భక్తి కథలు

కాశీఖండం - 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మూల చూడడంగా పఠించి ఆకాశాన్ని అంటుతున్న మేడిచెట్లు నఖ శిఖ పర్యంతం బ్రహ్మాండ భాండమాలికల రూపమైన నగలను అవధరించిన వృషభ ధ్వజుడైన శివుణ్ణి అనుకరిస్తున్నవి. అరవిరిసిన వకుళముల, కురవకాల నెత్తావులలో ఆసక్తి కల అళికులాల పరిషత్తుల ఝంకార ధ్వని విరహులకి మన్మథ భావాన్ని ఉద్దీపింపజేస్తున్నది.
పెనుకొక్కెర పక్షుల కర్ణ కఠోర తారధ్వనిన్ని, వానకోయిలల సమూహపు కహకహరావములున్ను, కోకిలల కంఠ కుహూకారమున్ను, మదించిన పిచ్చుకల చూంకృతమున్ను, అన్యపక్షుల అవ్యక్త మధుర కోలాహలమున్ను, పుంఖానుపుంఖంగా గీపెట్టు కీచురాళ్లధ్వనుల ప్రసరణమున్ను, సముద్ధతకాక ధ్వాన పాటవ సంభ్రమమున్ను, మత్తిల్లిన పెన్నడ పిట్టల కోలాహల శాంత శార్దూల సంరంభ సంభ్రమమున్ను, చీకుకొక్కెర పక్షుల ముఖ శిర్గత ధ్వని సౌష్ఠవమున్ను కలసి- వరాహ, శరభ, గండ, గజ, వ్యాఘ్ర సింహ, లులాయ, గవయ, భల్లూక, తురంగ, ఫేరవ, గోలాంగూలాది మృగ సమూహ కంఠధ్వనులతో బెరసి లతాగృహ గుర్భాలలో ప్రతిధ్వనులావిర్భవింపజేయగా, చిగుళ్లు, మొగ్గలు, కుసుమాలు, శలాటువులు, ఫలాలతో భరితం అయి, సూర్యకిరణ వితానాలను సొగయనిత్యుక మసక మసక చీకట్లను అలముకొనచేస్తూ, ఇసుక చల్లినా రాలిపడని ఆకుపచ్చడాలు కల వింధ్యాచల ప్రాంత కాంతారాన్ని దరిసిపోతూ ఎట్టఎదుట- వింధ్య గిరి గుహల్లోని గండశిలల ఘాతాలచే విరిగిపడుతున్న తరంగ వితానములచే తొట్రుపడుతూ విజృంభించుతున్న ఝుంకార ధ్వనులచే స్ఫుటమైన లోమదముకలదిన్నీ, పూజాచరణ తత్పరభక్తితతికి రక్షణ రూపము, సుఖకరమూ అయిన నర్మదానదిని బ్రహ్మ మానస పుత్రుడు అయిన నారదుడు కనుగొన్నాడు.
దేవ ముని నారదుడు ఆ నర్మదానదిలో తీర్థస్నానం ఆచరించాడు. తన సకలావయవాలకీ పవిత్ర విభూతిని అలదుకొన్నాడు. కంఠసీమలో రుద్రాక్షమాలలు ధరించాడు. పిమ్మట అక్కడ వున్న ఓంకారేశ్వరుణ్ణి భక్తితో అర్చించాడు.
అప్పుడు వింధ్య భూధరరాజు తన స్థిరమైన పర్వతరూపం ఆకాశవీధిని ఆవరించుకొని పూర్వం వున్నట్లే వుండగా, కదలాడు కరచరణాదులతో కూడిన ఆకృతిని తాల్చి ఆ మునికి ఎదురుగా ఏతెంచాడు.
అతిథిగా చనుదెంచిన వ్యక్తి అల్పాల్పుడైనా, అత్యధికుడైనా తన గడప త్రొక్కుకుని వచ్చినపుడు ఎవడు ప్రియం పొందుతాడో అట్టి వ్యక్తి గౌరవం గౌరవం అవుతుంది కాని ఆకారగౌరవం గౌరవం కాదు.
మేఘమండలాన్ని స్పృశిస్తున్న తన మహోన్నత శిరస్సు నేలను తాకునట్లు నారదుడి చరణ జలజాలకి ప్రణామం ఒనరించాడు. తన అంతరంగం కన్నా అత్యున్నతం అయిన కాంచన పీఠం పెట్టి ఆనతిచ్చాడు. పెరుగు, నెయ్యి, తేనె, అక్షతలు, తడిదూర్వలు, దర్భలు, తిలలు, పువ్వులు అనే అష్టాంగాలతోడి అర్ఘ్యం సమర్పించాడు. సుదూర యాత్రాజనిత ఆయాస ఖేదం తీరేటట్లు పాదాలు సంవాహనం చేశాడు. మార్గాయాసం తీరడము తెలిసికొని కరాలు ముకుళించి, వినయంతో వినమ్రుడయి వింధ్య భూధర పతిత తన గుహలు ప్రతిధ్వనులు ఈనునట్లు నారద మునికి ఈ విధంగా విన్నవించాడు.
‘‘మహానుభావా! నీ కరుణా కటాక్ష వీక్షామృత రస ప్రవాహంవల్ల పరాగ ప్రసరణమూ, నీ చరణ నఖ చంద్ర కళా వికాసంవల్ల అంధకారమూ నశించినవి. ఇంత పెద్ద కాలానికి పురాజన్మ కృత సుకృతాలు ఫలించాయి. సకల విశ్వంభరాభరాన్ని భరించడంలో సమర్థాలైన నా పర్వత కులానికి చెందిన ధరాధరాల్లో పూజ్యుడిని అయాను. కృతార్థుడిని అయాను.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి