భక్తి కథలు

కాశీఖండం 60

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపనాయకులకి పెద్దరికం ఒనరిస్తాడు. కులటాతనయుల్ని కొండ చేస్తాడు. తారుపుగాళ్లని గౌరవించుతాడు. పోతులు, కోళ్లు మొదలైన జంతువులతో ఆడే సజీవ ద్యూతంలోను, ప్రాణులను ఒడ్డని నిర్జీవ ద్యూతంలోను ఓడిపోయి సొమ్ములు లేక ధనాలు తన కన్నతల్లి శరీరాభఱణాలను విక్రయించి చెల్లిస్తూ వుంటాడు.
ప్రతిదినమున్ను ఆ గుణనిధి తల్లి శ్రద్ధ వహించి ‘నాయనా! మీ తండ్రి చెప్పిన చొప్పున నడుచుకో. ధూర్తులతో మైత్రిని విడనాడు. సజ్జన సంగతి సలుపవలసింది అని నూరిపోస్తూ వుంటుంది. తండ్రి అయిన యజ్ఞదత్తుడు గృహకృత్యాంతర వ్యగ్రుడు కావడం కారణంగా కొడుకు ప్రవర్తనని పట్టించుకొనక వుండేవాడు.
‘‘ఎడప దడప మన కుర్రవాడు ఎక్కడకు ఏగినాడు. కనపడడు ఏమి’’ అని దీక్షితుడు భార్యని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆమె ‘ఇంత తడవు ఇక్కడనే నా దగ్గరనే వుండి ఇప్పుడే చదువుకొన అరిగాడు’’ అని చెప్పి భర్తని మోసగిస్తుంది.
గుణనిధి స్నానం చేశాడా? సంధ్యావందనం ఆచరించాడా? అగ్నిహోత్రం వేల్చాడా? అని పతి అడగ్గా స్నానం ఆడాడు. సంధ్యవార్చాడు. అగ్నిహోత్రం చేశాడు అని బదులు చెపుతూ మోసగింపసాగింది.
ఆ సాధ్వి గొడ్డు వీగి కన్నకొడుకు కనుకనున్ను ఏకైక పుత్రుడు కావడంవల్లను, అత్తారు బెత్తంగా పెంచడం చేతనున్ను దుష్టుడు, ధూర్తుడు అయిన కన్నకొడుకు దుష్టచేష్టలన్నీ భర్తకి తెలియనీక కప్పిపెడుతూ వుంటుంది.
స్నాతకవ్రతంలోని కేశ ఖండనం లేక గోదానం పిమ్మట (గో అంటే కేశాలు- దానం అంటే ఖండనం- దో అవఖండనే అని పండితులు) పదహారవ యేడు వచ్చిన వెంటనే గృహ్యసూత్ర విధిని అనుసరించి ఆ గుణనిధికి తల్లిదండ్రులు వివాహం ఒనరించారు.
కన్న కానుపు మీద కల ప్రేమ చంపుకొనలేని అనురాగంతో గుణనిధి తల్లి అతను ఒనరించే అకార్య కృత్యాలని మాన్పించాలనే వాంఛతో ఏకాగ్ర చిత్తంతో ఈ గతి బుద్ధులు గరప మొదలుపెట్టింది.
‘‘నాయనా! నీ దుర్వృత్తాంతం తెలిసికొంటే నీ తండ్రి ఆగ్రహిస్తాడో లేదో నువ్వు ఎరుగవా? అసత్యవాక్కులతో మాటిమాటికి కప్పి పెట్టుతున్న నా మీద పట్టరాని కోపం వచ్చి నన్ను చంపక వుంటాడా?
అనుగుకుర్రా? శ్రోతియాచారవంతులున్ను, షడంగాలతో వేదాలు అధ్యయనించిన అనూచానపరులున్ను, సోమయాజులున్ను అయిన మన వంశంలోని పెద్దల్ని తలుచుకో- రాజ గౌరవార్హుడున్ను, సత్యవాక్కున్ను, నిర్మలాచారవంతుడు అయిన నీ తండ్రిని జ్ఞప్తిలో వుంచుకో- భాగ్యసంపదలోను పతివ్రతలోను పరిగణింపదగిన నీ కన్నతల్లిని భావించు. వేదవిద్యలోను, నానాపురాణ విజ్ఞానంలోను నిష్ణాతులై వనె్నకెక్కిన నీ తోటివాళ్లని దలపోసి చూడు. చెడ్డ యింతి చెదారమయి శివానుగ్రహంవల్ల జనించిన ఇరవై అయిదేండ్లు నెత్తిమీదకి వచ్చిన నిన్నూ నీ నడవడికనీ అరసి చూసుకో- పదారేండ్ల ముగ్ధ అయిన నీ భార్యని అయినా తలచుకొని నీ దుష్టచేష్టితాలు మానుకోరా నాయనా!
ఇక నీ అత్తగారు సకల కళ్యాణ గుణరత్నఖని. నీకు పిల్లనిచ్చిన మామగారు ఔదార్య గుణము క్షమా గుణము, తేజస్సులలో సాటిలేనివాడు. మరి నీ మేనమామ యశోమహిమాన్వితుల్లో దొడ్డవాడు. ఇట్టి ఘనులనందరినీ తలచుకొని అయినా వినయ గుణం అలవరచుకొనవు ఏమయ్యా?
ఈ రీతిగా నవ్వు నగరంలోని వీధి వీధుల్లోను వెంగలివై తిరుగుతూ, చెడ్డవాళ్ళతో కూడి మానక ధూర్తకార్యాలు చెయ్యడం రాజుగారికి తెలిస్తే సోమయాజి అయిన నీ తండ్రిని పరిత్యజించి వేస్తాడు. మనకి జీవనాధారాలైన మడులు, మాన్యాలు స్వాధీనపరచుకుంటాడు.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి