భక్తి కథలు

కాశీఖండం.. 40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ సుందరాంగీ! ఆ ఉజ్జయినీ నగరపు నాల్గు తలపొలాల్లో ఎక్కడ కాంచినా ఎడమ చెవులు క్రిందగాను దక్షిణ కర్ణాలు (కుడిచెవులు) మీదుగాను శయనించి దీర్ఘ నిద్ర పొందిన ప్రాణుల శరీరాలు కిందిపోవు. గాజువారి కాంతిని కోల్పోవు. వికారం పొందవు. దుర్గంధం కొట్టవు. వసివాళ్లాడవు. అన్యక్షేత్రాల్లో ఇటువంటి చోద్యాలు కనబోము.
అచంచల భక్తితో ‘‘మహాకాళేశ్వరా! మహాకాళేశ్వరా! మహాకాళేశ్వరా!’’ అంటూ మూడు మారులు మహాకాళ స్థానేశ్వరుడయిన కాలకంథరుణ్ణి స్మరించినంత మాత్రం చేతనే అలవోకగా, అవలీలగా ప్రాణులు ముక్తిని చేకొన సమర్థాలవుతాయి.
ఆ శివశర్మ మహాకాళేశ్వర స్వామిని సేవించి కాంచీ నగరానికి ప్రయాణం అయాడు. ఆ కంచీపురంలో లక్ష్మీదేవి కరిగిరీశుడైన వరదరాజ స్వామివారిని, శ్రీ కామాక్షీదేవి ఏకామ్రనాథుడిని కూడి వుంటారు. ఆ విప్రవతంసుడు కంచికేగి కరిగిరి కందరావాసి అయిన వరదరాజస్వామిని భజించాడు. అనంతరం కామాక్షిని పూజించి బాలచంద్రశేఖరుడు ఏకామ్రేశ్వరుడిని సేవించాడు.
మన్మథుడి ఖడ్గలతలయిన కంచి అరవకాంతలు ఎడమ వంకకి కోణంగా ఈగవాలినా జారిపోయేటట్లు నునుపుగా కేశబంధాన్ని ముడువనేరుస్తారు. పొన్నపువ్వుల్ని పోలిన నాభిసుడులు బయలు పడేరీతిగా కటి ప్రదేశాల చీరలు కట్ట నేరుస్తారు.
పొడవులయి వ్రేలాడే చెవుల్లో అవతంసంగా అల్లి పువ్వుని సుతారంగా అమర్చుకొన నేరుస్తారు. పదారువనె్న పసిడి పాగడలు (పాదాలంకార విశేషాలు - మట్టెలు మొదలైనవి) నేలపైన పట్టు లభించే చందంగా పచరింపనేరుస్తారు. వక్షఃప్రదేశాల్లో పైట, సిగ్గు ప్రాకనీక ఓలగందపు పసపు (చందన మిశ్రీతం అయిన దట్టమైన పసపు పూతను) పూయగలుగుతారు. ఆద్రవిడాంగనలు సురతవేళల్లో తమ భర్తలను నిర్బంధంలో వుంచగల్గుతారు. చక్కనైన కురువింద రత్నకాంతులు ఆ కంచిలో సమృద్ధిగా వుండటంవల్ల పండితులు ఆ కాంచీ నగరం పేరు ‘కాంతి’ అని పిలుస్తారు. శివశర్మ ఆ నగరంలో ఏడు రోజులు వసించి అక్కడి సకల దేవతల్ని అర్థించాడు. అక్కడనుంచి ప్రభాస క్షేత్రం మీదుగా ఏగి ఆ శివశర్మ ద్వారకా నగరంలో కొన్ని దినాలు వసించి, అక్కడి భగవద్భక్తులతో శ్రీమన్నారాయణ పుణ్య కథా పారాయణం కావించాడు.
ఓ ధవళలోచనా! ఒక చోద్యాన్ని ఆలకించు. ద్వారకానగరంలో మరణించిన మనుజుల అస్థిశకలాలలో లోపల విష్ణుమూర్తి ఆయుధాలైన పాంచజన్య (శంఖం) సుదర్శన (చక్రం)ముల చిహ్నాలు లేక ముద్రలు అలరారుతాయి.
బంగారు మొగలి పువ్వు నడిమి రేకు కాంతిని పురుడించు కాంతితో చందనం, కుంకుమ, అగురు సువాసనల సంపదతో వ్యాప్తి చెందే సువాసనలతోడి గోపీచందనాన్ని ద్వారవతీనగరంలో నివసించు పరమ భాగవతులు అతి ప్రీతితో అలదుకొంటారు.
ఓ రమణీ! ఆ వీటి భాగవతులు తమ లలాట భాగాల పాప పరంపరలనే కంఠనాళాల్ని వుత్తరించే విచ్చుకత్తులలాగు మెరసే ఊర్థ్వపుండ్రాలు ధరిస్తారు.
ఇంపైన గోపికాచందనంతో ఊర్థ్వ పుండ్రనామాలు అందమొలుక అక్కడి భాగవతులు తీర్చిదిద్దుకొంటారు. వక్ష్ఫఃలకాలమీద తామరపూసల మాలలతో బాగైన అలంకరణగా సంతరించుకొంటారు.
కుడిచెవుల లోపల మృదువైన తులసీ కిసలయాలు అలవరించుకుంటారు. రాజీవాక్షుడి దివ్య నామ సంకీర్తనా విధానానికి నాలుకలను పాలు పరుస్తారు. ఆ ద్వారవతిలో నిర్మల వివేక కృపా గుణభాగ్యాన్వితులు అయిన భాగ్యవంతులయిన భాగవతోత్తములు ముక్తికాంతా విహార మంటపాల్లో వసిస్తారు.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి