వాయు, ఇంద్ర, అశ్వనుల అంశలతో ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు, నకుల, సహదేవులు జన్మించారు. కరూశ దేవాధిపతియైన వృద్ధశర్ముడిని కుంతి తోబుట్టువు శ్రుతకీర్తి వివాహమాడింది. వీరికి దంతవక్త్రుడు జన్మించాడు. శ్రుతశ్రవ చేదిరాజైన దమఘోషుణ్ణి వివాహమాడింది. వీరికి హిరణ్యకశిపుడి అంశతో శిశుపాలుడు జన్మించాడు.
వసుదేవుడి ఇంకొక చెల్లెలైన శ్రుతదేవకు కేకయ దేశ రాజుకు ఏకలవ్యుడు పుట్టాడు. కాని ఇతడు పుట్టినప్పటినుంచీ నిషాదులతో పెరిగాడు. రాజాధిదేవి అవంతీశ్వరుణ్ణి పెళ్లాడింది. వీరికి విందానువిందులు జన్మించారు. వసుదేవుడికి రోహిణి ప్రథమ పత్ని. ఈమె బ్లాహిక దేశాధీశుడి పుత్రి. ఈమె ప్రథమ సంతానం బలరాముడు. బలరాముడి తర్వాత రోహిణివల్ల వసుదేవుడికి ఇంకా ఎనిమిదిమంది కొడుకులు పుట్టారు.
వీరిలో సారణుడు బలరాముడి పెద్ద తమ్ముడు, గదుడు అందరికన్నా చిన్న తమ్ముడు. ఈ అన్నాదమ్ములకు ఒక సోదరి ఉన్నది. ఆమె పేరు చిత్ర. ఈమే సుభద్ర అనే పేరుతో పాండవ మధ్యముడు, కురువంశ వివర్థునుడు అయిన అర్జునుణ్ణి పెళ్లాడింది.
వసుదేవుడు దేవకుడి కూతురైన దేవకిని పరిణయమాడి జగత్ప్రభువు, తామరసేక్షణుడు, నీలమేఘశ్యాముడు అయిన కృష్ణుడి కన్నతండ్రి అయినాడు. తక్కిన భార్యలందు కూడా ఆయనకు చాలామంది కుమారులు పుట్టారు. బలదేవుడికి రేవతి ద్వారా చాలామంది సంతానం కలిగారు. ఆయన పెద్దకొడుకు ఉల్ముకుడు.
కృష్ణుడు అష్టమహిషులను పెళ్లి చేసుకున్నాడు. ప్రద్యుమ్నుడాయన పెద్దకొడుకు. నరకాసురుణ్ణి చంపినపుడు వేల సంఖ్యలో ఆ రాక్షసుడు చెరపెట్టి తెచ్చిన దేవ గంధర్వ యక్ష రాక్షసు సిద్ధచారణ మునికన్యలను ఆయన పెళ్లాడాడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు