భక్తి కథలు

కాశీఖండం 146

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విధంగా శతకోటి సంఖ్యకల శత్రువుల్ని చెదిరిపోయి ఎగిరిపోవగా వూది, కటిక నవ్వు నవ్వి ఆ కాళరాత్రి ఆకాశవీధిని వింద్యాద్రి సీమకి అరిగింది. రాక్షసుడు కూడ ఆ శక్తిని వెంటనంటి వెడలసాగాడు.
భూగోళ ఖగోళాల మధ్యభాగం నుంచి కోట్ల కొలది దనుజులు తన్ను కొలిచి నడిచిరాగా తాను కాళరాత్రి వెన్నుదగిలి దుర్గాసురుడు ఏకధాటిగా ఏగుదెంచాడు. అప్పుడు నూరుకోట్ల రథాలు, రెండు వందల అర్బుదాల గజాలు, కోటి అర్బుదాల అశ్వాలు, అసంఖ్యాకులు అయిన జోదులున్ను కొలిచి ఏతెంచే దుర్గాసురుడి అగ్రభాగాన ఆ వినువీధిని ఎదురులేని ఆటోపంతో చనుదెంచుతున్న మహాకాళరాత్రిని దవ్వు దవ్వుల పరికించాడు. ఆ మహాశక్తి సహస్ర ఆయుధాలు తన వేయి చేతులతో ధరించి వుంది. మహాతేజస్విని అయి నలువైపుల విస్తరించి వుంది. మహాఘోరాలైన ఆయుధ పరంపరల ధగధగలతోడి తేజశ్చటల్ని ఆకాశం అంతటా వ్యాపింపజేస్తోంది.
ఉదయిస్తున్న సూర్యచంద్రుల మండల సహస్రాల కాంతి జ్యోతిర్మండల తేజశ్చక్ర మధ్యవర్తిని అయి విలసిల్లుతోంది. లావణ్య జలధి చంద్రికయున్ను, త్రైలోక్య కల్యాణ మండపానికి మంగళదీపమున్ను ఆ పార్వతీదేవి సన్నద్ధురాలై నిలిచింది.
ఆ సమయంలో కాళరాత్రి పర్వత రాజకుమారిక చరణాలకి, తన కరద్వయం మోడ్చి ప్రణమిల్లి ఆదినుంచీ తన వృత్తాంతాన్ని అంతా పూసగ్రుచ్చిన చందంగా చక్కగా చెప్పింది.
అనంతరం ఆ దుర్గాసురుడు వింధ్యారణ్య మధ్య ప్రదేశంలో తన సేనని విడియించాడు. జంభుడు, మహాజంభుడు, కుజంభుడు, వికటాననుడు, లంబోదరుడు, పింగాక్షుడు, మహిషగ్రీవుడు, మహోగ్రుడు, అత్యుగ్ర విగ్రహుడు, క్రూరాస్యుడు, క్రోధనుడు, సంక్రందనుడు, మహాభయుడు, జితాంతకుడు, దుందుభి, వృకాననుడు, సింహాస్యుడు, సూకరాస్యుడు, ఖరుడు, శివారావుడు, మహోత్కలుడు శుకతుండుడు, ప్రచండుడు, ముండుడు, మహాభీషణుడు మొదలైన సేనాపతుల్ని రావించి, అందరినీ కలయచూచి, బిగ్గరగా ఈ పగిది పలికాడు.
వింధ్యాచల విశాల శిలాభూమిని ఒక లేమ సాహసం అతిశయింపగా మనలను ఎదిరించి వుంది. ఈ సుకుమారిని, ఈ తలోదరిని పరిమార్చక పట్టుకొని తేవలసింది. తామరసాక్షుల్ని, కుసుమ కోమలుల్ని సంహరించడం ఒక శౌర్యమా? ఒక వీరకృత్యమా?
చలంతోకాని, బలం ప్రయోగించి కాని లేక బతిమాలి బామాలి కాని ఆ తరుణిని వేగంగా కందకుండ గాజు వారకుండ బంధించికొని రావలసింది. ఏ వీరుడైనా ఆ రాజీవలోచననని కసుగందకుండ ఏ ఉపాయ మార్గంతో కొనివచ్చిన తత్‌క్షణం ఆ వీరుణ్ణి మెచ్చి, మీదటి బహుమానాలు వేయి అలా వుండనీ! ఆ వీర శిఖామణికి ఇంద్రలోక రాజ్య పదవిని ఈ ఉన్నవారందరూ సాక్షులుగా ఇచ్చాను. పునరాగమనానికై వెళ్లండి’’ అని పలికాడు.
వెనె్వంటనే రాక్షసులు సర్వ సన్నద్ధులై ప్రళయకాలంలో జలధులు చెలియలి కట్టలు తప్పిన వడువున లోకాలు ముంచివేసి, హైమవతిపై విజృంభించి, శంఖాలు, భేరులు, పటహాలు, కాహళుల ధ్వానాలు అంతరిక్ష ప్రదేశాన నిండుగా వ్యాపింపచేసి ధరణీచక్రం వడవడవణక నడచారు. ఆ సమయంలో శక్తి దుర్గాసురుడితోను, ఆ రాక్షసుడు శక్తితోను తలపడ్డారు. అప్పుడు వింధ్యాద్రిమీద ప్రసిద్ధాలు, బహువిధాలు, నిష్ఠురాలు అయిన ఆయుధాలతో ఆశ్చర్యానందంగా ద్వంద్వ యుద్ధం జరిగింది.
త్రైలోక్య విజయశక్తితో దుర్దర దనుజుడు, తారతో దుర్ముఖుడున్ను, జయతో ఖరుడున్ను, త్రైలోక్య సుందరితో సీరపాణియున్ను పోరు సల్పసాగారు.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి