భక్తి కథలు

కాశీఖండం ..41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ కువలయాక్షీ! లోపాముద్రా! ప్రతి యుగంలోను ఉప్పొంగి ద్వారకా నగరాన్ని ముంచివేసి ఆ నగరంలోని రత్నరాసుల్ని దొంగిలించుకొని పోయే కారణంగా సముద్రానికి ‘రత్నాకరం’ అనే అన్వర్థి నామం ఒనగూడింది. ద్వారకానగరం పొలిమేరల్లో కాలం చెల్లిపోయి మరణించిన సూక్ష్మక్రిములు, పుర్వులు, సర్పాలు, పక్షులు కటి ప్రదేశాల్లో పసిమి పట్టు పుట్టం కుచ్చెళ్లు తీర్చి కట్టు కొనగల్గుతాయి. వక్షోభాగాలలో వనమాలని కౌస్త్భుమణి అనే కంఠహారంతో చేర్చి ధరించగల్గుతాయి. సిగముడిలో శిఖిపింఛంతో సరిపరిచిన జిలుగు వలువ తలపాగ చుట్టుకొంటాయి. గొజ్జంగి పువ్వుల నీరు పోసి మేదించిన కమ్ముకస్తూరిని మేన నిండార అలదుకొంటాయి.
ఆ మహీసురుడయిన శివశర్మ ప్రీతితో ద్వారకలో తీర్థసేవా పరతంత్రుడై అయిదు వాసరాలు వసించి, అనంతరం మాయాపురికి అరిగాడు. ఆ మాయాపురం పురాజన్మలో పాప కర్మలు ఒనర్చిన మానవులకి దుష్ప్రాపం. ఆ మాయానగరానే్న కొందరు ‘హరిద్వారం’ అని పిలుస్తారు. మరికొందరు ‘మోక్షద్వారం’ అని పేర్కొంటారు. వేరొక కొందరు ‘గంగాద్వారం’ అని కొనియాడుతారు. ఆ చోటునుంచే గంగా తరంగిణి నిర్గమించి లోకపావని అయి శివజటాటవీ కుటజ కోరకం (కొండమల్లె మొగ్గ)- జలనిధిల బహుముఖాలుగా కలిసిపోయింది. అటువంటి మాయాపురంలో శివశర్మ-
పుణ్యతీర్థోపవాసం నిర్వర్తించి, జాగరం చేసి తెల్లవారిన వెంటనే గంగలో స్నానమాడాడు. పితృదేవతలకి తిల తర్పణాలు వదిలాడు. ఈవల పిండితో వండిన చరువుతో పిండ ప్రదానం నెరవేర్చాడు. హోమం- లేక అగ్నికార్యాన్ని తీర్చాడు. శివుణ్ణి అర్చించాడు. ముల్లు మోదుగాకులతో పుల్లాకు కుట్టుకొని, రాగి పాత్రలో ననువాయి కాకుండా వండి వార్చిన ఇగిరిన అన్నం వడ్డించుకొన తలచుతూ వుండగానే తలయేరు మంటతో బాధ- పుట్టింది. శరీరానికి పులకరం సోకింది. వజ వజ వణికించే చలి కలిగింది. మెడనొచ్చింది. జ్వరం తగిలింది. దప్పిక పుట్టింది. అంతా శివశర్మ తనలో తాను ఈ విధంగా తలపోయసాగాడు. చిచ్చువంటి జ్వరం తగిలినప్పుడే- సముద్రం మధ్యలో ఓడ పగిలిపోగా- అందులో వున్న ధనం మీద ఆశని సముద్రవర్తకుడు- ఆశ విడిచినట్లు నేను బ్రతుకు మీద ఆశని పాయద్రోశాను. ఇంక ప్రతిదినమూ గృహాలు, తోటలు, కేదారాలు, పశువులు- ఇత్యాదుల పరామర్శ ఎవడు చేయప్రాప్తుడు అవుతాడో కదా! ఇటుపైన ఏ విధంగా నా యిల్లాలు భర్తలేని సంసారాన్ని వెళ్ల త్రోయగలదో, పుత్రులు ఇక ఏ రీతిగా సంపదల విభాగం కోసం పోరాటాలు సల్పకుండా పొంది పొసగి వుంటారో, అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, ఆగమాలు, ఆదిగాగల గంధ సంరక్షణ ఈ పైన ఏమి కానుందో కదా! అక్కటక్కటా మిన్నుల పడ్డ తావున అనాథుడి చందంగా దిక్కుమాలిన ప్రేతాన్ని అయి మరణింపవలసి వచ్చింది. తలమీద మృత్యువు నాట్యమాడుతోంది. ఇంక శీఘ్రంగా మరణించడం నిక్కం. జీవించడం సంశయం- ఈ గతి సంసార యాత్రలోని చింత అనే బరువును మోసి సంతాపాన్ని పొందడం దేనికి? ఈ జ్వర దావాగ్ని జ్వాలలు చాలవా? నా మనస్సులో విశే్వశ్వరుడైన శ్రీ కాశీవల్లభుణ్ణి, రాజీవాక్షుడయిన శ్రీమన్నారాయణుడిని- ద్వారకాపతిని-
సూర్యలోకము
ఆ విధంగా చెప్పగా అప్సరల లోకాన్ని కనుగొంటూ సూర్య లోకాన్ని దరిసి, ఏకచక్రమూ, సప్తాశ్వమూ, అనూరుసోరధికమూ- అచ్చరలతో, ఋషులతో, గంధర్వులతో, దివిజులతో, ఉరగులతో కూడిన రథంమీద రెండు చేతులా రెండు పద్మాలని పట్టుకొని ఆకాశ వీధిని వెడలిపోతున్న భాస్కరుణ్ణి కాంచి ఆ శివశర్మతో విష్ణ్భుటులు ఈ రీతిగా వచించారు.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి