నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాతిరి మూషకంబు వివరంబొనరించి కరండబదమై
భీతిలి చిక్కి యాస చెడి పెద్దయు డస్సిన పామువాత సం
పాతము చెందె దాని దిని పాము దొలంగె బిలంబుత్రోవనే
యేతఱి హానివృద్ధులకు నెక్కటి దైవమ్ కారణంబగున్

భావము: ఒక రాత్రి ఒక ఎలుక ఆహారం కోసం బుట్టకు రంధ్రం చేసి, అందులో దూరింది. అంతకుముందే ఒక పాము ఆ బుట్టలో వున్నది. అది ఆ బుట్టలో బద్ధమై ఇరకాటంతో శరీరమంతా కృశించి బయటకు వెళ్ళడానికి సాధ్యంకాక ఆకలితో శరీర పాటవం తప్పి డస్సిపోయి వుంది. ఎలుక లోపల ప్రవేశించగానే పాము దానిని తినివేసి ఆ ఎలుక చేసిన రంధ్రం గుండానే బయటకు పారిపోయింది. అందువలన బంధ మోక్షాలకు కానీ, మేలుకీళ్ళకుగానీ దైవమే కారణం కాని మరేమీ కాదు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె.