భక్తి కథలు

కాశీఖండం 58

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడి చెలిమికాండ్రు భయభ్రాంత చిత్తులయి ఏతెంచి దేవార్చన సమయంలో సమాధి నిష్ఠుడై వున్న అతడి తండ్రి కర్దముడికి ఆ వార్త విన్నవించారు. సుత మరణవార్త విని కూడా అతను చిత్తాన్ని చలింపనీక ధ్యానమార్గంలో బ్రహ్మాండాలని, భువనాలని, పంచభూతాలని, సూర్య చంద్ర నక్షత్రాలని, జ్యోతిస్సులని, పర్వతాలని, అరణ్యాలని, నదుల్ని, సముద్రాల్ని, దీవుల్ని, గంధర్వ, విద్యాధరాది వివిధ దేవయోనుల్ని, వారి వారి స్థానాలనీ, వాపీకూపతటాక కుల్య పుష్కరిణుల్ని కాంచి, వానిలోని ఒక ఎర్రతామర కొలనులో తన కొడుకు జలక్రీడలాడుతూ వుండగా పున్నమ చందమామను పోలిన మోము కల ఆ బాలుడిని ఒక పెద్ద మొసలి వచ్చి తన తీవ్రమైన కోరలు దిగవారకుండ పట్టి జలాధిదేవత చెంతకి తెచ్చింది. ఆ జలదేవత బాలుడిని వరుణదేవుడి ఎదుట నిలిపింది. అంతలోనే ఎర్రవారిన క్రీగన్నుతో ఒక శివభటుడు త్రిశూలపాణి అయి చనుదెంచి, వరుణదేవుణ్ణి తీక్షణదృష్టితో కాంచి, ‘‘వరుణా! అనుకంప లేక మహానుభావుడైన కర్దమ ప్రజాపతి శిశువున్ను శివభక్తుడున్ను అయిన ఈ బాలకుణ్ణి తెప్పించావా? దీనివల్ల ముందు ముందు నీకు ఏమి కీడు మూడనుందో ఎరుగుదువా?’’ అని వెరపుగొల్పి, వరుణుడు ఆ శిశువుని మొసలితో కూడ ఆ శివభటుడికి ఒప్పగించాడు. అంతేకాక ఆ భటుడితో శంభుడి సన్నిధికి ఏగి పరిపరివిధాల అపరాధాన్ని తొలగింప ప్రార్థించాడు. అంత కర్దమ ప్రజాపతి శివాజ్ఞవల్ల ప్రమథుడు తన కొడుకుని తన చెంతకు తేవడం చూశాడు. సరిగా ఆ సమయానికి తన సమాధి నిష్ఠపూర్తికావడంవల్ల కన్నులు తెరచి తన ఎట్టఎదుట కుమారున్ని కనుగొన్నాడు.
ఆ కుమారుడు- మొసలి తన ఉలివంటి కోరల కొనలతో పట్టుకొనడవంల్ల కటిభాగం నల్లవారింది. కొసలనుంచి ముత్యాల లాగు ఉట్టిపడుతున్న జలబిందువులతో అందగించే ముద్దు చిప్పకూకటి కల్గివున్నాడు. ఎర్రని అంచులతోడి పద్మపత్రాలను పోలిన లోచనాలు కళకళలాడుతున్నాయి. దవ్వు దవ్వుల రాకపోకలతో పుట్టిన ఆయాసంవల్ల కలిగిన నిట్టూర్పులు విడుస్తున్నాడు. శీఘ్రంగా అచ్ఛోదసరస్సు వెలువడి, ఆ పెను మొసలిని పట్టెడత్రాడుతో కట్టి తెచ్చి నిలిచాడు. ఆ తనయుణ్ణి వీక్షించి- తన పద పద్మ ద్వయానికి సాగిలి మ్రొక్కిన కుమారుణ్ణి వీక్షించి కర్దమ ప్రజాపతి చచ్చిబ్రతికిన ఆ బాలుణ్ణి సంతసంతో గ్రుచ్చి కౌగిలించుకొన్నాడు.
‘‘అనఘా! శివశర్మా! ఇటువంటి పరమాశ్చర్యకర విషయం ఎక్కడయినా వుందా? సదాశివుణ్ణి పూజించే సమయంలో సమాధి నిష్ఠలో మునిగి కర్దమ ప్రజాపతి కుమారుడికి సంఘటించిన పోకలన్నీ కనుగొంటూ వుండగానే నూట అయిదేండ్లు గడచిపోయాయి.
కర్దమ ప్రజాపతికి ఆ దీర్ఘకాలం ధ్యాననిష్ఠతో వున్నందున సుదీర్ఘ కాలం ఒక ముహూర్తమాత్రం అయితోచింది. ఆ తర్వాత కర్దమ తనయుడు శుచిష్మంతుడు తండ్రి అనుమతి పడసి కాశీపురానికి చని, అక్కడ లింగ ప్రతిష్ఠ సల్పి అయిదువేల సంవత్సరాలు తపస్సు ఒనరించాడు. ఆ తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షం అయాడు. శివుడు శుచిష్మంతుడికి వరుణ పదవి అనుగ్రహించాడు.
సముద్రాలకి, రత్నాలకి, నదులకి, సరస్సులకి పల్వలాలకు, వాపీకూప తటాకాలకి, పశ్చిమ దిశకి అధీశ్వరుడు అయాడు. కాశీనగరంలో కార్ధమి (కర్దముడి పుత్రుడు) పతిష్ఠితమైన లింగానికి మణి కర్ణేశ్వర లింగమని పేరు. ఆ మణి కర్ణేశ్వర లింగానికి నిరృతిభాగంలో వరుణేశ్వరం అనే పేరుగల శంభులింగం ప్రతిష్ఠింపబడి వుంది. ఆ వరుణేశ్వర లింగాన్ని సేవించిన జనులకి సంతాప, అపాయ, మరణ భయాలున్న జలోదరాది భయాలున్ను పుట్టవు. ఇది వరుణలోక వృత్తాంతం.

-ఇంకాఉంది