భక్తి కథలు

హరివంశం 222

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు కృష్ణుడు బలరాముడితో ‘అన్నా! మన గుర్రాలు కూడా బాగా అలసిపోయినాయి. వాణ్ణి తరిమి పట్టుకుంటే కాని చిక్కడు. నీవు రథాన్ని నెమ్మదిగా తోలుకుంటూ రావలసింది. నేను తరుముతూ వాడి వెంట పరుగు తీస్తాను అని బలదేవుణ్ణి అంగీకరింపజేసి కృష్ణుడు శతధన్వుణ్ణి తరముకుంటూ వెళ్ళాడు. వాడు మిథిలవైపు పరుగులు తీయటం చూశాడు కృష్ణుడు. శతధన్వుడు ప్రాణభయంతో పరుగు మరింత పెద్దది చేశాడు. దీనితో కృష్ణుడికి కోపం వచ్చి చక్రాయుధం ప్రయోగించి వాణ్ణి చంపివేశాడు. వాడు చచ్చిపడిపోయినాడు. కృష్ణుడు శతధన్వుణ్ణి సమీపించి వాడి శరీరమంతటా మణి కోసం వెదకి చూశాడు. మొలకచ్చలో బిగించాడేమోనీ, నోటిలో ఉంచుకున్నాడేమోననీ, తలపైన ఏదైన ఉపాయంతో దాచుకున్నాడేమోననీ కృష్ణుడు వాడి దేహమంతా గాలించాడు. ఆ మహాప్రభావ సమన్వితమైన ఆ రత్నం కృష్ణుడికి కన్పించలేదు. ఇంతలో హలాయుధుడు కూడా అక్కడకు చేరుకున్నాడు. అప్పుడు కృష్ణుడు ‘అన్నా! మన ప్రయత్నమంతా వ్యర్థమైంది. ఇంత గట్టి ప్రయత్నం చేసినా కలసి రాలేదు. శ్యమంతకం వీడి దగ్గర కనపడటంలేదు’ అని బలరాముడికి చెప్పాడు. బలరాముడీ మాటలు నమ్మలేదు. కటకటబడిపోయినాడు. నిష్ఠూరంగా అర్థతృష్ణ అంటే ఏమిటో ఇప్పుడు నాకు తెలిసిపోయింది. నీ అంతటివాణ్ణి కూడా ఈ తృష్ణ లోబరచుకోగలదని ఇప్పుడు తేలిపోయింది. తెలిసిపోయింది. ఇంత వంచనా? అని తెగ బాధపడిపోయినాడు, కోపం తెచ్చుకున్నాడు బలరాముడు. ఇంత కపటం చూపుతున్నావు కాబట్టి ఇక నీవు తమ్ముడివీ కాదు, నేను అన్ననూ కాదు అని తెగతెంపులుగా ఆగ్రహించి నీ దారి నీది, నా దారి నాది అనీ, కృష్ణుడు శపథం చేసి చెపుతున్నా వినిపించుకోక, బతిమాలుతున్నా పట్టించుకోక, గడ్డం పట్టుకొని ప్రార్థించినా ఒడంబడక ‘నీ మాయలన్నీ నేను చిన్నప్పటినుంచీ చూస్తూనే ఉన్నాను, నాకు తెలియనివా నీ మాటలు’ అని రూక్షంగా ఆక్షేపించి ‘పో పో నీకూ నాకూ ఇక సఖ్యత లేదు’ అని ఉడుక్కొని మిథిలానగరం వెళ్లిపోయినాడు బలరాముడు. అక్కడప్పుడు పరిపాలిస్తున్న జనక వంశ మహారాజు బలరాముణ్ణి ఎంతగానో సత్కరించాడు. మహాగౌరవంతో ఆదరించాడు. బలరాముడు ఆయన భవనంలో ఆయనతో ఉండిపోయినాడు. కృష్ణుడు మాత్రం ఇక ఏమి చేయగలడు? శైబ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకాలనే తన దివ్యాశ్వాలు పూన్చిన రథం మీద ద్వారకానగరం చేరుకున్నాడు.
ఇక దుర్యోధనుడు ఈ వృత్తాంతాన్ని ఎట్లానో విన్నాడు. శ్రీకృష్ణుడికీ బలరాముడికీ వేరుపాటు కలిగిందని తెలుసుకొని బహు సంబరడిపోయినాడు. తన రొట్టె విరిగి నేతిలో పడిపోయిందని భుజాలు పొంగించుకున్నాడు. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ మిథిలానగరం వచ్చి బలరాముణ్ణి దర్శించుకున్నాడు దుర్యోధనుడు. ఆయన ఎదుట నడుం వరకు వంగి నమస్కారం చేశాడు. మహా వినయం, విధేయత, వినమ్రత ప్రకటించాడు. గదాయుద్ధ కౌశలం నేర్చుకోవటానికి నిన్నాశ్రయించటానికి వచ్చాను మహానుభావా అని ఆయన పాదాలకు మొక్కి నన్ను శిష్యుణ్ణిగా అనుగ్రహించు అని ఆయనను మెప్పించాడు, ఒప్పించాడు దుర్యోధనుడు. గదాయుద్ధంలో నేర్పు బలరాముడి దగ్గర సాంగోపాంగంగా భయభక్తులతో నేర్పరితనంతో అభ్యసించాడు దుర్యోధన సార్వభౌముడు. బలరాముణ్ణి సంతోషనార్చితుణ్ణి చేసి కొన్ని నెలల తర్వాత తన హస్తినాపురానికి వెళ్లిపోయినాడు దుర్యోధనుడు.
ఆ తరువాత కొద్దిరోజులకు ఉగ్రసేన మహారాజు మొదలైన యాదవుల పెద్దలందరూ వచ్చి కృష్ణుడికి శ్యమంతకమణి లభించలేదని బలరాముడికి నచ్చచెప్పి, నమ్మబలికారు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు