భక్తి కథలు

కాశీఖండం 11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధేనువుల ఖురాల్లోను, ఖురాగ్రాల్లోను సమస్త పుణ్య తీర్థ సంతతిని, నిఖిల పర్వత వితానము వసిస్తూ వుంటవి. గోశృంగముల నడిమి భాగాన అద్భుత చరిత్రుడైన శంకరుడు గౌరీ కుచచందన చర్చ అంటుకొని పునీతం అయిన వక్షస్స్థలం కలవాడయి విలసిల్లుతూ వుంటాడు. మానవుడు నిండు మనంతో గోదానం చేస్తే పితృదేవతాగణాలు కొనియాడుతాయి. ఋషులు ప్రశంసిస్తారు. దేవతలకు పట్టరానంత సంతోషం కలుగుతుంది.
‘‘గోమయం యమునా నది. గోమూత్రం నర్మద. గోక్షీరం గంగానది. గోవుకన్నా పవిత్రమైనది లేదు. గోవు అవయవాల్లో పదునాల్గు భువనాలు ప్రతిష్ఠితాలు అయి వున్నాయి. కనుక ఇహ పర లోకాలలో శుభం కలుగుగాక!’’ అనే మంత్రాలు పఠిస్తూ భూసుర వరులకి ఏ పురుషుడు గోవుని దానం ఇస్తాడో ఆ పురుషుడు లోకంలో మహాఖ్యాతితో ప్రశంసలు పొందుతాడు.
స్తుతిపూర్వకంగా ఆవుల చుట్టూ అతి భక్తియుతుడై ప్రదక్షిణ తిరిగే నరుడికి సమస్త ధరణికి నియమంగా ప్రదక్షిణ చేసిన పుణ్యాలు లభిస్తాయి. సుస్థిర మంగళప్రదాలు అయిన ధేను బృందాలు, ముందట వెనుక, ప్రక్కల సందడి చేయవద్దా అని త్రిమూర్తులం అయిన మాకు హృదయాల్లో నిరంతరమూ ప్రియం ఉదయిస్తూ ఉంటుంది.
ఎవరు తమ శరీరావయవాలకి గోపుచ్ఛాలతో నీరాజనం నెరపుతారో అట్టివారి పాతకాలు దవ్వులకి తొలగిపోతాయి. వారి గృహాల్లో సకల శభాలు కలుగుతాయి. శ్రద్ద్ధానులై వినవలసింది. గోవులు, బ్రాహ్మణులు, వేదాలు, పతివ్రతలు, లోభహీనులు, సత్య వ్రతులు, దాతలు- ఈ ఏడుగురిపై లోక వ్యవస్థ ఆధారపడి వుంటుంది. వీరు అలజడులను తొలగించి సమస్త భూత ధాత్రిని నిరుపప్లవంగా కాపాడు వ్యవస్థా స్వరూపులు.
ఊర్థ్వలోకాలలో నాకు నివాసమైన ఈ సత్యలోకానికి మీద వున్న విష్ణుమూర్తి లోకం అయిన వైకుంఠం. కుమారస్వామి లోకం ఇంకా పైన వుంది. ఆ కుమారస్వామి లోకానికి ఆవల వున్నది శివుడి లోకం కైలాసం. ఆ కైలాస సమీప స్థలంలో గోకులం అనే లోకం విలసిల్లుతున్నది.
అటువంటి గోలోకంలో సంపూర్ణ సంపదలను కురిపించు అలలతో పాలవాహినులు ఎల్లవేళల ప్రవహిస్తూ వుంటాయి. ముదిమిని దరికి రానీక శాశ్వత కౌమార దశాసౌష్ఠవాలు అందగిస్తూ వుంటవి. ఘృతవాహినులు స్రవించు పాయస పర్వతాలు బహుళ సంఖ్యలో ఆ గోలోకంలో విలసిల్లుతూ వుంటాయి. ఏ మాత్రమూ కొదువ లేకుండా మంగళకర వస్తు సంచయం సమగ్రంగా మెరుగులు వెలార్చుతూ వుంటాయి. శంకరుడి నివాసం అయిన మహాకైలాసం ఆ గోలోకానికి ఇరుగుపొరుగు లోకం కావడంవల్ల సదా శివుడి నెయ్యాన్ని ఎల్లవేళలా అనుభవిస్తూ కళ్యాణ నిధులున్ను అలఘుమూర్తులున్ను అయిన ‘సుశీల’ ఆదిగాగల గోమాతృకలు అధివసించి వుంటారు. గోలోకం ఇంతటి ప్రశక్తికెక్కింది కనుకనే గోవులను మించిన ఉపాసింపదగింది లోకంలో కానరాదు. గోదాతలకంటె అతిశయించిన పుణ్యవంతులు కనరారు. అంతేకాక మిక్కిలి సమాహితులై ఆకర్ణించవలసింది. సరస్వతీ నదీ తీర్థంలో మృతి చెందిన వారున్ను, సూర్యుడు మకరరాశి గతుడయి వుండగా ప్రయాగ తీర్థంలో - లేక త్రివేణీ సంగమ తీర్థంలో మాఘ స్నానం ఆచరించిన కృతార్థులున్ను, వారణాశిలోని పంచ నద తీర్థంలో కార్తీకమాసంలో తీర్థం ఆడిన పాప విహీన దేహలున్ను, కురుక్షేత్రంలో కాకణికామాత్రం (గవ్వ ఎత్తుకలది) బంగారు దానం చేసిన దాతలున్ను- నా సత్యలోకంలో నిజ కర్మోచిత స్థానాల్లో కల్పాంత స్థాయి సుఖాలు అనుభవిస్తున్నారు.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి