భక్తి కథలు

కాశీఖండం 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్ని తెగల నాతులు చివరికి నాథుని, ఉభయ కులాలవారిని నరకంలో కూలద్రోసి తామూ ఆ నరకంలోనే కూలిపోతారు.
సంశయించక చీకటి తప్పు చేసిన ఇంతి గుడ్లగూబగా జన్మించి చెట్టు తొరటలో చరిస్తుంది. అన్య పురుషుడిని కడగంటి చూపుతో వీక్షించే తరుణి మెల్ల కన్నులదై పుట్టుతుంది. మగడు తన్ను మొత్తగా తిరిగి ఆ మగని మొత్తు కోపన మరుజన్మలో ఆడుపులియై అడవిలో సంచరిస్తుంది. స్వజనమును వంచించి చిరుతిండి మరిగిన అతివ పంది పుట్టుక పుడుతుంది. అధిపుకై ఆగ్రహించి హుంకారం ఒనరించే పడతి మూగ అయి జన్మిస్తుంది. తన సవతి ఇల్లాలి సౌభాగ్య సంపత్తి సహింపజాలక మనస్సులో ఈర్ష్య వహించే లేమ మరుపుట్టువులో దౌర్భాగ్యురాలు అవుతుంది.
ఎంతో దవ్వు చని ఎండలో పడి మరలి గృహానికి దప్పికకొని ఏతెంచిన ప్రాణవల్లభుడికి బహిర్ద్వార కవాటము గడపదాకా ఎదురేగి లోపలికి కొనివచ్చి జలకమార్చి, కుడువబెట్టి, కప్పురవిడెము సమర్పించి, సెజ్జ పరుండజేసి, ఊరువు లొయ్యన సంవాహనం ఒనర్చి, అతని చిత్తానికి సంతోషం కలుగజెయ్యడం పత్నికి ధర్మం.
ధర్మం పాటించి స్ర్తికి తండ్రి స్వల్ప ధనమే ఒసగుతాడు. తోబుట్టువు, కొడుకు అల్పాల్పంగానే ఇస్తారు. కోరిన ధరం ఎంత అయినా కాదనక ఒసగే పతికి ఏ చుట్టం సరికాడు. సహనం వహించి వ్రతంగా ఉప్పిడి పిండి తిని ఉపవాసం వుండే విధవ ఎన్నటికీ సధవతో సాటి కాలేదు. నానా పుణ్యక్షేత్రాలకి చని వివిధ పుణ్య తీర్థాలాడిన విగత భర్తృక మగనాలితో సరిపోలదు. సమధికం అయిన నియమ నిష్ఠలతో జపాలు ఒనర్చినా విధవ సతితో సరిపోల్చతగదు. విధవ సద్భక్తితో ఎందరు దేవతల్ని పూజించినా పుణ్యస్ర్తితో పోల్చ సాటిరాదు. నిద్ర మేల్కొని ఉదయమందే నిష్ఠతో తీక్షణ కిరణుడిని సందర్శించకముందే జనము తల్లిని, వదినెని, అత్తగారిని తప్ప అన్య అయిన విగత భర్తృకను వీక్షింపతగదు.
ప్రాణములు పోయిన తత్‌క్షణమే శరీరం అపవిత్రం అయిపోతుంది. అటువంటి శరీరం సుగంధ జలాలలో అఘమర్షణ మంత్రపూర్వకంగా సహస్ర ఘటాభిషేకం కావించినా పవిత్రం అవుతుందా? ఆ రీతిగానే భర్తను పోగొట్టుకుని మంగళసూత్రం లేని అవస్థ పొందిన స్ర్తి అశుచిత్వాన్ని వేయి భంగులుగానైనా పాయదు.
ఎంత ప్రేమ వున్నా ప్రాతఃకాలంలో ముఖ దర్శనం చేసి విధవ ఆశీస్సు పొందతగదు. పతిని బాసిన సతి బైసిమాలిన నిర్భాగ్యురాల. గౌరవం లేనిది. ఆమె ఆశీర్వచనం విషసమానము.
వివాహంనాడు భూసురులు వరుని గురించి వధువుతో సర్వకాల సర్వావస్థలలోను సహచారిణివి కావలసింది. పూర్ణచంద్రుడిని చంద్రిక కరణి, తొలకరి మబ్బును మెరపు వడువున సతి పతిని అనుసరించడం ధర్మం. పతి చేత పెట్టారో లేదో- అంత మాత్రం చేతనే స్నానం ఆచరింప కొలనికి కదలు మాదిరిగా అలంకరించుకొని పతి పాడె వెంట స్మశానవాటికకి ధైర్యం వీడక చొరవతో చితిలో ఉరుకుటకు పోతున్న పడతి వేసే ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క అశ్వమేథ ఫలం తథ్యంగా కలుగుతుంది. పుట్టలోవున్న సర్పాన్ని వెలికి రప్పించే వశీకరణ మంత్రం నేర్చిన పాములవాడి విధంగా- అగ్నిలో ఉరికిన పత్ని పాపం నుంచి తన పతిని ఉద్ధరిస్తుంది. పెక్కు మాటలతో ఏమి పని? స్వాధిని గర్హింప ఒకానొకడు ఏ విధంగా చాలగలడు? పతివ్రత యెదపై పయ్యెదని తొలగించ వాయువు కూడా వెరచుతాడు. ఆత్మలో ధర్మమార్గం తప్ప తలచే దుష్టాత్ములకి పతివ్రత పాతివ్రత్య మహము బడబాగ్ని కంటె యముడి కంటె, సూర్యుడికంటె, పిడుగుకంటె బిరుసుదనాన్ని చూపుతుంది.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి