భక్తి కథలు

కాశీఖండం 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని దేశాలు ఎండచే మాడిపోయాయి. మరికొన్ని దేశాలు మంచు చేత కొంకర్లు పోసాగాయి. ఇంకొన్ని నాడులు చిమ్మచీకట్లచే గ్రుడ్డివి అయిపోయాయి. కొన్ని దేశాలు చలి చేత గుత్తులుగా ముడుచుకొనిపోయాయి.
వింధ్యగిరిపైన విచ్చిన ఎర్రగోరింట పువ్వుల పొదరిల్లు వడువున ఎర్రని కృత్తికా నక్షత్రం ఒక చోట కదలకుండా వుండిపోయింది. ఉపకార్య కొరటికి సాటి అయి రోహిణీ తార ఒక యెడ తగుల్కొని పోయింది.
ఒక తావున పునర్వసువు నక్షత్రం చెట్టుకొమ్మలతో చిక్కువడిపోయిన ముత్యాల చిక్కం వలె వూగసాగింది. వేరొక ప్రక్క శ్రవణ నక్షత్రం కుంటమీదటి ప్రత్తికాయ- మొగ్గు మాదిరిగా శయనించింది. స్వాతి, చిత్రా నక్షత్రాలు తోరణ స్తంభ ద్వయాన్ని అనుకరిస్తూ ఒక చోట అత్తమిల్లాయి. చిరుతపోయి- చిన్నపోయిన- మూకుటి కరణి విశాఖ నక్షత్రం వేరొక పార్శ్వాన హత్తుకొనిపోయింది. కనురెప్పలు విప్పారడంలేదు.
చెవి పుటాల వినికిడి శక్తి మూర్చపోయినట్లయింది. జ్ఞానేంద్రియాల జ్ఞాన కళ ఔరుసారు అయినట్లయింది. నాలుక రుచులను వివేచించి తెలుసుకొనే శక్తి తక్కువయినట్లు అయింది. మనస్సునందు చీకటి అలముకొన్నట్లయింది. శరీరం చేష్టలు వుడిగిపోయింది. శిరస్సున తలపాగ వున్నదీ లేనిదీ తెలియని దశ కలిగింది. సర్పం కాటు వెయ్యగా నురుగులు క్రక్కుకొంటూ మూర్ఛిల్లి పడి ఒడలు తెలివి తప్పిపోయిన విధంగా పడమటి దేశాల ప్రజలు సూర్య ప్రకాశం లేమి చేత చైతన్యం కోల్పోయారు’’ అని సూత మహర్షి వాకొనగా నైమిశారణ్య మునీంద్రులు అటమీద జరిగిన వృత్తాంతం ఎటువంటిదో? అని ప్రశ్నించారు.

ప్రథమాశ్వాసం సమాప్తం

ద్వితీయాశ్వాసం

దేవతలు, మునులు బ్రహ్మకడకేగి స్తుతించుట
ఆ కథకుడు సూతుడు శౌనకాది మహామునీంద్రులతో ఈ విధంగా చెప్ప మొదలుపెట్టాడు. పైన వివరించిన రీతిగా ఆ కాలప్రళయం సంభవించగా దేవతలు, రాక్షసులు, ఉరగులతోడి ప్రాణి సమూహం కాందిశీకం కాగా మునులు, దేవతలు కలిసి బ్రహ్మ నివాసం అయిన సత్యలోకానికి అరిగి బ్రహ్మదేవుని ఈ పగిది ప్రస్తుతించారు.
‘‘బ్రహ్మా! పరబ్రహ్మ స్వరూపా! హిరణ్యగర్భా! అమృతస్వభావా! ఊహించడానికైనా అలవికాని ప్రభవా! వేదవేద్యా! చిత్స్వరూపా! ఆది అంతము లేనివాడా! చిత్తగించవలసింది. నిన్ను సంస్తుతి చేస్తున్నాం.
మనస్సుకి వాక్కుకి ఏ దేవుణ్ణి చేరికోలేక మరలివస్తాయో, పరమయోగీంద్రులు తన్మయతతో తమ దహరాకాశంలో ఏ భగవానుని సందర్శిస్తున్నారో అఖిల వంద్యుడవైన అట్టి నీకు నమస్కారం. ప్రకృతి స్వరూపంగా కల దేవా! సత్వ రజస్తమో గుణత్రయానికి ఉపాధితో రూపాలతో కూడిన మహితుడా! కాల స్వరూపా! కాలాతీతా! సంకల్ప రహిత హృదయా? సత్వగుణం చేత హరివి, రజస్తమో గుణాలచేత బ్రహ్మ, శివుడు అయే నీకు నతులు.
బుద్ధ్యహంకార రూపుడవైన నిన్ను భజిస్తాము. పంచతన్మాత్ర రూపా! భరించు. పంచకర్మేంద్రియ పంచ జ్ఞానేంద్రియాత్మకా! మనోరూపా! మమ్ము ఏమరి వుండవద్దు. పృథివ్యాది పంచభూతాత్మా! మమ్మల్ని కాపాడు. పంచ విషయాత్మకా! మమ్మల్ని విడువకు. బ్రహ్మాండరూపా! నువ్వు మాపాలిటి పెన్నిధివి. బ్రహ్మాండాంతర స్థితా! మమ్మల్ని అన్నివేళ ప్రోవు. నిన్ను కోరి కొలుస్తూ వుంటాము. విశ్వరూపుడివి అయిన నిన్ను ఎల్లప్పుడూ సేవిస్తాము.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి