నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుకృతాత్ములు రససిద్ధులు
సుకవీంద్రులు విజయనిధులు సుమ్ముతదీయా
ధిక కీర్తి శరీరంబులు
ప్రకట జరామరణ జన్మ భయరహితంబుల్

భావము: ఆయా రసాలకు అనుగుణంగా వర్ణించే నైపుణ్యం కలవారు, చక్కని కృతులు రచించి ధన్యాత్ములైనవారు. అయిన కవీశ్వరులు, పండిత ప్రకాండులు తమ కీర్తి శరీరాలతో సిద్ధౌషధ సేవచే జరామరణాలను అతిక్రమించిన యోగులవలె సర్వదా ప్రకాశిస్తూ వుంటారు. మహాకవులు, మహా పండితులు, మరణించినా కూడా వారు కీర్తిశరీరులై బ్రతికే వుంటారనే విషయాన్ని ఈ పద్యంలో కవి వివరించాడు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ