నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దినముం జిత్తములో సువర్ణముఖరీ తీర ప్రదేశామ్ర కా
నన మద్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా
సననిష్ఠన్నిను జూడగన్న నదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా
సిని మాయానటనల్ సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వరా!
భావము:శ్రీకాళహస్తీశ్వరా! సువర్ణ ముఖరీ నదీ తీరముగల మామిడి తోట నడుమనున్న ఱాతి యరుగుపై పద్మాసన స్థితిలో కూర్చుని మనసులో ఆనందము తదేక భావనతో నిన్ను చూడగలిగినచో అదియే సుఖము, సంపదలవలన కలుగు సుఖములు సుఖములగునా? కావు అని భావము. అశాశ్వితమైన సంపదల గురించి ఎంత ఆలోచించినా అవి ఉన్నాయని ఎంత ఆనందపడినా అవి అన్నీ ఒకనాటికి మాసిపోయేవే. అటువంటి వాటిమీద ప్రేమ పెంచుకుని దుఃఖించేకన్నా శాశ్వతమైన పరమాత్మపైన ప్రేమ పెంచుకుంటే మానవ జన్మ సార్థకం అవుతుంది. పైగా క్షణ భంగురమైన ఈ మానవ దేహము ఎంత సేపు ఉంటుందో కూడా లెక్కకట్టలేము. అటువంటి నీటిబుడగవంటి ఈ శరీరపోషణ చేయడం కంటే కూడా శ్రీకాళహస్తీశ్వరుడే సర్వమూ అని తలిచి అన్యపదార్థమేదీ లేదని తలపోస్తూ కేవలం నమశివాయ అన్న నామస్మరణచేస్తే చాలు.

ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతక పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ

ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతక పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ