నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ. నరనాగాశ్వవరూధయూధములతో నానావనీనాధులు
ద్ధురులై యొక్కట నొండొరుం జఱచి యుత్తుంగానిలోద్ధూతసౌ
గరసంక్షోభసమంబుగాఁ గలఁగి నీఁకన్ సిరులై తాఁకి యే
సిరి దేవవ్రతుపై నభోవలయ మచ్ఛిద్రంబుగా నమ్ములన్
భావం: విచిత్రవీర్యునకు పట్టం గట్టిన భీష్ముడు విచిత్రవీర్యునకు వివాహం చేయాలనుకొన్నాడు. కాశీరాజు కుమార్తెల స్వయంవరానికి వెళ్లి తన్ను అడ్డగించేవారిని ఎదిరించి తన తమ్ముడి వివాహం కోసం ఈ ముగ్గురు రాజకుమార్తెలను తీసుకొని వెళ్తున్నాను అని అక్కడివారితో చెప్పి మరీ తీసుకుని రాబోతుండగా- అక్కడకొచ్చిన వివిధ దేశాలకు అధిపతులైన రాజులందరు పదాతులు, ఏనుగులు, అశ్వాలు సైన్యసమూహాలతో కలసి ఒకచోట చేరి పరస్పరం భుజాలపై చరుచుకుంటూ బలమైన గాలితో ఎగురగొట్టబడిన అలలతో కూడిన సముద్రఘోషతో సమానంగా రోషంతో కోపించి గర్వంతో పౌరుషవంతులై ఎదిరించి ఆకాశవలయంతో ఆవంతసందులేకుండా దేవవ్రతు మీద బాణాలు కురిపించారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము