భక్తి కథలు

కాశీఖండం 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదికాలంలో బ్రహ్మదేవుడు జగద్ధితం కోసం మనోమయ చక్రాన్ని కల్పించాడు. కల్పించిన ఆ చక్రాన్ని లేక బండికల్లుని సత్యలోకం నుంచి దొర్లించాడు. ఆ చక్రం దొర్లుకొంటూ వచ్చి లోకాలన్నీ దాటి భూలోకంలో వాలింది. అమిత వేగంగా వచ్చి వచ్చి నేల మిట్టపల్లాలలో ఆ చక్రం ‘నేమి’ (లేక)‘కమ్మి’ లేక ‘చట్రం’ విచ్చిపోయింది. ఆ విధంగా చక్రం కమ్మి శీర్ణం అయిన తావు నైమిశం అయింది. అది పడిన ఆ ప్రదేశం కూడా నైమిశమే అయింది. ఆ మహాపుణ్య వనంలో శౌనక మహాముని ద్వాదశ వర్ష పరిమితం అయిన సత్రయాగం కావించాడు. ఆ ద్వాదశ వర్ష సత్త్రయాగంలో శౌనకాది మహామునీశ్వరులు అందరూ సూతవంశ సంభవుడైన సూతుణ్ణి అర్చించి, ఆతడి ముఖతః పురాణ సంహితలన్ని ఇతిహాస సింహితల్ని ఆలకించారు. ఆ నిమిత్తంగా ఆ పురాణ విద్యాస్థానము సూత, మునీశ్వర సంవాదాత్మకం అయి అలరారుతున్నది.
ఈ స్కాంద పురాణంలో ఏభయి ఖండాలు వున్నవి. ఏ ఖండానికి ఆ ఖండంలో వున్న కథల క్రమాన్ని అనుసరించి విషయాన్ని పరిగ్రహించవచ్చు. ఇతర కథల విషయాలని ప్రస్తావించనక్కరలేదు.
స్కందుడు లేక కుమారస్వామి ప్రోక్తం కనుక దీనికి స్కాంద పురాణం అనే నామం కలిగింది. కుమారస్వామి షణ్ముఖుడు. అంటే ఆరు మొగాల దేవర అని అర్థం. కుమారస్వామికి వలెలే స్కాందానికి ఆరు సంహితలు ఉన్నాయి. అవి 1.సనత్కుమార సంహితం. ఈ సంహితలో ఏభయి అయిదువేల శ్లోకాలు వున్నాయి. 2.సూత సంహిత. ఈ సూత సంహిత ఆరు వేల శ్లోక పరిమితి కలది. 3.శాంకర సంహిత - దీనిలో ముప్ఫయి వల శ్లోకాలు వున్నాయి. 4.వైష్ణవ సంహిత- ఇందులో అయిదువేల శ్లోకాలు వున్నాయి. 5.బ్రహ్మ సంహిత- ఈ సంహిత మూడు వేల శ్లోకపరిమితి కలది. 6.సౌర సంహిత. ఏక సహస్ర సంఖ్య కలది ఈ సౌర సంహిత. పైన పేర్కొన్న సంహితల్లో పంచనాగరఖండం, కమలాలయాఖండం, రేవాఖండం, ఏకవీరాఖండం, మైలారఖండం, గోదావరీ ఖండం- ఆదిగాగల ఏబది ఖండాలున్నాయి. ఆ ఏభయి ఖండాలలో పనె్నండు వేల శ్లోక సంఖ్యా రచనతో విశే్వశ్వరస్వామి, కాశీ క్షేత్రం, గంగానది, భైరవ స్వామి, డుంఠి విఘ్నేశ్వరుడు- మున్నగు దేవతల సంకీర్తనోపక్రమంతో ఆశ్చర్యకరాలైన కథలకి నెలవి, స్కాంద పురాణ జలధిమధ్యభాగంలో అఖండ వైభవంతో కాశీఖండం ప్రాశస్త్యం వహిస్తున్నది. ఈ కాశీ ఖండాన్ని వేదవ్యాస సూత సంవాద రూపమనిన్నీ కొందరు పేర్కొంటారు. ఈ కాశీ ఖండ కథానుక్రమణికలో వింధ్య నారద సంవాదం, బ్రహ్మలోక ప్రభావం, గోదాన మాహాత్మ్యం, అగస్థాశ్రమ వర్ణనం, మునిదేవతా సమాగమం, పతివ్రతా చరితం, కుంభ సంభవప్రార్థనం, తీర్థప్రశంస, శివశర్మోపాఖ్యానం, సప్తపురీ ప్రశంస, సంయమనీ ప్రశంస, మహేంద్ర లోక దర్శనం, వహ్ని సముత్పత్తి, కవ్యాద్వమణ సంభవం, గంధ వత్స్సలకా వర్ణనం, చంద్రలోకప్రాప్తి, ఉడులోక వృత్తాంతం, శుక్రసముద్భవం, శనైశ్చరలోక వర్ణనం, సప్తర్షి లోక ధ్రువలోక వర్ణనాల, కుమారాగస్త్య సంవాదం, మణికర్ణికా సముద్భవం, గంగామహాత్మ్యం, భైరవావిర్భావం, దండపాణి జన్మం, కళావత్యుపాఖ్యానం, సదాచారం, బ్రహ్మచారి ప్రకరణం, స్ర్తిలక్షణం, కృత్యాకృత్య ప్రకరణం, గృహస్థ ధర్మం, యోగ నిరూపణం, కాలజ్ఞానం, దివోదాస వర్ణనం, యోగినీ వర్ణనం, లోలార్కోత్తరార్క సంజ్ఞాదిత్య ద్రుపదాదిత్య రుణా దౌత్య వర్ణనం, దశాశ్వమేథ తీర్థ మహాత్మ్యం, పిశాచి యోచనం ఇంకా చాలా పుణ్యాఖ్యానాల ఈ కాశీఖండంలో ఉన్నాయ.

- ఇంకా ఉంది

శ్రీపాద కృష్ణమూర్తి