భక్తి కథలు

కాశీఖండం 34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నివృత్త్యాదులయిన దివ్య స్థలాల చేతా, రససిద్ధి, రసాయన సిద్ధి, మూలికా సిద్ధి, పాదుకా సిద్ధి ఆర్తులైన సిద్ధిక్షేత్రములచేతా, సంశోభితం అయి ఆ పర్వతం దివ్యామృత నిర్మల శ్రీ సయంభూజ్యోతిర్లింగ మూర్తి అయిన మల్లికార్జున శ్రీమన్మహాదేవుడికి నిజ నివాసం. అటువంటి శ్రీశైల పవిత్ర క్షేత్రాన్ని ఆ మహర్షి దంపతులు చేరుతుండగా, పాతాళగంగా వాహినీ ప్రవాహ తరంగములనుంచి ఎగిరిపడుతూ వున్న జలకణలవముల చేత శీతలములు అయినవిన్నీ, హోటకేశ్వర జటాజూట కృత పుష్ప మాలల లోపలి కేసరములలోని పుప్పొడుల సువాసనా సంపన్నాలు అయినవిన్నీ, సాక్షి వినాయకుడికి తొడవులైన సర్పముల చేత పీల్చబడి వదలిపెట్టబడినవీ అయిన అటవీ వాయువులు అగస్త్యుడిని పరిరంభణం చేసుకున్నాయి.
లోపాముద్రసహితుడు, వింధ్యాచలముదాపహారి, మిత్రవరుణాంశ సంభవుడు అయిన ఆ కుంభసంభవుడిని శ్రీశైల మహాటవీ సీమల్లోని చెంచుజాతి నాతులు కుతూహలంతో అచ్చెరువుపోయి కాంచసాగారు. ఆ చెంచితలు పీనవక్షాలు, వినీల చూర్ణ కుంతలాలు కల అందకత్తెలు.
అనంతరం ఆ వాతాపి దమనుడు అక్కడి పాతాళగంగలో అఘమర్షణ మంత్రాలు పఠిస్తూ స్నానం ఆచరించాడు. వింధ్యగిరి దర్పాన్ని అణచివేసిన ఆ వౌని హోటకేశ్వరుడిని రెల్లు పువ్వులతో పూజించాడు. ఆకాశవీధిలో నక్షత్ర రూపధారి అయివున్న ఆ రుషి వతంసుడు వైకుంఠ బిల మధ్యవాసి అయిన నరసింహస్వామిని కొలిచాడు.
నీవార ముష్టింపచుడు అయిన అగస్త్యుడు ఏకాంత రామేశ్వరస్వామిని సందర్శించాడు. లోపాముద్రాదేవీ, తానూ మంచుకొండ అనుగు చూలి అయిన పార్వతీదేవి పరిరంభ జనిత హర్షాత్ముడయిన మల్లికార్జున శంభుదేవుణ్ణి సంసేవించాడు. అగస్త్య సంయమి హ్రీంకారాది మంత్రాభ్యాస నిరతుడయి శైవాగమోక్త ప్రకార క్రమంలో గరళకంఠుడి అర్థాంగ లక్ష్మి అయిన భ్రమరాంబని- రసాల తరు ఫల భార గురుత్వం కల మామిడి తోపులలోని స్వర్ణ సింహాసనాసీన అయిన దేవిని- నియతితో కొలిచాడు.
వౌనివరుడు తనధర్మపత్నీ, తానూ ఆ వడువున గుహా సహస్రమార్గ శాఖోపశాఖల్లో అమృతలింగమూర్తుల్ని చంద్రకిరీటుల్ని శోధిం చి, శోధించి కడు భక్తితో పూజించాడు. అంతేకాక, ఆ యిల్వల మథనుడు యథావిధిగా మధూక కుండంలో క్రుంకులాడాడు. పంచాక్షరీ మంత్ర సిద్ధుడైన ఆ రుషి పంచధార, పాలధారలు అనే నిర్ఘరాలలో అవగాహనుడు అయాడు. పాటల జటాజూటుడు హాటకశైలసాను శృంగాగ్రభాగంలోని కోటి లింగాలను భజించాడు. ఆ లోపాముద్రాపతి అద్రి భద్రాసనంలో వున్న ఆ రామ వీరభద్ర స్థానం, బ్రహ్మగిరి, ఘంటాసిద్దేశ్వరం, భోగేశ్వరం, ఇష్టకామేశ్వరం, సప్తమాతృకలు, కదళీవనం- ఇత్యాదులు పూజించాడు.
అగస్త్య మహర్షి తన సతితో ప్రీతితో ఈ రీతిగా వాకొన్నాడు. ‘‘పద్మాక్షీ! పరికించు. మన్మథ వైరి, పార్వతీ ప్రాణేశ్వరుడు అయిన మల్లికార్జున దేవుడు విడువక రుూ గిరిపై వసించి వుంటాడు.
ఓ లోపాముద్రా! శ్రీశైల మహిమని ప్రస్తుతించడం బ్రహ్మదేవుడికయినా శక్యం కాదు. ఇక్కడి గండశిలలన్నీ శివలింగాలే. ఈ గిరిని నివసించు చెంచులందరూ సిద్ధమునులే! ఓ హరిణలోచనా! మరణించనిదే కాశీక్షేత్రం ఎవరికీ మోక్షం ప్రసాదించదు. ఈ శ్రీశైలం శిఖర దర్శనమాత్రం చేతనే పునర్జన్మ కలుగకుండ చేస్తుంది అని నుడివాడు. తన పతి వాక్కులు ఆలకించినంతనే లోపాముద్ర అంగుళీయకమణి మయూఖరోచులు నఖాగ్రభాగాల చివురులొత్త పగడముల కిసలయాలు విలాసాన్ని పరిహసించే మృదుల హస్తాలు ముకుళించి లలాటాన కీలుకొల్పి వినయ వినమిత శిరస్క అయింది.

-ఇంకాఉంది