భక్తి కథలు

కాశీఖండం 16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేళ్లు పిడికెడు చామధ్యానం అడుగుటకై మునికన్యకల రాకకై ప్రతీక్షిస్తున్నాయి. దేవతల అర్చనా సమయంలోని ధూపంతో రోమధూమం జతకట్టుతున్నది. ఉద్ది అవుతున్నది. బ్రహ్మచారుల స్వాధ్యాయ స్వరాల సంశయాన్ని శారికలు, శుకాలు విచారణ చేస్తున్నది. కాశీకపురికి కోసు దవ్వులో భాగీరథీ గంగని కలు ప్రదేశంలో సత్యలోకానికి అనుప్రాసగా ఈ ఆశ్రమం కానవస్తున్నది. అటువంటి అగస్త్య మహాముని పర్ణశాలని వారు సమీపించారు. ఆ సమయంలో ఆ పర్ణశాలలో శివుడే దాత. పరమ శివుడే భోక్త. యజ్ఞయాగాది క్రియా కలాపాలు శివుడే ఒనరిస్తాడు. శివుడే ఈ విశ్వం. నేనే శివుణ్ణి’’’ అంటూ ధ్యానం చేస్తూ గంగానదీ సమీప బిల్వ వృక్ష వనవాటికలో భసిత స్నానం చేత పరిశుద్ధ శరీరుడై ‘‘్భవా! కాశీధవా! నీలగళా!’’ అని భావించే ధన్యాత్ముడిని వారు కాంచారు.
రుద్రాక్ష మాలలతోను, విభూతి చిహ్నాల చేత ముద్రిత అవయవుడు, మోక్ష పదవీ లక్ష్మీ భద్రాసనాధిష్ఠితుడు లోపాముద్ర పార్శ్వుడు అయిన రుషి పుంగవుణ్ణి చూశారు.
తన పర్ణశాలలోనే పార్వతీ దేవి చూడ్కులకి కరంభమున్ను, బ్రహ్మాది దేవ పతి వందిత పాద పద్ముడున్ను అయిన శివలింగాన్ని కల్పించి, మంత్ర జప పరాయణుడు అవుతూ ఆ పొంతను పులి రాజ చర్మాసనం మీద వున్న పాశుపత విద్యా సింహాసనస్థుణ్ణి ఆ దేవతలు, మునులు కనుగొన్నారు.
పాటల వర్ణజటాబంధం కిరీటంగా కలవాడు, లలాట భాగంమీద సూర్య కిరణ ప్రసరణం కలవాడు, స్ఫటిక మణులతో కూర్చిన జపమాలని వ్రేళ్ళతో త్రిప్పుతున్న సుకుమార కర పద్మాలు కలవాడు అయి అగస్త్య మహర్షి కానవచ్చాడు. ఆ మహర్షి పంచ బ్రహ్మ, పంచాక్షర, అఘోర, పాశుపత మంత్ర రాజాలను అధరోష్ఠములించుక చలింపచేస్తూ ఉపాంశు జపం ఆచరిస్తున్నాడు. ఏకాగ్ర చిత్తంతో ఎడపా తడపా భక్త్యావేశంతో పార్వతీపతీ! గంగాధరా! నీలకంథరా! మదనాంతకా! మహాదేవా! రుద్రా! విరూపాక్షా! నాగాభరణా!’’ అని మేఘ గంభీర స్వనంతో పఠించే బ్రహ్మర్షి వతంసుని కాంచారు. లోపలి చూపు ప్రసరణానికి ఉద్వాసం పలికి వెలుపలకి దృష్టిని ప్రసరింపచేస్తున్నాడు. రుద్రాక్షమాలని చక్కిలం వంటి చెవికొనకి అలవోకగా తగిలించాడు. అంతకుముందు దృఢంగా వేసిన పద్మాసన బంధాన్ని సడలించాడు. వేదాలు, ఆగమాలు, పురాణాలలోని త్రిపురాంతకుడి స్తోత్రాలని పఠించాడు. అప్పుడప్పుడే సమాధినుంచి వెలువడి వచ్చుట చేత మనస్సు, ఇంద్రియాలు నిర్మలాలై ప్రశాంతాలు అయి వున్నాయి. ప్రణవ పంచాక్షరీ మంత్ర సిద్ధుడైన అగస్త్య మహర్షిని ఆ దేవతలు, మునులలు కనుగొన్నారు.
ఆ సమయంలో అమరులు, సంయములు కూడ జయ జయ ధ్వానాలు కావిస్తూ ఆ మహానుభావుడి చరణ జలజాలకి ప్రణమిల్లారు. శివ సంబంధమైన తేజో విశేషం వయోభేదాన్ని గణనకు రానీయదుకదా! ఆ అగస్త్య ముని కూడా లేచి వారికి ఎదురుగా ఏగి అతిథి సత్కారం ఒనరించి వారిని సుఖాసీనుల్నిచేసి వారి కుశలం విచారించి వారి ఆగమన కారణాన్ని అడిగాడు. అపుడు మునులు, దేవతలు మిక్కిలి వినయ విధేయులై తామువచ్చిన కార్యాన్ని నిశే్శషంగా తెలియచెప్పడానికి యావదర్థ పద విద్యలో ప్రసిద్ధికెక్కిన బృహస్పతిని అభ్యర్థించారు. అంత దేవగురువు బృహస్పతి ఆ మహానుభావుణ్ణి అగస్త్యుణ్ణి అవలోకించి ఈ విధంగా పలికాడు.
అగస్త్య మహామునీ! నువ్వు ధన్యుడివి. మాన్యుడివి. కృతార్థుడివి. లోకశ్రేయస్కరుడివి. ఆశ్రమ ఆశ్రమానికి, పర్వత పర్వతానికి, అడవి అడవికీ ఎందరు తపస్యులు లేరు? నీ ప్రతాపం, నీ ప్రభావం, నీ ఔదార్యం ఎవరికి వున్నాయి.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి