డైలీ సీరియల్

ఒయాసిస్ 51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ మొగుడికి అటు డబ్బు సంపాదనా లేదు.. ఇటు సుఖపెట్టటమూ తెలియదు. నీ యవ్వనం అంతా అడవిన కాచిన వెనె్నల అయిపోతోంది.. అందరికీ పురుళ్ళు పొయ్యటమే గానీ నువ్వు పురుడు పోసుకునేదెప్పుడు? నేనున్నాను గదా.. నా హెల్ప్ తీసుకో.. తప్పులేదు. పరాయివాడి సాయంతో తల్లికావటం మొదటిసారీ కాదు.. చివరిసారీ కాదు.. చరిత్రలో ఎన్నో ఎనె్నన్నో ఉదాహరణలున్నాయి. అయినా నేను పరాయివాడ్ని కాదు.. నీ వాడ్ని..
..రాజశేఖర్
రాజశేఖర్ మూడో మెయిల్ తీసి చదివాడు..
‘నీకు చెప్పవల్సినదంతా స్పష్టంగా చెప్పాను.. డబ్బు పంపించాను నువ్వు ఒప్పుకుంటావని.. కానీ నీకింత పొగరు పనికిరాదు. నీలాంటి ముట్టెపొగరు వాళ్ళని ఎంతోమందిని దాసోహం చేసుకున్నాను.. నీకూ నాకూ పెళ్లి అయినట్లు కనిపించే ఒక మార్ఫింగ్ ఫొటోని పంపిస్తున్నాను.. చూడు. మన జంట ఎంత ముచ్చటగా ఉందో.. ఇప్పటికైనా మనసు మార్చుకుని ఓ.కె అంటే సరే.. లేదంటే, ఈ ఫొటోని అన్ని సోషల్ వెబ్‌సైట్స్‌లోనూ పెట్టిస్తా.. లోకం దృష్టిలో మన పెళ్లి అయిపోయిందని తెల్సాకయిన చచ్చినట్లు ఒప్పుకుని తీరుతావు.. ఎలా వుంది మన ఐడియా? ఇలాంటి బ్రహ్మాండమైన ఐడియాలు మన దగ్గర చాలా ఉన్నాయి. నీ మొగుడు బ్యాంక్ నుంచి రెండొందల కోట్లు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చకపోతే, మీ ఇల్లు వేలం వేస్తామని బ్యాంక్ నుంచి రెండు రోజుల్లో లెటర్ వస్తుంది. ఇదంతా నా ఒత్తిడితోనే జరుగుతుంది.. ఒక్కో మెట్టే ఎక్కి శిఖరాగ్రం చేరతావో, ఒక్కో మెట్టే జారిపడిపోతూ నిండా మునిగిపోతావో ఆలోచించుకో. నీ ఆస్తి రేపు నేనే కొంటాను. నిన్నూ కొంటాను.. నువ్వు నా కాళ్ల బేరానికి వచ్చే రోజు ఎంతో దూరం లేదు.. ఉందిలే మంచీకాలం ముందూ ముందూనా.. ఇద్దరం సుఖపడాలీ నందనందనా..
.. నీ ప్రియుడు, విభుడూ..
నాలుగో మెయిల్ తీసి చదువుకున్నాడు..
‘రాత్రి జరిగిన గొడవ చాలా దూరం పోతుంది. నేను ఎంత మంచివాడ్నో అంత దుర్మార్గుడ్ని.. నా దగ్గర యాభై లక్షలు తీసుకుని నన్ను తంతావా? నువు ఆడదానివి. నీకే అంత పొగరుంటే, నాకెంత ఉండాలి? పైగా నా బతుకు బయటపెడతావా? నన్ను బొక్కలో తోయిస్తావా? అంత గొప్పదానివా నువ్వు? నిప్పుతో చెలగాటమాడుతున్నావు..’
ఈమెయిల్‌నిబట్టి, శేత రాజశేఖర్‌ల మధ్య జరిగిన గొడవలేమిటో అది ఎక్కడ నుంచి ఎక్కడకు దారితీశాయో తెలుస్తూనే వుంది.
అయితే రాజశేఖర్ హంతకుడు అని నిరూపించేందుకు ఈ సాక్ష్యాలు సరిపోతాయా? ఇంతకన్నా బలమైన సాక్ష్యాధారాలు లభిస్తాయా అని ఆలోచిస్తున్నాడు రణధీర్.
కానిస్టేబుల్ వీరాస్వామి ఒక పార్సెల్ తెచ్చి రణధీర్ టేబుల్‌మీద పెట్టాడు.
‘‘సర్, మీకీ పార్సిల్ వచ్చింది.. పర్సనల్ అని రాసి ఉంది.. గిఫ్ట్ ఫ్రం దీప్తి అని ఉంది సార్.. మీకు తెల్సిన వాళ్ళెవరో ఈ గిఫ్ట్ పంపించారు..’’ అన్నాడు వీరాస్వామి.
‘‘ఒకపక్క రాజశేఖర్‌ని కార్నర్ చెయ్యబోతున్నాడు. ఈ సమయంలో దీని దగ్గరనుంచి గిఫ్ట్ తీసుకోవడం ఎందుకు? కేసును ఇక్కడిదాకా లాక్కురావడానికి, రాజశేఖర్ నిజరూపం తెల్సుకోవడానికి ఈమె చాలావరకూ ఉపయోగపడింది.. ప్రతి కేసు పరిశోధన చేస్తున్నప్పుడు దాని తాలూకు మనుషుల నుంచి సమాచారం రాబట్టడం కోసం, కొంతవరకు పరిచాయాలు తప్పవు.. అయితే ఇలా పరిచయాలు అయిన వాళ్ళల్లో అమాయకులూ ఉంటారు.. అఖండమైన తెలివిగలవాళ్ళూ ఉంటారు. పచ్చి నెత్తురు తాగే కసాయి వాళ్ళూ ఉంటారు.. వీళ్ళతో డీలింగ్ ఆ కేసు ముగిసేవరకే..’ అనుకున్నాడు రణధీర్.
‘‘చూడు, వీరాస్వామి.. ఈ పార్సెల్ రిటర్న్ చేసెయ్..’’ అన్నాడు రణధీర్.
‘‘దానిమీద గిఫ్ట్ అని రాసి ఉంది సార్.. ఆమె ఎవరో ప్రేమతో పంపించింది. రిటర్న్ చేస్తే బాధపడుతుంది. ప్రేమతో ఇచ్చింది ఏదీ వద్దనకూడదు సార్...’’ అన్నాడు వీరాస్వామి.
‘‘అయితే ఆ గిఫ్ట్ నువ్వు తీసుకో...’’
‘‘ఆమె ఎవరో మీకిస్తున్న గిఫ్ట్ ఇది...’’
‘‘నేను నీకిస్తున్నాను.. తీసుకో..’’ అన్నాడు రణధీర్. వీరాస్వామి ఆ పార్సెల్ తీసుకెళ్ళాడు.
సెల్‌ఫోన్ల కాల్ లిస్టులు తీసి చూడటం మూదలెట్టాడు రణధీర్.
హాల్లో బాంబు పేలిన శబ్దం వినిపించింది.
రణధీర్ ఉలిక్కిపడ్డాడు. ‘ఏంటది?’ అనుకుంటూ సీట్లోంచి లేచి హాల్లోకి వెళ్లాడు.
కిటికీ అద్దాలు పగిలి అక్కడంతా గాజు ముక్కలు చెల్లాచెదురుగా పడినయి. కిటికీ దగ్గర టేబుల్‌మీదనున్న పార్సెల్‌నుండి మంటలూ పొగలూ వచ్చాయి. టేబుల్‌మీద ఉన్న కాగితాలూ అంటుకున్నాయి. వీరాస్వామి చెయ్యి మణికట్టు తెగి, వేలాడుతోంది. రక్తం భారీగా స్రవిస్తోంది.
ఆఫీసులో పనిచేస్తున్న మిగిలిన వాళ్ళు కూడా అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చారు.
సగానికి తెగి వేలాడుతున్న వీరాస్వామి చేతినుంచి రక్తం కారుతూనే వుంది.. మొహంమీద చిన్న గాయం అయింది. ఇద్దరు కానిస్టేబుల్స్ తెగిన చేయి విడిపోకుండా అదిమి పట్టుకుని, రక్తం పోకుండా ఉండటం కోసం జేబు గుడ్డలు గట్టిగా చుట్టారు.. కానీ ఆ జేబు గుడ్డలూ రక్తంతో తడిసి ముద్దయిపోయాయి.
రణధీర్ దగ్గర్లోని హాస్పిటల్‌కి ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించాడు. వాళ్ళతోపాటు రణధీర్ కూడా హాస్పిటల్‌కి వెళ్ళాడు.
ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లి చికిత్స మొదలుపెట్టారు. వార్త వెంటనే పై ఆఫీసర్లకు చేరింది. తమ ఆఫీసులోనే బాంబు పేలి కానిస్టేబుల్ చెయ్యి తెగిపోవటం ఆ ఆఫీసర్లకి షాక్ ఇచ్చింది. అడిషనల్ కమీషనర్, కమీషనర్, డి.జి.పి అంతా వచ్చి జరిగిన బీభత్సాన్ని చూసి అవాక్కయ్యారు. అయితే ఈ విషయాలు ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు.

- ఇంకాఉంది

శ్రీధర