భక్తి కథలు

కాశీఖండం 64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలి మునివ్రేళ్లు ఒయ్య ఒయ్యన నేలపై మోపి సవ్వడి- సద్దు చెయ్యక, ఊపిరి బిగపట్టి, అడుగు లోపల అడుగు వేస్తూ దీపపు నీడలో స్పష్టంగా కానరాని చీకటి అంచున గర్భగుడిలోనికి ప్రవేశించాడు.
అక్కడ వుంచిన పళ్లెరాలలోని అప్పాలతో పప్పుతో, అరటిపండ్లతో, నేయితో, పెరుగు, పాలు, తేనె మొదలైన బహు పదార్థాలతో కూడిన తెల్లని శాల్యన్నం గుణనిధి కన్నులు విప్పార్చి వీక్షించాడు.
ఆ సమయంలో గర్భగుడిలోని దీప కళిక వృత్తి మొదలంట కాలిపోయి ఆరిపోయే దశలో వుండడం ఆ బాపడు చూశాడు. వత్తిని ఎగత్రోసి దివ్వె వెలుగుని రెక్కొల్పి సుస్పష్టంగా భుజింపదలచిన ఆహారాన్ని చూడగోరాడు.
అంతలో ఆ గుణనిధి ఒక అన్నకుంభాన్ని కాంచి చందమామ గుటకలు మ్రింగుతూ ఆ మూల వెలుగు వెల్వలపోతున్న దీపాన్ని చూసి, దాన్ని పైకి ఎగద్రోసి, నెయ్యి పోసి నింపి, తన అయిరవాసం అంచు చించి వత్తిగా చేతి వేళ్ళతో మెదిపి, నేతిలో ముంచి దివ్వెని వెలిగించాడు.
పచనం కావించిన వంటకం కలిగిన పూర్ణపాత్రని గైకొని, ఆలయ బహిర్ద్వార ప్రదేశంలో భుజించే వాంఛతో గుణనిధి ఆలయం వెల్వడి రాసాగాడు. అప్పుడు విధివశంవల్ల ఆ గుణనిధి పాదం వ్రేలు అక్కడ నిదురిస్తున్న ఒక్కడి అవయవానికి తాకింది. అనిద్రాసక్తుడు వెంటనే మేల్కొని తొట్రుపడుతూ దొంగ దొంగ అని అరచాడు. అంత గతానుగతికంగా గుణనిధిని వెంబడిస్తూ జనులు ఆక్రోశం ఒనర్చారు. అయినా గుణనిధి పక్వాన్న పాత్రను విడిచిపెట్టక బయటపడి కన్న దిక్కుగా పరుగుతీశాడు.
అంతపురం తలారులు గుణనిధిని వెన్నుదన్ని తరిమి తరిమి నిశిత బాణాలతో కొట్టగా అతడు అసువులు కోల్పోయాడు.
ఆ విధంగా ఉసురులు పాసిన బ్రాహ్మణబ్రతుడు గుణనిధిని కొనిపోవ యమభటులు వరుణ పాశంతో భీకర హస్తులై చనుదెంచారు. ఆ సమయానికే గుణనిధిని వెంటగొనిపోవ శంకర కింకరులు విమానం కైకొని ఏగుదెంచారు.
పిమ్మట త్రిశూలం, ఖట్వాంగం, పట్టిసం మొదలైన బహువిధ ఆయుధ పాణులయి ఏతెంచిన పినాకపాణి భటుల్ని కాంచి, భీత చిత్తులయి యమకింకరులు కరాలు మోడ్చి వారితో ఈ కరణి పలికారు.
‘‘శంకర కింకరులారా! మహానుభావులారా! మీకు ఉచితానుచితాలు, ధర్మం, న్యాయం, పంతం అన్నీ తెలుసు. ముజ్జగాల్లో మీకు అడ్డం లేదు. మీ ఎట్టఎదుట నిలువడానికి మేము ఏపాటివారం?
ఈ విప్ర యువకుడు కులాచారాలు పాటించని అయోగ్యుడు. పితృవాక్యాలు పాలింపని హీనుడు. సత్యం, శౌచం వదలిన భ్రష్టుడు. సంధ్యాస్నానాలు వర్జించిన నీచుడు. శివ నిర్మాల్యాన్ని అపహరించిన దొంగ. ఇతని యెడ ధర్మం లేశమేనా వున్నదేమో సెలవిండు. వీడి పుణ్యాపుణ్య వివేచనకి మీరే ప్రమాణం’’ అని వచించారు.
అంత శివభటులు ‘‘శివధర్మం సూక్ష్మాతి సూక్ష్మం. అటువంటి శివధర్మం అణుమాత్రం ప్రాప్తించినా బహువిధ పాప సంప్రాప్తులు అయే పాపాల హావడులు ఆ ధన్యాత్ముణ్ణి దరికి చేరగా రావు.
స్థూల దృష్టితో వీక్షిస్తే గోచరం కాదు. సూక్ష్మదృష్టితో పరికిస్తే గోచరం అవుతుంది. కనుక శివభక్తి ధర్మం అంతుపట్టరాని లోతైన మహా మహిమ కలది. కానవచ్చినట్లే వుంటుంది కాని నిక్కం వచించాలంటే కనుపట్టదు. ఇది ఆచారం! ఇది అనాచారం అని నిర్ణయించడం బ్రహ్మదేవుడి వశమా? శివధర్మాచారం సూక్ష్మాతి సూక్ష్మమై వర్తిస్తుంది.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి