నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శా నీ కారుణ్యము గల్గినట్టి నరుడే నీ చాలయంబుం జొరం
డే కార్పణ్యపు మాట లాడ నరుగం డెవ్వారితో వేషముల్
గైకోడే మతముల్ భజింపడిలనే కష్ట ప్రకారంబులం
జీకాకై చెడిపోడు జీవన దశన్ శ్రీకాళహస్తీశ్వరా!
భావము: శ్రీకాళహస్తీశ్వరా! ఈ లోకమున నీ దయకు పాత్రుడైన మానవుడు ఏ నీచ గృహములందు ప్రవేశింపడు. లోభ గుణములతో దీన భాషణములాడడు. ఎవ్వరినీ వంచింపబోడు. అన్యమతముల స్వీకరింపడు. ఎట్టి నికృష్ట విధానములచే వ్యాకులత చెంది నష్టపోడు. భగవంతుని అనుగ్రహాన్ని పొందిన ఏమానవునికైనా అశాశ్వతమైన సుఖాలు సుఖాన్ని వ్వవు. ఎవరినీ పరుషంగా దూషించనేరడు. ఎవరి హృదయాన్ని నొప్పింపడానికి ఇష్టపడడు. దీనత్వంతో మాట్లాడడు. ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా చలించడు. ఇది భగవద్భక్తుల్లో ఉండే గొప్ప విశేషం.

ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతక పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ