భక్తి కథలు

కాశీఖండం 55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్భకరమైన కాలపాశబద్ధుడై ప్రాణాపాయభీతుడైన శే్వతకేతువుని రక్షింపలేదా? శిలాదుడి తనయుడైన ఎనిమిదేండ్ల నందీశ్వరుణ్ణి రక్షించలేదా? కాలకూట విషాగ్నిచే దగ్ధములు కాకుండా పదునాలుగు భువనాలను పాలింపడా? ఆయుర్దాయం నిండిన మృకండు మహర్షి తనయుడైన మార్కండేయుణ్ణి కరుణాభావంతో మనుపలేదా? అంధకాసురుణ్ణి, వ్యాగ్రాసురుణ్ణి, జలంధరాసురుణ్ణి, గజాసురుణ్ణి, దక్షయజ్ఞాన్ని, మన్మధుణ్ణి, త్రిపురాసురుల్ని ధ్వంసం ఒనర్చిన విశే్వశ్వరుడైన కాశీకాపురాధీశుడికి, చంద్రకళావౌళికి నిన్ను కాపాడడం ఏ పాటి భారం?’’ అని కొడుకుని ఆశీర్వదించి పంపివేశారు.
అనంతరం ఆ వైశ్వానరుడు కాశీపురికి అరిగి మణికర్ణికాతీర్థంలో స్నానం చేశాడు. విశ్వనాథుడిని దర్శించాడు. ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని కన్నులారా కనుకొన్నాడు. ఆలింగనం పరమానందపు దుంప అనీ, కరుడుకట్టిన త్రైలోక్య సారస్వస్వం అనీ, పాలకడలి నుంచి జనించిన అమృతపు ముద్ద అనీ, స్వాత్మజ్ఞానం అనే వృక్షానికి తొలి మొలక అనీ, బ్రహ్మరసాయనం అనీ, లింగ నెపంతో ఆకృతి దాల్చిన నిరాకార తత్త్వం అనీ, ముక్తితరువు శాఖను కాసిన ఫలం అనీ, పుష్పగర్భంలో వున్న మోక్షలక్ష్మీ కేశపాశం అనీ, కైవల్యం అనే మల్లె తీగ స్తబకం అనీ, మోక్షలక్ష్మి కరమందలి ఆట బంతి అనీ, అపవర్గం లేక మోక్షం అనే తూర్పుకొండ మీది చంద్రబింబం అనీ, సంసార మోహ సమూహం అనే చిమ్మచీకటిని పటాపంచలు కావించే సూర్య మండలం అనీ, మోక్షకళ్యాణి అనే రమణి శృంగార లీలా దర్పణం అనీ భావించి భావించి తర్కించి తర్కించి, నమస్కరించి ఒక పుణ్యాశ్రమంలో శుభదినాన లింగ ప్రతిష్ఠ కావించి ఆలింగ సన్నిధిని రెండేండ్లు ఘోరపతం ఆచరించాడు. అపుడు ఒకనాడు-
ఆ వైశ్వానరుడి కట్టెదుట బాహువున వజ్రాయుధాన్ని తాల్చిన వాడున్ను, పెక్కు మత్యాల హారావళితో ప్రకాశించే కంఠాభరణాలు ధరించిన వాడున్ను అయిన ఇంద్రుడు ఐరావతం అధిరోహించి కాశీ ప్రదేశంలో ఆవిర్భవించాడు. ‘‘నీ తపోవైభవానికి మెచ్చాను. నేను దేవేంద్రుణ్ణి. వరం ఇస్తాను వేడుకో’’ అని జంభాసుర విరోధి ప్రత్యక్షం అయి పలికాడు. అంత ఆ శుచిష్మతీ నందనుడు ‘‘దేవేంద్రా! నేను నిన్ను వరం వేడను. నీకు నాకు కూడా ప్రభువైన కాశీ విశే్వశ్వర మహాదేవుణ్ణి కడు భక్తితో వరం అర్థిస్తాను’’ అని బదులు పలికాడు.
అప్పుడు ఇంద్రుడు ‘‘శ్రీమహాదేవుడనీ, కాశీవిభుడు అనీ, విశ్వనాయకుడు అనీ ఒక వేల్పు వున్నాడా? నేనే ముల్లోకాలని పాల్తిను. నేను అఖిల దేవతా సార్వభౌముడిని. సంశయమంద పనిలేదు. ఈ ముజ్జగాలలో నన్ను మించిన అధికుడు ఎవడు? నీ మనస్సున విశ్వసించు. ఎందుకు వదలిపెడతావు? నీకు ఇష్టములైన వరాలు కోరుకొనరాదా?’’ అని అడిగాడు.
‘‘శచీవల్లభా! ఈ మాటలతో పని ఏమిటి? నీ ప్రభావాన్ని నీలకంఠుడి ప్రభావాన్ని ఈ ముజ్జగాలు ఎరుగును. పెద్దతనపు మాటలు ఆడవద్దు. నిన్ను నేను వరం వేడను. వేగమే పోవలసింది.
నిన్ను పోలు పేద వేల్పులు వరాలు కూడా ఇవ్వగలరా? నాకు అర్థచంద్రధరుడు వరం అనుగ్రహింపనున్నాడు. వ్యర్థవాగ్వర్షం కురిపించి ప్రయోజనం లేదు. ఊరక నా తపశ్చర్యకి ఆటంకం కల్గించకు’’ అని పరిహారమాడాడు.
అంత వాసవుడు కటకటపడి వెడలగ్రక్కిన ఇంద్రధనుస్సులు కలది, దనుజాంగనలకి వైధవ్య దీక్షాదానగురువై, పొగలు రాని అగ్నిజ్వాలలతో జడలు విరబోసికొని వున్న భీర వజ్రాయుధాన్ని కేలదాల్చి వైశ్వానరుడి ఎదుట ఝుళిపించాడు.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి