నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్కకాంత మ చేతనం బయ్యు సవితృ
పాదములు సోకినంతనె ప్రజ్వరిల్లు
గాన నభిమానవంతుడెందైన శత్రు
కృత తిరస్కారమెట్లు సహింపనేర్చు?

భావము:సూర్యకాంతమణి అచేతనమైనప్పటికీ సూర్యుని కిరణాలు సోకగానే మండిపోతుంది. సూర్యుని కిరణాలు తనపై పడిన వెంటనే కోపోద్రిక్తమవుతుందని భావము. ఆ విధంగానే అభిమానవంతులు ఇతరులవల్ల కలిగే పరాభవాన్ని సహించి ఊరకుండరు. అభిమానం కలవాడు సుంతైనా పరుల తిరస్కారాన్ని ఓర్వలేడు.

ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ

ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ