భక్తి కథలు

కాశీఖండం 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాశ్మశాన క్షేత్రమైన కాశిలో స్థిర వాసం వున్న చిన్నారి పొన్నారి చిరుత కూకటిప్రాయపు దిస్స మొలవటువు కూడా ప్రళయ రాత్రివేళ ఆగ్రహంతో ఏతెంచే మృత్యుదేవత మునిపండ్లని పెరికివేయగలడు.
ఈ కాశీ పుణ్యక్షేత్రం కల్పంతరాలు ఎన్ని గడచిపోయినా నశింపదు. శిథిలం కాదు. ఇంద్రులు ఎందరు గతించినా వికాసం కోల్పోదు. మన్వంతరాలు ఎన్ని గతించిపోయినా ఎన్నడూ పసిమి తగ్గదు.
ఏ మాత్రం తత్తరపాటు లేక గంగా తరంగిణిలో స్నానమాచరించి పినాకపాణి అయిన మహాదేవుడిని- విశ్వనాథుడిని కరుణాశరధిని పరిమళ సంభరిత పుష్పగుచ్ఛాలతోను, బిల్వ దళాలతోను అర్చించి, స్తోత్రపాఠాలు అనుసంధానం చేసేవారికి మోక్షకాంతలు దొప్పలు దొరలుగ అబ్బుతారు.
ధర్మపురుషార్థం కాశికా స్థానమథ్యంలో నాల్గు పాదాలతో నడయాడుతూ వుంటుంది. అర్థపురుషార్థం కాశీపుర ప్రాంగణంలో నానా విధాలుగా నటనం సల్పుతూ వుంటుంది. కామము కాశీ పట్టణ రాజ వీధిలా రాజ సమూహం కరణి గర్వించి తిరుగుతుంది. మోక్ష పురుషార్థ సంపదలు కాశీ క్షేత్రంలో త్రవ్వి తండములై నివ్వటిల్లుతాయి. కాశి సకల కల్యాణాలకి ఆది కారణం. కాశి అణిమాద్యష్ట సిద్ధులకి ఆలాన భూమి. కాశి సమస్త జనుల మనోరథాలకి కల్పవృక్షం. కాశి పాపరాశి అనే మాంసాన్ని మెసవే రాకాశి.
లయకాలంలో ఆవహప్రవహాది సప్త వాయువులు తీవ్రంగా వీచి మహాపర్వతాలను ఉర్రూతలూగిస్తాయి. సూర్యుడు తన ద్వాదశ రూపాల తాల్చి ప్రళయాతపాలను కాస్తాడు. ప్రళయకాలమేఘాలు అయిన పుష్కలావర్తకాలు కుండపోతలుగా వర్షిస్తాయి. జలధులు వుప్పొంగిపోయి భూలోక భువర్లోక స్వర్లోకాలు మూడింటిని ముంచివేసి సృష్టి ప్రారంభ సమయంలో లాగు ఏకార్ణవం ఒనరిస్తాయి. భూమి జలంలో కరగిపోతుంది. జలాలు అగ్నిలో ఆవిరి అయిపోతాయి. అగ్ని వాయువులో అణగిపోతుంది. వాయువు ఆకాశంలో లీనం అవుతుంది. ఆకాశం ఒక్కటి మాత్రమే శేషిస్తుంది. కాలం ఆకాశంతో వుంటుంది. అటువంటి ఘోర ప్రళయ సమయంలో కాశీ వున్న అయిదు క్రోసులంత మేర ఏ ఉపద్రవమున్ను సంభవించదు.
కాశీక్షేత్రంలో ధర్మార్థ కామ మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలున్ను శుక్లపక్షపు రాత్రుల్లో చంద్రకళలు నానాటికి ఉత్తరోత్తరాభివృద్ధి పొందుతాయో, ఆ రీతిగా ఉత్తరోత్తరాభివర్థనం పొందుతూ వుంటాయి.
కాశీ పవిత్ర క్షేత్రంలో ప్రాణులు సమస్తమూ అసువులు ఉడుగు సమయంలో కుడి చెవి మీదుగా వుండే విధంగా నేలపై త్రెళ్లి దీర్ఘనిద్రకి మాగన్ను పెడతాయి. ఆ తరిని పరమ శివుడు తన పరివారంతో ఏతెంచి ఆ జీవుల కుడి చెవిలో ప్రణవ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. శివుడు ప్రణవం ఉపదేశిస్తూ వున్న తరిని మంచుకొండ అనుగు కూతురు తన పసపు పయ్యెదతో వాత్సల్యంగా వీస్తుంది. డుంఠి మృత్యుభీతి తొలగే రీతిని ధూత్కారం ఒనరించి తన తొండపు కొసతో చల్లని జలశీకరాలు చిలుకుతూ వుంటాడు. భాగీరథీ గంగా రూపు ధరించి వచ్చి, తన మృదు పాణి పల్లవంతో ఒడలంతా నివురుతూ వుంటుంది. ప్రమథుల్లో ఉత్తముడు భృంగి చనుదెంచి భయం తీరే రీతిని లాలాటాన భస్మరేఖ తీర్చి దిద్దుతాడు అని వారణసీపురాన్ని వర్ణిస్తూ-
తరుశాఖాగ్ర భాగాంచలాలపై వ్రేలు కోటి సంఖ్యల నీర్కావి కౌపీనాలు విఘ్న కురంగాలను పట్టుకొన వ్రేలవేసిన చీర తెరలను సంస్మృతిని చిగురింపచేస్తున్నది.
ఎట్టఎదుట అగస్త్య మహర్షి ధర్మపత్ని అయిన లోపాముద్ర పాద పద్మాల ముద్ర సికతామయం అయిన నేలమీద అందగిస్తున్నాయి.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి