డైలీ సీరియల్

ఒయాసిస్ 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇంకా పేరుకు ముందూ వెనకా ఏమన్నా ఉన్నాయా.. పూర్తి పేరు ఇంటిపేరుతో సహా చెప్పు..’’
‘‘అవసరాల దీప్తి.. అంతే...’’
‘‘ఇంట్లో పిలుచుకునే ముద్దు పేర్లు.. మారు పేర్లు ఏమన్నా ఉన్నాయా..?’’
‘‘ఏం లేవు.. ఒట్టి దీప్తి.. సింపుల్ దీప్తి..’’ అన్నదా అమ్మాయి.
‘‘వయసెంత?’’
‘‘అది అవసరమా’’
‘‘ఎదురుప్రశ్నలు వేయవద్దు...’’
‘‘ఇరవై అయిదు...’’
‘‘మీది ఏ ఊరు..?’’
‘‘ఈ ఊరే..’
‘ఏం చదువుకున్నావు?..’’
‘‘బీకాం ఆనర్స్..’’
‘‘ఎక్కడ పనిచేస్తున్నావు?’’
‘‘బాలాజీ ఇంజనీరింగ్ కాలేజీ.. సీనియర్ అకౌంటెంట్..’’
‘‘ఎన్నాళ్లనుంచి పనిచేస్తున్నావు..’’
‘‘ఏడాది నుంచి..’’
‘‘ఎక్కడుంటున్నావు?..’
‘‘కమలానగర్’’
‘‘మీ ఇంట్లో ఎవరెవరుంటారు?’’
‘‘నేను.. నా ఫ్రెండ్..’’
‘‘ఫెండ్.. ఆగా.. మగా?..’’
‘‘తెలియదు..’’ అన్నది అదే నవ్వు మొహంతో...
‘‘తిక్క సమాధానాలు చెప్పొద్దు..’’
‘‘మగ...’’
‘‘‘అతనేం చేస్తాడు?..’’
‘‘ఇంటెక్ సొల్యూషన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..’’
‘‘నీకు తల్లిదండ్రులు లేరా?’’
‘‘తల్లిదండ్రులు లేకుండా నేనెలా పుడతాను?’’ మళ్లీ అదే చిరునవ్వు.
‘‘ఆన్సర్ టు ది పాయింట్.. నీ తల్లిదండ్రులు బ్రతికే వున్నారా?..’’
‘‘లేరు..’’
‘‘సిస్టర్స్.. బ్రదర్స్..’’
‘‘వసుధైక కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది..’’ అదే నవ్వు.
‘‘నువ్వు కథలు గట్రా రాస్తుంటావా?’’
‘‘రాయాలనే ఉంది..’’
‘‘నాలుగు రోజుల కిందట రాత్రి ఎనిమిది గంటలప్పుడు అశ్వినీ నర్సింగ్ హోంలో నువ్వు డాక్టర్ శే్వతను కలిసినట్లు నిన్ను చూసిన వాళ్ళు చెప్పారు.. ఏ పనిమీద ఆమె దగ్గరకు వెళ్లావు..?’’
‘‘నేను ఆ నర్సింగ్ హోంకు ఇంతవరకు వెళ్లలేదు.. ఆ డాక్టర్‌ని నేనెప్పుడు చూడలేదు..’’
‘‘డాక్టర్ శే్వతని నువ్వు ఎప్పుడూ చూడలేదా..?’’
‘‘లేదు..’’
‘‘మీ ఇంజనీరింగ్ కాలేజీ అహోబలరావుగారిది.. ఆ నర్సింగ్ హోం కూడా ఆయనదే.. శే్వత ఆయన భార్య.. నువ్వు పనిచేస్తున్న కాలేజీ యజమాని భార్యను నువ్వెప్పుడూ చూడలేదా?’’
‘‘అవసరం ఏముంది? అహోబలరావుగారిని కూడా ఆగస్టు పదిహేనో తారీఖు పతాకావిష్కరణకు వచ్చినపుడు ఒక్కసారి చూసాను..’’
‘‘మీ కాలేజీ సూపర్‌విజన్ ఎవరు చేస్తారు?’’
‘‘డే టూ డే సూపర్‌విజన్ అంతా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ చేస్తారు..’’
‘‘డాక్టర్ శే్వతను నువ్వెప్పుడూ చూడలేదు..’’
‘‘అవును.. చూడలేదు.. చాలా అందంగా ఉంటుందని విన్నాను..’’
‘‘ఆమె హత్య జరిగిన మర్నాడు మీ కాలేజీ వాళ్లంతా ఫాకల్టీస్‌తో సహా ఆయన ఇంటికి వచ్చారు. స్ట్ఫా కూడా వచ్చారు. నువ్వు రాలేదా?’’
‘‘ఆ రోజు నాకు వంట్లో బాగాలేదు.. అందుకని వెళ్లలేదు..’’
‘‘ఏమిటి ప్రాబ్లెం..?’’
‘‘అది నా పర్సనల్ ప్రాబ్లెం.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు’’ అన్నది చిరునవ్వుతోనే.
‘‘డాక్టర్ శే్వత పార్థివ శరీరాన్ని చూడటానికి, మీ కాలేజీ వాళ్ళంతా వచ్చినా, అనారోగ్యంవల్ల నువ్వు రాలేదు..’’’
‘‘అవునండీ...’’
‘‘ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు?’’
‘‘మా ఇంట్లో...’’
‘‘ఒంట్లో బాగాలేదన్నావు.. డాక్టర్ దగ్గరకు వెళ్లలేదా?’’
‘‘వెళ్ళలేదు.. నాట్ సో సీరియస్ ప్రాబ్లమ్..’’
‘‘అంతా అహోబలరాగారి భార్య అంత్యక్రియలకు హాజరవుతున్న సమయంలో అశ్వినీ నర్సింగ్ హోంలో నర్సు నిర్మలా దగ్గర నువ్వు ట్రీట్‌మెంట్ తీసుకున్నావు.. ఇందుకు నా దగ్గర సాక్ష్యం ఉంది..’’
‘‘ఇట్సాల్ నాన్‌సెన్స్... నాకా నర్సింగ్ హోంకి వెళ్లాల్సిన అవసరమే లేదు.. చిన్న చిన్న జలుబు, జ్వరాలు తప్ప నర్సింగ్ హోంలో చికిత్స చేయించుకోవాల్సినంత ప్రాబ్లెం నాకేం లేదు..’’ నవ్వింది.
‘‘నిన్ను చూసిన వాళ్లున్నారు..’’
‘‘ఎవర్ని చూసి ఎవరనుకున్నారో.. మనిషిని పోలిన మనుష్యులుంటారు..’’
‘‘దీప్తి ఏ మాత్రం తొణక్కుండా, బెణక్కుండా సమాధానం చెప్పటం శంభూప్రసాద్‌కి ఆశ్చర్యం కలిగించింది. పాతికేళ్ల అమ్మాయి పోలీస్‌స్టేషన్‌కి రావడానికే భయపడుతుంది. అలాంటిది తన ఎదురుగా కూర్చుని ఇంత నిర్భయంగా, ఇంత ధైర్యంగా సమాధానాలు చెబుతోందంటే ఇది బాగా ఢక్కా మక్కీలు తిన్న గడుసు పిండమే.. అనుకున్నాడతను.
ఇంతలో రణధీర్ వచ్చి శంభూప్రసాద్‌కి షేక్ హ్యాండిచ్చి, అతనికి ఎదురుగా, దీప్తికి పక్కన కూర్చున్నాడు.
శంభూప్రసాద్ కూడా మూడ్ మార్చుకున్నాడు. రణధీర్‌తో అన్నాడు..
‘‘ఏమిటి సడెన్‌గా ఇటు గాలి మళ్లింది.. నాతో ఏమన్నా పనిపడిందా?’’ అన్నాడు నవ్వుతూ.

- ఇంకాఉంది

శ్రీధర